మైనార్టీల సంక్షేమమే జగన్ ధ్యేయం
ముత్తుకూరు: ముస్లింల సంక్షేమానికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముత్తుకూరులోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలను ఆదివారం ఆయన నిర్వహించారు. మైనార్టీ నేత అబ్దుల్ రహీమ్, ఎంపీటీసీ సభ్యుడు నవీద్‌బాషా, బడాభాయ్ తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన కాకాణి మాట్లాడారు. ముస్లింలకు అండగా ఉంటామన్నారు. తొలుత కాకాణికి ఘన స్వాగతం పలికారు. పార్టీ మండలాధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, సీపారెడ్డి రామ్మోహన్‌రెడ్డి, దువ్వూరు కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఇఫ్తార్ విందుకు హాజరు
Comments
Please login to add a commentAdd a comment