ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Published Wed, Mar 19 2025 12:05 AM | Last Updated on Wed, Mar 19 2025 12:05 AM

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ఇద్దరికి గాయాలు

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పెట్రోల్‌ బంకు సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటన మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి ఏఎస్‌పేటకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డీసీపల్లి పెట్రోల్‌ బంకు సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లోని ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement