● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం | - | Sakshi
Sakshi News home page

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

Published Wed, Mar 26 2025 12:49 AM | Last Updated on Wed, Mar 26 2025 12:46 AM

● డ్వ

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

పనికి పోతేనే ఇల్లు జరిగేది

మాది పేద కుటుంబం. అందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే ఇల్లు జరుగుబాటు ఉంటుంది. పొదుపు సంఘంలో 20 ఏళ్లుగా ఉంటున్నా. పొదుపు ద్వారా కుటుంబం జరుగుబాటు కావడానికి ఎలాంటి జీవనోపాధి సమకూరలేదు. అందుకే బతకడానికి కూలి పనులు చేసుకుంటున్నాను.

– పానబోయిన శేషమ్మ, అమ్మవారిపాళెం, గుడ్లూరు మండలం

దశాబ్దాలుగా ఇప్పటికీ కూలీలుగానే..

గత ప్రభుత్వంలో వ్యాపారులుగా రాణించిన మహిళలు

డ్వాక్రా సంఘాలతో

సూపర్‌ మార్ట్‌ల ఏర్పాటు

కూటమి ప్రభుత్వం రాగానే

కుప్ప కూల్చేసిన వైనం

రుణాలు లేవు.. ఆర్థిక సాయం లేదు.. పారిశ్రామికవేత్తలు ఎలా..!

● ఈ ఫొటోలో ఉన్న పొదుపు మహిళ పేరు డేగా శాంతమ్మ. కావలి మండలం చలంచర్ల పంచాయతీ పెద్దారం గ్రామం. డ్వాక్రా సంఘాల్లో 15 ఏళ్లుగా సభ్యురాలుగా ఉంది. జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటోంది. తమ గ్రామానికి 10 కి.మీ. దూరంలో ఉన్న కొత్తపల్లి గ్రామానికి వచ్చి కూలి పనులు చేస్తోంది.

కావలి:

‘‘పొదుపు చేయడంలో మహిళలే మహారాణులు. పొదుపు అనే ఆర్థిక ఉద్యమంలో పేద మహిళలు చైతన్య వంతులైతే వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పొదుపు మహిళలను తమ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం.’’

– ఇటీవల డీఆర్‌డీఏ పీడీల సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలివి.

ఇలాంటి మాటలు వినడానికి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనందించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల సృష్టికి తానే ఆద్యుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆ డ్వాక్రా మహిళల ఎదుగుదలకు ప్రణాళికాబద్ధంగా ఏనాడు చిత్తశుద్ధిగా వ్యవహరించడలేదు. వీరిని దాదాపు 30 ఏళ్లుగా తన ప్రచార సభల్లో జనసమీకరణకు వాడుకున్నారే తప్ప.. వారి అభివృద్ధికి పాటుపడిన చరిత్ర లేదు. పొదుపు మహిళలకు అరకొరగా రుణాలిచ్చి.. వాటిని ఇంటి ఖర్చులకు వాడుకునేలా చేస్తూ.. జీవితాంతం అప్పులు తీర్చుకునే విధంగా వారిని ఆ చట్రంలో బిగించారు. 2014 ఎన్నికల్లో ప్రతి డ్వాక్రా మహిళ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు పదివేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆనాడు చంద్రబాబు మాటలు విని అప్పులు కట్టకుండా ఉండిపోయి డీఫా ల్టర్లు అయ్యారు. చివరకు వడ్డీలకు చక్రవడ్డీల లెక్కన అప్పులు కట్టారు.

నాలుగుసార్లు

అధికారంలో ఉండి..

టీడీపీ ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. గతంలో పద్నాలుగేళ్లుగా.. తాజాగా పది నెలలుగా ఎంత మంది మహిళలను పారిశ్రామివేత్తలుగా నిలబెట్టిందో ఈ ప్రభుత్వం చెప్పగలదా?. అధికారం కోసం అమాయక డ్వాక్రా మహిళలను ఆశల పల్లకీల్లో ఊగిసలాడించి పబ్బం గడుపుకోవడం టీడీపీ నైజంగా మారింది. నాలుగు దశాబ్దాల కిందటి నుంచి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటవుతున్నాయి. లక్షలాది మంది మహిళలు ఆయా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి ప్రభుత్వం నుంచి రుణ సాయం పొందుతున్నారు. కొన్ని గ్రూపుల వారు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ ఎంత మంది డ్వాక్రా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు అని ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం సరే.. ఆచరణే కార్యరూపం దాల్చడం లేదు. పొదుపు గ్రూపుల పర్యవేక్షకులు లంచాల దోపిడీతో మహిళలు అనుకున్న స్థాయిలో ఆర్థిక ప్రగతి సాధించలేపోయారనేది జగద్విదితమే.

