
ఈత కొట్టేందుకు వెళ్లి..
● ఉత్తరకాలువలో కొట్టుకుపోయి
యువకుడి మృతి
● మినగల్లులో విషాదం
సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని మినగల్లు గ్రామంలో ఓ యువకుడు ఈతకెళ్లి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ హుస్సేన్, దిల్షాద్ దంపతులకు షేక్ మస్తాన్‌బాషా (21) అనే కుమారుడు ఉన్నాడు. అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రంజాన్ సందర్భంగా సోమవారం సాయంత్రం అతను తన స్నేహితులతో కలిసి సోమశిల ఉత్తరకాలువ వద్దకు వెళ్లాడు. సరదాగా ఈత కొడుతుండగా నీట మునిగి కొట్టుకుపోతుండటంతో స్నేహితులు గమనించి రక్షించేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మస్తాన్ గల్లంతయ్యాడని నిర్ధారించి అనంతసాగరం పోలీసులకు రాత్రి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవాహం అధికంగా ఉందని మస్తాన్ ఆచూకీ దొరకదని భావించారు. జలాశయం నుంచి కాలువకు నీటి విడుదలను ఆపివేయించారు. మంగళవారం ఉదయానికి నల్లరాజుపాళెం రోడ్డు కాలువలో మృతదేహం లభ్యం కాగా దానిని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించామని ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. మస్తాన్‌బాషా మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ఈత కొట్టేందుకు వెళ్లి..