
రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి స్లాట్ బుకింగ్
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని బుధవారం ఆర్‌ఓ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. జిల్లాలోని ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలాఖరు నాటికి అమలు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కండలేరులో
48.517 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 48.517 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1320, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
జలాశయం (ఫైల్)