నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్‌సైట్, నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పేరు, హోదా, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ జరిగిందో సంబంధిత ఆధారాలతో చూపించాలన్నారు.
ఎస్సీ కార్పొరేషన్
ఈడీగా శ్రీనివాసులు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా ఎస్సీ కార్పొరేషన్ పూర్తి అదనపు బాధ్యతల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాలసాని శ్రీనివాసులు మంగళవారం దర్గామిట్టలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ పథకాలను లబ్ధిదారులకు సత్వరమే చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు. పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అర్హులు వినియోగించుకునేలా చేస్తామన్నారు.
ఐసీడీఎస్ పీడీ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (పొగతోట): ఐసీడీఎస్ పీడీ (ఎఫ్‌ఏసీ)గా నిర్మలారెడ్డిని నియమించారు. ఆమె మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిర్మలారెడ్డి ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెను ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూగజీవాలపై దూసుకెళ్లిన
భారీ వాహనం
● 11 గొర్రెలు మృతి, కాపరులకు
తీవ్రగాయాలు
మర్రిపాడు: మండలంలోని పొంగూరు కండ్రిక సమీపంలో అచ్చమాంబ ఆలయ సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం ఓ గొర్రెల మందపైకి ఓ భారీ వాహనం దూసుకెళ్లింది. మేత కోసం ఇర్లపాడు నుంచి వెంగంపల్లి సిరివెళ్ల గ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి నాగయ్యకు తీవ్రగాయాలు కాగా సన్ను రమణయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీసీపల్లిలో 461 పొగాకు
బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 461 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 503 బేళ్లు రాగా 461 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.278.17 నమోదైంది. వేలంలో 61,006 కిలోల పొగాకును విక్రయించగా రూ.169,70,309 వ్యాపారం జరిగింది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
28లోపు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు
28లోపు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు