పుచ్చసాగుతో నష్టం
నేను పుచ్చ సాగు చేసి నష్డపోయాను. గతంలో కొంతవరకు లాభం రావడంతో మళ్లీ సాగు చేశాను. ఈ పర్యాయం తీవ్రంగా నష్టం వచ్చేలా ఉంది. అధికారులు చొరవ తీసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలి.
– జి.హరి, రైతు, నావూరుపల్లి
రైతులకు గడ్డుకాలం
పుచ్చ సాగు చేసిన రైతులకు గడ్డుకాలం వచ్చింది. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు చేశాం. పెట్టుబడులు వచ్చినా సంతోషమే. రైతులు నేరుగా వెళ్లి బజార్లలో అమ్ముకుంటే కొంతవరకు మేలే. అయితే అందరూ ఆ పని చేయలేరు.
– కేతు రామిరెడ్డి,
ఎంపీటీసీ సభ్యుడు, దుగ్గుంట
ఆదుకోవాలి
పుచ్చ సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది దిగుబడి కూడా అంతంతమాత్రమే. పెట్టుబడులు వస్తే ఆదాయం వచ్చినట్లే. దళారులు దారుణంగా అడుగుతున్నారు.
– వి.మాలకొండారెడ్డి, రైతు, నావూరు
రైతు బజార్లలో
అమ్ముకోవచ్చు
రైతులు ముందుకొస్తే రైతు బజార్లలో అమ్ము కునే అవకాశం కల్పిస్తాం. నెల్లూరు, కావలి తదితర ప్రాంతాల్లో కాయలను విక్రయించుకోవచ్చు. పుచ్చ ధరలు దారుణంగా పడిపోలేదని భావిస్తున్నాం. మమ్మల్ని సంప్రదిస్తే సలహాలిస్తాం.
– సుబ్బారెడ్డి,
జిల్లా ఉద్యానాధికారి, నెల్లూరు
●
పుచ్చసాగుతో నష్టం
పుచ్చసాగుతో నష్టం
పుచ్చసాగుతో నష్టం


