
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
● 10 సవర్ల బంగారం, 5 కిలోల వెండి, రూ.3 లక్షల నగదు అపహరణ
కందుకూరు: పట్టణంలోని వాసవీనగర్‌లో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడి సమాచారం మేరకు.. వాసవీనగర్‌కు చెందిన మోటుమర్రి కోటేశ్వరరావు మ్యారేజ్ మీడియేటర్‌గా పనిచేస్తున్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకునే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. 10 సవర్ల బంగారం, 5 కిలోల వెండి, రూ.3 లక్షల నగదు అపహరించినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
వెబ్‌సైట్‌లో
సీనియార్టీ జాబితా
నెల్లూరు (టౌన్): జిల్లాలో సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ తుది జాబితాను డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్‌మాస్టర్ పదోన్నతి కోసం జాబితాను కూడా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17వ తేదీలోపు తగిన ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.