హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు | Five boys suffer burn injuries during Muharram procession | Sakshi
Sakshi News home page

హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు

Published Wed, Nov 5 2014 4:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

Five boys suffer burn injuries during Muharram procession

అతి ప్రమాదకరమైన ఓ హైటెన్షన్ విద్యుత్ వైర్ తగలడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నొ జిల్లాలో  మంగళవారం చోటుచేసుకుంది. మొహరం పండుగను పురస్కరించుకుని 'టాజియా' (పీర్ల పండుగ) ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

ఊరేగింపులో పాల్గొన్న చిన్నారులు పీర్ల జెండాను పట్టుకుని వెళుతుడంగా గంగా రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ సమీపంలో లోహాపు స్తంభానికి ఆ జెండా చిక్కుకుంది. అదే స్తంభానికి ఉన్న హైటెన్షన్ వైర్కు జెండా తగలడంతో విద్యుత్ ప్రసరించి విద్యుద్ఘాతం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ తీగలు నుంచి ఎక్కువ మొత్తంలో విద్యుత్ ప్రసరిస్తుంటోంది. విద్యుత్ తాకిడికి ఆ ఐదుగురి శరీరం బాగా కాలిపోయింది. వారి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం కాన్పూర్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement