పెద్దశంకరంపేట : మండలకేంద్రంలోని ప్రియాంక కాలనీలో మంగళవారం అర్ధరాత్రి హైటెన్షన్ వైరు తెగిపడింది. అయితే ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. కాలనీ మీదుగా ఏర్పాటు చేసిన హైటెన్షన్ వైరు మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు తెగి 11 కేవీ వైరుపై పడింది. దీంతో కాలనీలోని పలు ఇళ్లలో గల టీవీలు, గృహోపకరణాలు కాలిపోయాయి.
దీంతో ఆందోళన చెందిన కాలనీ వాసులు విషయాన్ని విద్యుత్ సిబ్బందికి తెలియజేశారు. వారు వచ్చి సరఫరాను నిలిపివేశారు. బుధవారం ఉదయం వచ్చి విద్యుత్ తీగలను సరిజేసి సరఫరాను పునరుద్ధరించారు.
తెగిపడ్డ హైటెన్షన్ వైరు
Published Thu, Sep 25 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement