కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో.. | - | Sakshi
Sakshi News home page

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..

Published Wed, Mar 19 2025 12:05 AM | Last Updated on Wed, Mar 19 2025 12:05 AM

కలిగి

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..

కలిగిరి: జిల్లాలోని కలిగిరి, మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. వాటి పరిధిలో 2,963 బ్యారెన్ల ద్వారా 3,469 మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. 2025 – 26 సీజన్‌కు సంబంధించి 12.65 మిలియన్‌ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఉంది. పెరిగిన సాగు విస్తీర్ణం, అధిక దిగుబడుల దృష్ట్యా 18.30 మిలియన్‌ కేజీల వరకు ఈ సీజన్‌లో అమ్మకాలు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

పొగాకు గ్రేడింగ్‌ సమయంలో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉంది. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం వరకు మొదటి రకం (బ్రైట్‌ గ్రేడ్‌) వచ్చినట్లు రైతులు, అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్‌ ఉత్పత్తులు కూడా బాగున్నట్టు తెలుస్తోంది.

భారీగా పెరిగిన

పెట్టుబడులు

ఈ ఏడాది పొగాకు సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. గత రెండు సంవత్సరాలుగా మంచి ధరలు లభిస్తుండటంతో ఈసారి సాగు చేయడానికి రైతులు అమితంగా ఆసక్తి చూపారు. దీంతో ఈ ప్రాంతంలో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్‌ కౌలు ఈసారి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలికింది. పొలం కౌలు, కూలీల రేట్లు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం కందుకూరు–1లో వేలం జరుగుతుండగా గరిష్ట ధర కిలోకు రూ.280 పలికింది. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది రూ.300 లభించేలా చూడా లని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలోని రైతు లు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులు : 3,469

బ్యారెన్లు : 2,963

బోర్డు అనుమతించిన సాగు విస్తీర్ణం : 9,931 హెక్టార్లు

రైతులు సాగు చేసిన విస్తీర్ణం : 9,973 హెక్టార్లు

బోర్డు అనుమతించిన ఉత్పత్తి : 12.65 మిలియన్‌ కేజీలు

రైతులు పండించిన ఉత్పత్తి (అంచనా) : 18.30 మిలియన్‌ కేజీలు

సూచనలు పాటించాలి

ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రైతు లు అవశేషాలు లేని, హీట్‌ లేకుండా గ్రేడ్‌ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది.

– మహేష్‌ కుమార్‌, వేలం

నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు

పెట్టుబడులు పెరిగాయి

ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. సీజన్‌ ప్రారంభం నుంచే మంచి ధరలు లభిస్తాయని ఎదురు చూస్తున్నాం. సరాసరిన కిలో రూ.300 తగ్గకుండా ఉంటేనే రైతులు గట్టున పడతారు.

– పూసాల అక్కపునాయుడు,

రావులకొల్లు, కలిగిరి మండలం

నేటి నుంచి కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం

సాగు సమయంలో పెరిగిన

పెట్టుబడులు

సరాసరిన రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్‌

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో.. 
1
1/4

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో.. 
2
2/4

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో.. 
3
3/4

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో.. 
4
4/4

కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement