సాక్షి, ఎన్టీఆర్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం అసత్యప్రచారాలతో పబ్బం గడుపుతున్న చంద్రబాబుకు.. ఎల్లో మీడియాకు గట్టి మొట్టికాయే పడింది. గత రెండు రోజులుగా అదే పనిగా.. తాత్కాలిక సచివాలయం తాకట్టు పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై వాళ్లు ఆరోపిస్తున్న బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ స్పందించింది. అదంతా పచ్చి అబద్ధమని తేల్చేసింది.
తాత్కాలిక సచివాలయాన్ని తాము తనఖా పెట్టుకోలేదని.. ఎలాంటి రుణం ఇవ్వలేదని స్పష్టం చేసింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా బదులు ఇచ్చారు బ్యాంక్ ఉన్నతాధికారులు. దీంతో.. రెండ్రోజులుగా టీడీపీ , ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం బట్టబయలైంది.
ఇక.. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసుకొచ్చింది. రూ.370 కోట్ల కోసం సచివాలయంను హెచ్‌డీఎఫ్‌సీకి వైఎస్సార్‌సీపీ సర్కార్ రాసిచ్చేసిందంటూ ఓ వార్తను వండి వార్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ- APCRDA క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా సత్యదూరమని చెప్పింది..
— APCRDA (@PrajaRajadhani) March 3, 2024
ఇదిలా ఉంటే.. చంద్రబాబు సైతం రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటంటూ ఊగిపోయారు. ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారంటూ దొంగ ఏడుపులు అందుకున్నారు. అయితే.. ఇప్పుడదంతా అవాస్తవం అని క్లారిటీ రావడంతో యెల్లో బ్యాచ్ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment