
దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(అర్బన్): సదరం క్యాంపునకు వచ్చే దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జరుగుతున్న దివ్యాంగుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ సదరం క్యాంపును కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ను త్వరగా చేసి అదేరోజు వైద్యపరీక్షలు పూర్తి చేసి పంపాలని సూచించారు. సమయం చాల్లేదంటూ దివ్యాంగులను మరోరోజు పిలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగులకు ఐడీ నంబర్ ఇచ్చే ప్రక్రియను ఆన్‌లైన్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారంటూ సంబంధిత సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ తాము దూరప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తున్నామని, వెరిఫికేషన్ ప్రక్రియను ఆత్మకూరు, కావలి, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, డాక్టర్ గంగాధర్, డాక్టర్ మస్తాన్‌బాషా, అడ్మిని స్ట్రేషన్ అధికారులు డాక్టర్ కళారాణి, డా.సుశీల్, ఏడీ ఏడుకొండలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment