● ముఖ్యఅతిథిగా హైకోర్టు జడ్జి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు(లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమం ఈనెల 29వ తేదీ శనివారం సాయంత్రం 6.30కు జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతుందని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్య యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసులురెడ్డి, విశిష్ట అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి విచ్చేస్తారన్నారు. న్యాయవాదులు పాల్గొని వేడుకల్ని విజయవంతం చేయాలని కోరారు.
48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నెల్లూరు రూరల్: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.కార్తీక్ తెలిపారు. బుధవారం 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా ప్రకటన విడుదల చేశారు. రూ.100.9 కోట్లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు.
పదిమంది విద్యార్థుల ఎంపిక
వెంకటాచలం: ఈనెల 28వ తేదీన గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయిలో జరిగే వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2025 కార్యక్రమానికి పదిమంది విద్యార్థులను ఎంపిక చేశారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో పదిమందిని ఎంపిక చేయగా బుధవారం వీసీ అల్లం శ్రీనివాసరావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభినందించారు.