అటవీ భూమి కబ్జాకు యత్నం | - | Sakshi
Sakshi News home page

అటవీ భూమి కబ్జాకు యత్నం

Published Sat, Mar 22 2025 12:12 AM | Last Updated on Sat, Mar 22 2025 12:12 AM

అటవీ భూమి కబ్జాకు యత్నం

అటవీ భూమి కబ్జాకు యత్నం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలోని తోపుగుంట సమీపంలోని పది ఎకరాల అటవీ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. ఆ భూమి సోమశిల అనుసంధానమైన చైన్నె కాలువ సమీపంలో ఉండటం గమనార్హం. రూ.కోట్లు విలువ చేసే భూమిని కలువాయికి చెందిన ఓ వ్యక్తి చదును చేసి సాగు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. అలాగే ఆ భూమి సమీపంలోనే మరో 4.88 సెంట్లు ఓ వ్యక్తికి అసైన్‌మెంట్‌ పట్టా ఇవ్వగా.. దానిని కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేసి మొత్తంగా సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ తంతు సంబంధిత అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement