రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతి
నెల్లూరు సిటీ: ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్లకు ఇక స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిర్దేశించిన సమయంలో సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లాలోని ఆర్‌ఓ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి దీనిని ప్రారంభించనున్నారు. నెలాఖరు నాటికి దశల వారీగా అన్ని సబ్ రిసిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు పేర్కొన్నారు.
ఎలా అంటే..
స్లాబ్ బుకింగ్ విధానంలో గంటకు ఆరు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వినియోగదారులు మంచిరోజు, వారికి అనుకూలమైన రోజులో రిజిస్ట్రే షన్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. నిర్దేశించిన సమయానికి కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడు రాలేని పరిస్థితుల్లో తిరిగి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందుకు గానూ ప్రభుత్వానికి మరో రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
అమలు చేస్తాం
స్లాట్ బుకింగ్ విధానాన్ని మొదట నెల్లూరు ఆర్‌ఓ కార్యాలయంలో వచ్చే నెల 2వ తేదీన ప్రారంభిస్తాం. నెలాఖరుకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తాం.
– బాలాంజనేయులు,
జిల్లా రిజిస్ట్రార్
2వ తేదీ నుంచి
నెల్లూరులో ప్రారంభం
గంటకు ఆరు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం
స్లాట్ తేదీల మార్పునకు
రూ.200 చెల్లించాల్సిందే..


