
బ్లాక్ ఫిల్మ్‌పై తనిఖీలు
నెల్లూరు (టౌన్): రవాణా నిబంధనలకు విరుద్ధంగా కార్లు, బైక్‌లకు ఉన్న నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్‌పై ఇన్‌చార్జి ఆర్టీఓ బాలమురళి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలను శనివారం నిర్వహించారు. ముత్తుకూరు గేట్ సెంటర్‌లో జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న 38, బ్లాక్‌ఫిల్మ్ బిగించిన ఐదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న నాలుగు, సరైన పత్రాల్లేకుండా తిరుగుతున్న మూడు.. మొత్తం 50 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఎమ్వీఐలు రఫీ, పవన్ కార్తీక్, ఏఎమ్వీఐలు పూర్ణచంద్రరావు, స్వప్నిల్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.