
హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయ్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇవి గత నెల 17వ తేదీన మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 174 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. చివరిరోజు జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 29,105 మందికి గానూ 28,870 మంది హాజరుకాగా.. 235 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌కు సంబంధించి 205 మందికి గానూ 181 మంది హాజరుకాగా.. 24 మంది గైర్హాజరయ్యారు. ఎగ్జామ్స్ ముగియడంతో విద్యార్థులు కేంద్రాల వద్ద ఉత్సాహంగా కనిపించారు. ప్రశ్నపత్రాలను చించి గాల్లోకి ఎగురేసి కేరింతలతో ఆనందాలను పంచుకున్నారు. కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రావడంతో సందడి వాతావరణం నెలకొంది. – నెల్లూరు(టౌన్)
నెల్లూరులో పరీక్ష కేంద్రం బయట ఇలా..

హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయ్

హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయ్