![Eenadu false news on Development in villages - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/13/fake.jpg.webp?itok=p_ENoESg)
పనులు జరుగుతున్నా ఆగిపోయినట్లు రామోజీ దుష్ప్రచారం
గడప గడపకు మన ప్రభుత్వంలో 65,857 ప్రాధాన్యత పనులు మంజూరు
ఇప్పటికే రూ.1,100.78 కోట్ల విలువైన 30,025 పనులు పూర్తి
కొనసాగుతున్న 1,978.46 కోట్ల విలువైన పనులు
ఎప్పటికప్పుడు పూర్తయిన పనుల వివరాలు, బిల్లుల అప్‌లోడ్
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా వేల కోట్ల నిధులు విడుదల చేస్తుంటే.. రామోజీ మాత్రం కడుపు మంటతో అబద్ధాలు అచ్చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన ప్రాధాన్యత పనులను చేస్తున్నా.. అక్కసుతో అడ్డమైన రాతలు రాస్తున్నారు.
‘గడప గడపకు బోల్తా’ అంటూ పచ్చి అవాస్తవాలతో ఈనాడులో అవాస్తవాలను ప్రచురించారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనను ఏ మాత్రం పట్టించుకోకపోయినా రామోజీ ఒక్క కథనం రాయలేదు.
ఆరోపణ: రూ. 3 వేల కోట్ల పనుల్లో మొదలైనవి రూ.వెయ్యి కోట్ల పనులే..
వాస్తవం: వైఎస్ జగన్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఆ పరిధిలోని ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి వారి సమస్యలు తెలుసుకుంది. అక్కడి ప్రజలకు అవసరమైన అత్యంత ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అసలు గ్రామాలు, వార్డుల ముఖం చూసిన పాపాన పోలేదు. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టకుండా నీరు–చెట్టు పేరుతో నామినేషన్పై వేల కోట్లు పచ్చ నేతలు జేబులు నింపుకున్నారు.
ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో పనులు జరుగుతున్నా ఈనాడు రామోజీ అక్కసు వెళ్లగక్కారు. రూ.1000 కోట్ల విలువైన పనులు కూడా ప్రారంభం కాలేదని అవాస్తవలు ప్రచురించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.1100.78 కోట్ల విలువైన 30,025 పనులు పూర్తయ్యాయి. మరో 1978.46 కోట్ల విలువైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఆరోపణ: 65 వేల పనుల్లో 25 వేల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు..
వాస్తవం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 11,753 సచివాలయాల పరిధిలో 65,857 పనులను మంజూరు చేశారు. వాటిలో చాలా పూర్తి కాగా.. మరికొన్ని కొనసాగుతున్నాయి. స్థానికంగా ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన వెంటనే ఆ పనుల వివరాలను గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అప్‌లోడ్ చేసిన పనుల తక్షణ మంజూరు నిరంతరంగా కొనసాగుతోంది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత పనుల కోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
పూర్తి అయిన పనుల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి నిబంధన ప్రకారం చెల్లింపులు చేయాలని డీడీఓలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పనులు పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment