
విద్యార్థుల ప్రాజెక్ట్‌లకు బహుమతులు
నెల్లూరు(టౌన్): నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో ఏపీ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈఎండీపీ) 2024 – 25 కార్యక్రమాన్ని బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ప్రారంభించారు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 8 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ఈ ప్రోగ్రాంలో ప్రతిభ చూపిన ఒట్టూరులోని ఏపీఎంఎస్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్‌కు ప్రథమ, ఇంకా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్‌కు ద్వితీయ బహుమతి అందజేశారు. సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఈఎండీపీ ఎక్స్‌పో జోనల్ మేనేజర్ నీలిమ, డీసీఈబీ సెక్రటరీ రామ్‌కుమార్, ఆత్మకూరు డిప్యూటీ డీఈఓ జానకిరామ్, ప్రధానోపాధ్యాయులు రాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత భవిత
● పాలిసెట్, ఏపీఆర్‌జేసీ అవగాహన సదస్సుకు స్పందన
తిరుపతి ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉంటుందని తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం ఆ విద్యాసంస్థలో నిర్వహించిన పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ నమూనా పరీక్ష, అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్హతతో ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌బీ, రైల్వే, బెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్టీసీ, విద్యుత్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, అలాగే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్, 25న ఏపీఆర్‌జేసీ ప్రవేశపరీక్షలు జరుగుతాయన్నారు. 35 ఏళ్లుగా సైనిక్, నవోదయ, పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ వంటి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ర్యాంక్‌లు సాధిస్తూ ప్రవేశాలు పొందుతున్నట్టు చెప్పారు. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

విద్యార్థుల ప్రాజెక్ట్‌లకు బహుమతులు