మంత్రి ప్రకటనపై విస్మయం

అయితే పాలకులు మాత్రం పొదుపు గ్రూపుల్లో ఉన్న పేద మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని ప్రకటిస్తుండటం విస్మయ పరుస్తోంది. వాస్తవంగా పొదుపు గ్రూపులో ఉన్న మహిళలు పొదుపు సంఘాలు ద్వారా సమకూరుతున్న అరకొర నగదుతో కొత్తగా వ్యాపారాలు చేయడానికి సాధ్యపడటం లేదు. అప్పటికే కుటుంబం చిరు వ్యాపారాలు, చిరు అమ్మకాలు చేస్తుంటే పొదుపు సంఘాలు ద్వారా వచ్చే నగదును అందులో పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. అలా చేస్తున్న వారినే అధికారులు కూడా పొదుపు మహిళలు ఉపాధి పొందుతున్నారంటూ ఊదరగొడుతున్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు కుటుంబానికి స్థోమత ఉంటే గృహిణులుగా స్థిరపడుతున్నారు. కుటుంబానికి స్థోమత లేకపోతే కుటుంబ పోషణ కోసం కూలీలుగా పనులకు కూడా పోతున్నారు.

● ఈ ఫొటోలో ఉన్న మహిళ ఆదెమ్మ. ఈమె శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం నుంచి కావలి పట్టణానికి వచ్చి రోడ్డు మార్జిన్‌లో కూర్చొని జీడిపప్పు అమ్మకాలు చేస్తోంది. పలాసలోని జీడిపప్పు వ్యాపారులు ఆమెకు రోజుకు రూ.150 కూలి ఇస్తారు. గడిచిన 20 ఏళ్ల నుంచి ఈమె పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా ఉంది. కానీ జీవనోపాధి కోసం సొంతూరు నుంచి 700 కి.మీ. దూరంలో ఉన్న కావలికి వచ్చి కూలి పని చేస్తోంది.

● ఈ మహిళ పేరు కాకు పద్మమ్మ. కావలి మండలం పెద్దారం గ్రామం. పొదుపు గ్రూపులో 15 ఏళ్ల నుంచి ఉంటోంది. కుటుంబ జీవనం కోసం కూలి పనులు చేస్తోంది. పొదుపు గ్రూపు ద్వారా ఈమెకు జీవనోపాధి సమకూరలేదు.

పొదుపు గ్రూపు మహిళల సమావేశం

ధాన్యం ఆరబోసే పనిలో కూలీలుగా పొదుపు మహిళలు

వైఎస్సార్‌సీపీ పాలనలోనే ఆర్థిక స్వావలంబన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. ఎంతో మంది మహిళలు కుటీర పరిశ్రమల నుంచి చిన్న వ్యాపారులుగా స్వయం ఉపాధిలో ఎదిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదుపుల మహిళ రుణాలను మాఫీ చేసి నాలుగు దఫాలుగా చెల్లించారు. ఈ డబ్బులతోపాటు వైఎస్సార్‌ చేయూత పథకం, డ్వాక్రా రుణాలు కల్పించి ఈ మొత్తాలకు బ్యాంక్‌ల ద్వారా అదనపు రుణాలు అందించి వారి ఆర్థిక ప్రగతి బాటలు వేశారు. నగరాలు, పట్టణాల్లో డ్వాకా గ్రూపులను సమీకృతం చేసి వారితో సూపర్‌ మార్టులు ఏర్పాటు చేయించి మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి, వింజమూరు, కందుకూరుల్లోని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన మార్టులు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం మహిళలను ఏ విధంగా అభివృద్ధి చేస్తోందో తేటతెల్లమవుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో సభ్యులు – 4,00,064 మంది

గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపులు

– 39,249

పారిశ్రామిక, వ్యాపారవేత్తలు

– 0

కూలి పనులకు పోతుంటా

నేను 25 ఏళ్ల నుంచి పొదుపు గ్రూపులో ఉన్నా. పొదుపు సంఘం ద్వారా నాకు జీవనోపాధి ఏమీ కలగలేదు. కొద్దిగా డబ్బు చేతికందితే అరకొర ఖర్చులకు సరిపోతోంది. మళ్లీ రుణం చెల్లించాలి కాబట్టి కుటుంబ పోషణకు కూలి పనులకు పోతుంటాను.

– ఏకుల రమణమ్మ, పొదుపు మహిళ, అల్లూరు మండలం

కష్టం చేసుకొని బతకాలి

కష్టం చేసి బతుకుతున్నా. పొదుపు గ్రూపులో 16 సంవత్సరాలు నుంచి ఉన్నా. పొదుపు సంఘం ద్వారా బతకడానికి ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎక్కడ కూలి పనులు దొరికితే అక్కడికి వెళ్లి కూలి పనులు చేస్తాను. అలా చేసుకుంటేనే ఇల్లు జరుగుతుంది.

– మనెమ్మ, పొదుపు మహిళ,

చింతగుంట, అల్లూరు మండలం

పట్టణ పొదుపు గ్రూపులు

– 15,209

జిల్లాలో మొత్తం సభ్యులు – 5,51,166

మంది

పాతికేళ్లుగా టీడీపీ ఇదే చెబుతోంది

పొదుపు మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానని టీడీపీ పాతికేళ్లుగా ఇదే చెబుతోంది. పొదుపు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుతో పేద వర్గాల మహిళలు ఆర్థికంగా కొద్దిగా ఎదగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాని పొదుపు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కాదు.

– సి.శారద, సామాజిక కార్యకర్త, కావలి

పట్టణ గ్రూపుల్లోని సభ్యులు

– 1,51,102

No comments yet. Be the first to comment!
Add a comment
● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 1
1/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 2
2/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 3
3/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 4
4/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 5
5/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 6
6/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 7
7/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 8
8/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం 9
9/9

● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement