1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత | - | Sakshi
Sakshi News home page

1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత

Mar 24 2025 6:25 AM | Updated on Mar 24 2025 6:24 AM

ఉద్యోగులు, కార్మికులు, రైతులకు రూ.కోట్లలో బకాయిలు

2004లో అప్పటి సీఎం వైఎస్సార్‌ హయాంలో అన్ని బకాయిలు చెల్లింపు

ఫ్యాక్టరీని పునః ప్రారంభించిన వైనం

2013లో మళ్లీ మూతపడిన పరిస్థితి

ఫ్యాక్టరీని తెరిపిస్తానని యువగళం పాదయాత్రలో లోకేశ్‌ హామీ

అధికారంలోకి వచ్చి పది నెలలైనా

ఆ ఊసే లేదు

కోవూరు: జిల్లాలో డెల్టా ప్రాంతమైన కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలో 1979 ఫిబ్రవరిలో 124 ఎకరాల విస్తీర్ణంలో కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రోజుకు 1,250 మెట్రిక్‌ టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో ప్రారంభించిన ఫ్యాక్టరీ.. కాలక్రమంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగడంతో రోజుకు 2,500 మెట్రిక్‌ టన్నుల క్రషింగ్‌ సామర్థ్యానికి చేరింది. జిల్లాలో కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంతోపాటు పొదలకూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది రైతులు చెరకు సాగు చేపట్టారు. వందలాది మంది కార్మికులతో రేయింబవళ్లు ఫ్యాక్టరీ వైభవంగా నడిచేది. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్‌ రంగంలోని షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయాలనే జపంతో వాటి మనుగడను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 1999లో కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేశారు. అప్పటికే ఫ్యాక్టరీకి చెరకు తొలిన రైతులకు కోట్లాది రూపా యల బకాయిలు పెండింగ్‌లో ఉన్నా.. రూపాయి చెల్లించకుండా మూతవేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ లో శాశ్వత, క్యాజువల్‌ ఉద్యోగులు, కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కనీసం వారికి పరిహారం కూడా ఇవ్వకపోడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

2004లో పునఃప్రారంభించిన వైఎస్సార్‌

కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితిని తెలుసుకున్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే 2004లో క్రషింగ్‌ సీజన్‌కు ముందే రైతులు, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించారు. ఫ్యాక్టరీ మెషినరీ తుప్పు పట్టిపోవడంతో నిధులు కేటాయించి పునరుద్ధరణ చేశారు. అప్పటి నుంచి సజావుగా నడుస్తున్న షుగర్‌ ఫ్యాక్టరీ వైఎస్సార్‌ అకాల మరణంతో ఒడిదొడుకులకు గురైంది. నష్టాలో ఊబిలో కూరుకుపోవడంతో 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో అర్ధాంతరంగా మూత పడింది.

2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం

2014 ఎన్నికల ప్రచారంలో కోవూరుకు వచ్చిన చంద్రబాబు షుగర్‌ ఫ్యాక్టరీని తాను తిరిగి పునరుద్ధరించి రైతులకు, కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు షుగర్‌ ఫ్యాక్టరీ విషయాన్ని విస్మరించారు. కమిటీల పేరుతో రైతులు, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లూ కాలయాపన చేశారు.

చెరకు సాగు నిలిచిపోవడంతో..

దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో జిల్లాలో చెరకు సాగును రైతులు పూర్తిగా మానే శారు. తిరిగి ఫ్యాక్టరీ ప్రారంభించినా చెరకు పంట అందుబాటులో లేని కారణంగా క్రషింగ్‌ అసాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ నివేదికలో పేర్కొంది. గతంలో చెరకు సాగు చేసిన భూముల్లో ప్రత్యామ్నాయంగా వరి సాగు చేస్తుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేసినా మళ్లీ మూతపడే పరిస్థితి అనివార్యమవుతుందని కమిటీ స్పష్టం చేసింది.

యువగళంలో లోకేశ్‌ హామీ

కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి తిరిగి పూర్వ వైభవాన్ని తెస్తానని లోకేశ్‌ ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని, ఉద్యోగులు, కార్మికుల వేతనాల బకాయిలు చెల్లిస్తామని గొప్పలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఆ ఊసేలేదు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫ్యాక్టరీ మూత పడడానికి తాను అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే కారణమని తెలుసుకోకుండా, అధికారంలో ఉండి పది నెలలుగా అసమర్థత ప్రదర్శిస్తూ గత ప్రభుత్వం, పాలకులపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ

జిల్లాకే తలమానికంగా కో–ఆపరేటివ్‌ రంగంలో ఏర్పాటైన కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ టీడీపీ హయాంలో చంద్రబాబు అందుకున్న ప్రైవేటీకరణ జపంతో మూత పడింది. దీంతో వందలాది ఉద్యోగ, కార్మిక కుటుంబాలు, వేలాది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ వాగ్దానాలు చేశారే తప్ప పట్టించుకోలేదు. తాజాగా అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఆ ఊసే లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీపై అసత్యాలు మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత 1
1/2

1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత

1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత 2
2/2

1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement