
యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ ఆదేశించారు. నెల్లూరులోని కోటమిట్టలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ నెల్లూరు టౌన్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ అదనపు విద్యుత్ లోడును క్రమబద్ధీకరించేందుకు విద్యుత్ శాఖ కల్పించిన 50 శాతం రాయితీని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీని గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తుందన్నారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు వినియోగదారులు స్వచ్ఛందంగా లైట్లు ఆపివేసి ఎర్త్‌అవర్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సర్‌చార్జ్ రద్దును వినియోగిం చుకోవాలని ఈ అవకాశం ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉంటుందన్నారు. పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నగరంలోని అన్ని సబ్‌స్టేషన్లలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల నుంచి విద్యుత్ సిబ్బందికి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని వారి వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్, డీఈఈలు కిరణ్, అశోక్, సునీల్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ సురేఖ, ఆశాలత, ఏఈలు కృష్ణవేణి, విజయ్‌కుమార్, దామోదర్‌రెడ్డి, విజయ్, లక్ష్మీనారాయణ, సుధాకర్, నస్రూల్లా, సూర్య గాంధీ, మునిశేఖర్, గోపాలకృష్ణ, జేఏఓ పద్మజ తదితరులు, పాల్గొన్నారు.
నేటి రాత్రి గంటసేపు
ఎర్త్‌అవర్‌ను పాటిద్దాం
సబ్‌స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో
ఉండాలి
ఎస్‌ఈ విజయన్