సింహపురి ప్రీమియర్ లీగ్ ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా సింహపురి ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశాయి. ఆదివారం బుజబుజనెల్లూరులోని సీఐఏ క్రీడా మైదానంలో పోటీలను ఏసీఏ మౌలిక సదుపాయాల చైర్మన్ పి.విజయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ దోహదపడుతుందన్నారు. క్రీడాకారులందరూ అవకాశాలను అందిపుచ్చుకుని రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌డీసీఏ సంయుక్త కార్యదర్శి కె.గిరీష్, కోశాధికారి ఎస్‌కే అబూబకర్, కేర్ టేకర్ శ్రీనివాసరెడ్డి, ఏసీఏ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, టోర్నీ నిర్వాహక కమిటీ చైర్మన్ వంశీకుమార్, అసోసియేషన్ సభ్యులు కె.శ్రీనివాసులు, లీలామోహన్‌రెడ్డి, ఎస్.రాజశేఖరరెడ్డి, మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ పాల్గొన్నారు.
తొలిరోజు
ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిరోజు గూడూరు రాయల్ చాలెంజర్స్, ఆత్మకూరు రేంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో గూడూరు జట్టు గెలుపొందింది.


