డెలివరీ బాయ్‌గా..
పోలయ్య బేల్దారి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత సురేష్‌పై పడింది. అతను క్రీడలను పక్కనపెట్టాడు. 2022లో పోలయ్య మృతిచెందడంతో అప్పటి నుంచి సురేష్ చిన్నపాటి పనులు చేస్తున్నాడు. అన్నకు వివాహమైంది. తమ్ముడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ కొంతకాలం సచివాలయ వలంటీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా ఉన్నాడు. మొండి చేతులతో స్కూటీ నడుపుతూ రోజుకు 20కి పైగా అడ్రసుల్లో వస్తువులను డెలివరీ చేస్తుంటాడు. శారీరకంగా కష్టంగా ఉన్నా కుటుంబం కోసం నిత్యం సుమారు వంద కిలోమీటర్ల మేర రాకపోకలు చేస్తున్నాడు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తూనే ఉంటాడు. ఒక్కో డెలివరీకి ఇంత మొత్తంలో అని ఇస్తుండటంతో ఎక్కువగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఎంకామ్ ఫైనలియర్ చదువుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment