secreteriate
-
బాబు, ఎల్లో మీడియాకు షాక్
సాక్షి, ఎన్టీఆర్: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం అసత్యప్రచారాలతో పబ్బం గడుపుతున్న చంద్రబాబుకు.. ఎల్లో మీడియాకు గట్టి మొట్టికాయే పడింది. గత రెండు రోజులుగా అదే పనిగా.. తాత్కాలిక సచివాలయం తాకట్టు పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై వాళ్లు ఆరోపిస్తున్న బ్యాంక్ హెచ్డీఎఫ్సీ స్పందించింది. అదంతా పచ్చి అబద్ధమని తేల్చేసింది. తాత్కాలిక సచివాలయాన్ని తాము తనఖా పెట్టుకోలేదని.. ఎలాంటి రుణం ఇవ్వలేదని స్పష్టం చేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా బదులు ఇచ్చారు బ్యాంక్ ఉన్నతాధికారులు. దీంతో.. రెండ్రోజులుగా టీడీపీ , ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం బట్టబయలైంది. ఇక.. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసుకొచ్చింది. రూ.370 కోట్ల కోసం సచివాలయంను హెచ్‌డీఎఫ్‌సీకి వైఎస్సార్సీపీ సర్కార్ రాసిచ్చేసిందంటూ ఓ వార్తను వండి వార్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ- APCRDA క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా సత్యదూరమని చెప్పింది.. pic.twitter.com/iNeYd7qLDq — APCRDA (@PrajaRajadhani) March 3, 2024 ఇదిలా ఉంటే.. చంద్రబాబు సైతం రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటంటూ ఊగిపోయారు. ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారంటూ దొంగ ఏడుపులు అందుకున్నారు. అయితే.. ఇప్పుడదంతా అవాస్తవం అని క్లారిటీ రావడంతో యెల్లో బ్యాచ్ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయ్యింది. -
సచివాలయంలో జర్నలిస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి!
సచివాలయంలో జర్నలిస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి! -
హైదరాబాద్ : కొత్త సచివాలయం వద్ద వర్షపు నీరు (ఫొటోలు)
-
AP: కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు రెడీ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో చిరునామా సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్లో సోమవారం నుంచే అడ్రస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో అంతకు ముందు 13 జిల్లాలు ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ సంఖ్యను 26కు పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆధార్ కార్డులలో కొత్త జిల్లా పేరుతో చిరునామా మార్చుకోవాలంటే.. ఆ వివరాలతో కూడిన ఏదో ఒక ధ్రువీకరణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడకుండా.. కొత్త జిల్లాల పేర్లతో కూడిన అడ్రస్ సర్టిఫికెట్లను సచివాలయాల ద్వారా జారీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేసింది. అడ్రస్ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందుకనుగుణంగా సచివాలయాల సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్‌లో కొత్తగా ఈ సేవను కూడా చేర్చారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా క్యూఆర్ కోడ్‌తో కూడిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ధ్రువీకరణ పత్రాల పై సంబంధిత వ్యక్తి ఫోటో.. దానిపై గ్రామ, వార్డు రెవెన్యూ అధికారుల సంతకం, సచివాలయ స్టాంప్ ముద్ర వేసి అందజేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆధార్ జారీకి ఉద్దేశించిన పోర్టల్‌లో కొత్త జిల్లాల పేర్లను చేర్చినట్టు యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత మార్చి 16న సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. కొత్త జిల్లాల పేర్లను ఎవరికి వారు తమ ఆధార్‌లో అప్డేట్ చేసుకునేందుకు అడ్రస్ సర్టిఫికెట్ల అవసరముంటుందని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తమ్ముడి వివాహేతర సంబంధం.. అన్నకు శాపమైంది -
Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది! ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు! శుక్రవారం ఉదయం మామూలుగానే లోక్‌సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది. రాహుల్‌కు చట్టం వర్తించదా అని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘నేరాలకు పాల్పడడం రాహుల్‌కు అలవాటే. పార్లమెంట్‌కు, ప్రభుత్వానికి, దేశానికి అతీతుడినని ఆయన భావిస్తున్నారు. తమకు ప్రత్యేక భారత శిక్షాస్మృతి ఉండాలని, తమను ఎవరూ నేరస్తులుగా నిర్ధారించవద్దని, శిక్షలు విధించవద్దని కాంగ్రెస్, ప్రధానంగా నెహ్రూ–గాంధీ కుటుంబం కోరుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు’’ అన్నారు. వయనాడ్ ఖాళీ లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం వేటును నిరసిస్తూ విపక్షాల ర్యాలీ అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నిరసన ర్యాలీ చేపట్టిన 40 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు నిర్బంధించారు. పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్‌కు ర్యాలీగా వెళ్లిన ప్రముఖుల్లో కేసీ వేణుగోపాల్, ఆధిర్ రంజన్ చౌధురి, కె.సురేశ్, మాణిక్కం ఠాగోర్æ తదితరులు ఉన్నారు. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. సెక్షన్ 144ను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టిన 40 మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. అంతకుముందు విజయ్‌చౌక్ వద్ద కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు మాట్లాడారు. ర్యాలీలో కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన ఉద్ధవ్ వర్గం, జేడీయూ, ఆప్ నేతలు పాల్గొని ‘వుయ్ డిమాండ్ జేపీసీ’, ‘సేవ్ ఎల్ఐసీ’, ‘డెమోక్రసీ ఇన్ డేంజర్’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ నోరు నొక్కేందుకే: కాంగ్రెస్ సోనియా సహా అగ్ర నేతల అత్యవసర భేటీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా ‘జనాందోళన్’కు పిలుపునిచ్చింది. రాహుల్ సభ్యత్వంపై వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా శక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాహుల్ నోరు నొక్కేందుకే అధికార బీజేపీ ఇలా వాయు వేగంతో చర్యలకు దిగిందని తీర్మానించారు. వేటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, మోదీ సర్కారు నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నాయి. రాహుల్‌కు విపక్షాల సంఘీభావాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ స్వాగతించింది. ‘‘దీనిపై ఐక్యంగా పోరాడదాం. ఆందోళనల్లో మీరు కూడా కలిసి రండి’’ అంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. భేటీలో ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. స్పందనలు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు ‘ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. నిజాలు మాట్లాడుతున్నందుకు, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకే రాహుల్‌పై అధికార బీజేపీ కక్షగట్టింది. ఆయన గొంతు నొక్కడమే ఉద్దేశం. నిజాలను రాహుల్ బహిర్గతం చేయడం బీజేపీకి ఇష్టం లేదు, రాహుల్‌పై వేటు పడినా అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ డిమాండ్‌పై తగ్గేది లేదు. మమ్మల్ని జైలుకు పంపించినా పోరాడుతూనే ఉంటాం’’ – మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ‘‘మోదీ భారత్‌లో విపక్ష నాయకులే లక్ష్యంగా మారారు. నేర చరితులైన బీజేపీ వారికి మంత్రి పదవులు. విపక్ష నేతలపై అనర్హత వేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హీనమైన పరిస్థితి!’’ మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘రాహుల్‌పై అనర్హత వేటు దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశంలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటీష్ పరిపాలన కంటే ప్రమాదకరంగా ప్రధాని మోదీ పాలన మారింది. ఇది కేవలం ఒక్క కాంగ్రెస్ చేసే పోరాటం కాదు. దేశాన్ని రక్షించుకోవడానికి 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి’’ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ స్నేహితుడైన పారిశ్రామికవేత్త (అదానీ) అంశాల నుంచి దృష్టి మరల్చే బీజేపీ ఎత్తుగడ ఇది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుట్రలు పన్ని, తప్పుడు కేసులు పెట్టి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్‌ఖాన్ సహా ఎందరిపైనో అనర్హత వేటు వేసింది’’ అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ‘‘రాహుల్‌గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకే వ్యతిరేకం. ప్రజాస్వామ్య విలువలన్నీ మంటగలుపుతున్నారు. ఇలాంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి’’ శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘రాహుల్‌పై అనర్హత ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై జరిగిన దాడి. ఇదొక ఫాసిస్టు చర్య. ఒక జాతీయ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడుకి కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య హక్కు లేదని ఇలాంటి చర్యల ద్వారా భయపెడుతున్నారు’’ ఎంకె స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేయడానికి పరువు నష్టం మార్గాన్ని బీజేపీ ఎంచుకోవడాన్ని ఖండించాలి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి నిరంకుశ దాడుల్ని ప్రతిఘటించాలి, ఓడించాలి’’ సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ‘‘అబద్ధాలు, వ్యక్తిగత నిందలు, ప్రతికూల రాజకీయాలు రాహుల్‌లో ఒక అంతర్భాగంగా మారాయి. ఒబిసి సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చి రాహుల్ తనకున్న కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తారు.’’ జె.పి. నడ్డా, బీజేపీ అధ్యక్షుడు తలవంచం.. ఏం చేసుకుంటారో చేసుకోండి ‘‘దేశ ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తం ధారపోసింది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రాణత్యాగం చేసిన ప్రధాని కుమారుడైన రాహుల్ గాంధీని ‘మీర్ జాఫర్’ అంటూ మోదీ మనుషులు కించపర్చారు. మా కుటుంబాన్ని దూషించారు. రాహుల్ తండ్రెవరని బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా ధరిస్తే దాన్నీ తప్పుపట్టారు. తద్వారా పండిట్ల సామాజిక వర్గాన్ని అవమానించారు. నెహ్రూ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని పార్లమెంట్లో మీరు (మోదీ) మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని దారుణంగా అవమానించినా ఏ జడ్జి కూడా మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేయలేదు. రాహుల్ నిజమైన దేశ భక్తుడు. అందుకే అదానీ గ్రూప్ సాగించిన లూటీపై ప్రశ్నించాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బాగోతాలపై నిలదీశాడు. మీ మిత్రుడు గౌతమ్ అదానీ పార్లమెంట్ కంటే గొప్పవాడా? అధికార దాహమున్న వ్యక్తుల ముందు మేం తలవంచే ప్రసక్తే లేదు. ఏం చేసుంటారో చేసుకోండి!’’ – ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్ నాయకురాలు భారత్ గొంతుక కోసమే నా పోరాటం ‘‘భారతదేశ గొంతుక కోసం పోరాటం సాగిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’ – రాహుల్ గాంధీ ట్వీట్ -
రాహుల్ గాంధీపై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్‌సభ సెక్రటేరియెట్. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు లోక్‌సభ సెక్రటరీ జనరల్. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. Rahul Gandhi - Congress MP from Wayanad, Kerala - disqualified as a Member of Lok Sabha following his conviction in the criminal defamation case over his 'Modi surname' remark. pic.twitter.com/SQ1xzRZAot — ANI (@ANI) March 24, 2023 ఏం జరిగిందంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయంటూ.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, సూరత్ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. Watch this video, did Rahul Gandhi say something wrong ? Spread this. pic.twitter.com/EQlL9g03Za — Shantanu (@shaandelhite) March 23, 2023 ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది సూరత్ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్మెంట్ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు కూడా. రాహుల్ టార్గెట్ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ మాత్రం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్ గాంధీకి గురువారం రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. -
తాత్కాలిక సచివాలయం@బీఆర్కే భవన్
సాక్షి, హైదరాబాద్ : బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్ తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంగా మారనుంది. సచివాలయంలోని ప్రధాన కార్యాలయాలతో సహా ఎక్కువ శాతం శాఖల కార్యాలయాలు బీఆర్కే భవన్‌కు తరలివెళ్లనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయాలకు బీఆర్కే భవన్ కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. పరిపాలన సౌలభ్యం, సాంకేతిక, భద్రత కారణాలరీత్యా సచివాలయంలోని శాఖలన్నీ ఒకే గొడుగు కింద ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలోని ఇంటర్నెట్, ఇంట్రానెట్ నెట్వర్క్ కనెక్టివిటీని దగ్గర్లో ఉన్న భవనాలకు అనుసంధానం చేయడం తేలిక కానుంది. ఈ క్రమంలో ప్రస్తుత సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బీఆర్కే భవన్లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. బీఆర్కే భవన్లో ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల హెచ్ఓడీ కార్యాలయాలను ఇతర చోట్లకు తరలించి మొత్తం భవనాన్ని సచివాలయ శాఖల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడున్న హెచ్ఓడీ కార్యాలయాల తరలింపునకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారుల బృందంతో కలిసి సోమవారం.. బీఆర్కే భవన్‌ను సందర్శించి అక్కడున్న సదుపాయాలను పరిశీలించి చూశారు. ఈ భవనంలోని 8, 9వ అంతస్తుల్లో ముఖ్యమంత్రి చాంబర్, సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించే వరకు రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు ఇక్కడే నుంచే జరగనున్నాయి. సచివాలయంలోని శాఖలన్నింటికీ అవసరమైన స్థలం బీఆర్కే భవన్లో లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సచివాలయ శాఖల కార్యాలయాలను దగ్గరలోని ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల దాదాపు 50 ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలను తెలంగాణకు అప్పగించింది. వీటిలో కొన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయ కార్యాలయాల అవసరాలకు తగ్గట్లు బీఆర్కే భవన్లో పార్కింగ్ సదుపాయం లేదు. దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలాన్ని తాత్కాలిక సచివాలయం పార్కింగ్ అవసరాల కోసం వినియోగించనున్నారు. అటవీశాఖ కార్యాలయాన్ని సమీపంలోని అరణ్య భవన్‌కు, రోడ్లు, భవనాల శాఖ, నీటిపారుదల శాఖ కార్యాలయాలను మాత్రంఎర్రంమంజిల్లోని సంబంధిత ఇంజనీర్–ఇన్–చీఫ్ కార్యాలయాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన తరలింపు ప్రస్తుత సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సచివాలయ భవనాల కూల్చివేతకు అనువుగా ఇక్కడి ప్రభుత్వ శాఖల కార్యాలయాలను యుద్దప్రాతిపదికన తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫైళ్లు, ఇతర సామగ్రిని సర్దుకుని కార్యాలయాల తరలింపునకు సిద్ధంగా ఉండాలని సచివాలయంలోని కొన్ని శాఖలకు సోమవారం మౌఖిక ఆదేశాలందాయి. దీంతో సచివాలయంలోని పలు శాఖల కార్యాలయాల్లో సోమవారం నుంచే ప్యాకింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పరిశీలనలో మరో రెండు భవనాలు సచివాలయ శాఖల తరలింపు కోసం దగ్గరలోని గగన్‌విహార్, చంద్రవిహార్ భవనాల పరిశీలన సైతం జరుగుతోంది. బీఆర్కే భవన్లో చోటు లభించని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఈ రెండు భవనాలకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. భద్రత, సాంకేతిక కారణాల రీత్యా ఈ భవనాలు అనువుగా ఉన్నాయని అధికారులంటున్నారు. అయితే వీటి విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఐటీ కీలకం! సచివాలయ శాఖల తరలింపులో సాంకేతిక అంశాలు కీలకంగా మారాయి. ప్రధానంగా సచివాలయ కార్యాలయాల మధ్య అంతర్గత సమాచార పంపిణీ నెట్వర్క్(ఇంట్రానెట్)ను కొత్త సచివాలయ శాఖల కార్యాలయాల భవనాలకు అనుసంధానం చేయాల్సి ఉండనుంది. గచ్చిబౌలిలోని స్టేట్ డేటా సెంటర్ నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా సచివాలయం ఇంట్రానెట్ అనుసంధానమై ఉంది. ప్రభుత్వ సమాచారాన్ని అత్యంత పకడ్బందీగా ఈ నెట్వర్క్ కాపాడుతోంది. ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను దగ్గరలోని బీఆర్కే భవన్‌తో అనుసంధానం చేయడం సులువు కానుంది. అదే విధంగా సచివాలయంలోని డీ–బ్లాక్‌లో తక్కువ సామర్థ్యంతో మరో డేటా సెంటర్ ఉంది. దీన్నిసైతం బీఆర్కే భవన్‌కు తరలించడం సులువు కానుంది. ఇంట్రానెట్ నెట్‌వర్క్‌ను సచివాలయానికి దూరంలోని ఇతర భవనాలకు తరలించాల్సి వస్తే సమయంతో పాటు ఖర్చు సైతం భారీగా పెరిగిపోనుంది. సురక్షితమైన ఇంట్రానెట్ లేకుండా సచివాలయ శాఖల కార్యాలయాలను నిర్వహిస్తే సైబర్ దాడులు జరిపి ప్రభుత్వ రహస్య సమాచారం చేతులు మారే ప్రమాదం ఉంటుంది. ఇంట్రానెట్నెట్వర్క్ ఆధారంగానే ప్రభుత్వ జీవోల వెబ్సైట్, మీ–సేవా వెబ్సైట్, ఈ–ప్రోక్యూర్మెంట్, ధరణి, మా భూమి, ఆరోగ్య శ్రీ, ఈ–ఆఫీస్ వంటి కీలక వెబ్ అప్లికేషన్ల నిర్వహణ జరుగుతోంది. ఈఎన్సీలతో సాంకేతిక కమిటీ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం ఇక్కడ సమావేశమై చర్చించింది. సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, అబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో ఉన్న సదుపాయాలపై అధ్యయనం కోసం ఇంజనీర్–ఇన్–చీఫ్‌లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (భవనాలు) ఐ.గణపతిరెడ్డిని మెంబర్ కన్వినర్‌గా, ఆర్అండ్బీ ఈఎన్సీ (రోడ్లు) పి.రవీందర్ రావు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌శాఖల ఈఎన్సీలు సి.మురళీధర్, ఎం.సత్యనారాయణలను సభ్యులుగా నియమించింది. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాలకు మెరుగులుదిద్దడం, ఆధునికీకరించడం, అదనపు నిర్మాణాలు జరపడం లేకుంటే కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఈ కమిటీ సిఫారసులు చేయనుంది. -
అట్టుడికిన సచివాలయం
నాలుగు గంటల పాటు సమతా బ్లాక్ వద్ద ధర్నా నిర్వహించిన సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయం అట్టుడికిపోయింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమతా బ్లాక్ వద్ద బైఠాయించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ ధర్నా ఒక దశలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌పై చర్చించేందుకు అఖిల పక్షం నాయకులు సచివాలయం వద్దకు వస్తున్నారని తెలుసుకున్న సీమాంధ్ర మహిళా ఉద్యోగులు వారిని కలిసి ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరేందుకు సమతా బ్లాక్ వద్దకు వచ్చారు. గతంలో ధర్నా చేసినప్పుడు తమను ప్రధానమంత్రి వద్దకు తీసుకొని వెళ్లి సమస్యను వివరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎందుకు తీసుకెళ్లలేదో సీఎస్‌ను కలిసి అడిగేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’, ‘సోనియా... క్విట్ ఇండియా’, రాహుల్ డౌన్‌డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులకు మద్దతుగా ఎల్ బ్లాక్ నుంచి ర్యాలీగా వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు కూడా సమత బ్లాక్ వద్ద బైఠాయించారు. ఒక దశలో ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. దాదాపు నాలుగు గంటల ధర్నా తరువాత అఖిలపక్షం నేతలను, సీఎస్‌ను కలవడానికి పరిమిత సంఖ్యలో ఉద్యోగులను అనుమతించారు. వైఎస్సార్సీపీ కృషి ప్రశంసనీయం సమైకాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని, వారి కృషి ప్రశంసనీయమని ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘం నాయకులు కొనియాడారు. -
విద్యుత్ సౌధలో ఉద్రిక్తత
-
జలసౌధ వద్ద ఉద్రిక్తం