క్రీడలపై రామోజీ క్రీనీడ   | The sports field was a barrier to corruption during the TDP regime | Sakshi
Sakshi News home page

క్రీడలపై రామోజీ క్రీనీడ  

Published Thu, Mar 7 2024 2:07 AM | Last Updated on Thu, Mar 7 2024 2:07 AM

The sports field was a barrier to corruption during the TDP regime - Sakshi

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు మహర్దశ

వైఎస్సార్‌ నగదు పురస్కారాలతో ఆర్థిక సాయం పెంపు

దాదాపు రూ.20 కోట్లకుపైగా క్రీడాకారులకు నగదు సాయం

2 సాంఘిక, 6 గిరిజన గురుకులాల్లో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఏర్పాటు

సీఎం కప్, ఖేలో ఇండియా, జాతీయ పోటీల్లో ఏపీకి పెరుగుతున్న పతకాలు

ఆడుదాం ఆంధ్రతో గ్రామాల్లో ప్రతిభగల క్రీడాకారులకు ఊతం

ఎల్లో బ్యాచ్‌ ‘అవినీతి ఖేల్‌ ఖతం’ అవ్వడంతో రామోజీలో ఫ్రస్ట్రేషన్‌

ఇదే పరిస్థతి ఉంటే శాశ్వతంగా తమ ‘దుకాణం బంద్‌’ అవుతుందనే భయం

సాక్షి, అమరావతి: కురుక్షేత్రంలో అర్జునుడు ‘గాండీవం’ సహాయంతో అధర్మాన్ని వధిస్తే.. క్రీడాక్షేత్రంలో టీడీపీ అదే గాండీవం పేరుపెట్టి అవినీతికి పురుడుపోసింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామంటూ (టాలెంట్‌ హంట్‌) పాఠశాలల్లో క్రీడాపోటీల నిర్వహణ పేరుతో తన అనుయాయులకు రూ. కోట్లు దోచిపెట్టింది. ఏ ఒక్క మైదానంలోనూ క్రీడాకారులు పోటీ పడలేదు. కానీ, వారికి సర్టిఫికెట్లు, మెడల్స్‌ మాత్రం వచ్చేశాయి. ఆ వచ్చిన విషయం క్రీడాకారుడికి కూడా తెలియకపోవడం ఆశ్చర్యం. అప్పట్లో పాఠశాలల నుంచి హాజరు పట్టిక తీసుకొచ్చి విద్యార్థుల పేర్లు గాండీవం ప్రాజెక్టులో రా సేసి ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు.

ఇది.. చంద్రబాబు రాజకీయ వికృతి క్రీడలో.. క్రీడారంగం బలైపోయిందనడానికి చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ, ఎల్లో రాతల్లో ఎల్లలు దాటిన రామోజీకి మాత్రం ఇదొక ఉజ్వల కాలంగా కనిపిస్తోంది. పేదింటి బిడ్డల్లో క్రీడా ప్రతిభను వెలికితీస్తామని మోసం చేస్తే ‘ఈనాడు’ గొప్పగా అభివర్ణిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ పతకాలు సాధించిన వారికి వైఎస్సార్‌ నగదు పురస్కారాలు అందుతున్నాయి.

ఆడుదాం ఆంధ్ర వంటి మెగా టోర్నీ ద్వారా క్రీడా ప్రతిభను వెలికితీస్తోంది. సీఎం కప్, శాప్‌ లీగ్స్, ఖేలో ఇండియా పోటీలకు వెళ్లే వారికి సైతం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి శిక్షణ అందిస్తోంది. ఫలితంగా పతకాల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లో బ్యాచ్‌ ‘అవినీతి ఖేల్‌ ఖతం’ అవ్వడం.. ఇదే కొనసాగితే శాశ్వతంగా తమ ‘దుకా­ణం బంద్‌’ చేసుకోకతప్పదని రామో­జీ.. క్రీడల ముసుగులో పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. 

సామగ్రి దొంగలెత్తుకుపోయారు!
చంద్రబాబు హయాంలో టెన్విక్‌ పేరుతో ఏపీ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు రూ.కోట్లు వెచ్చించారు. విదేశాల నుంచి కొంత మంది కోచ్‌లను తీసుకొచ్చి తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ కాస్తా టీడీపీ ప్రభుత్వంలోనే ముగిసిపోవడం గమనార్హం. కానీ, ఈనాడు ఆపాపాన్ని సైతం ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసింది.

గుంటూరులోని ఏఎన్‌యూలో నడిచిన టెన్విక్‌ క్యాంపు కోసం రూ.కోట్లు కుమ్మరించి క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని సరిగా వినియోగించకుండానే ఒకానొక రాత్రి సమయంలో దొంగలు ఎత్తుకుపోయారు. దీనిపై అప్పట్లో మంగళగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, ఒక్క వస్తువు కూడా రికవరీ కాలేదు. అసలు నిజంగా దొంగతనం జరిగితే రికవరీ అవుతుంది.

ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది కాబట్టి కేసులో ఎటువంటి పురోగతి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ భిన్నవాదనలు కూడా లేపోలేదు. కేవలం పేపర్లపైనే వస్తువులు కొని దొంగతనం డ్రామా ఆడారన్న వాదన ఒకటైతే.. నిజంగా కొనుగోలు చేసిన వస్తువులను దొడ్డిదారిన తిరిగి డీలర్లకు ఇచ్చేసి సొమ్ము చేసుకున్నారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. 

టీడీపీ హయాంలో క్రీడలకు మకిలి..
టీడీపీ హయాంలోనే క్రీడా అసోసియేషన్లకు మకిలి పట్టింది. అప్పటి ప్రజా ప్రతినిధులే అసోసియేషన్లలో వర్గపోరుకు బీజం వేశారు. కేంద్రం.. రాష్ట్రాలు విధిగా స్పోర్ట్స్‌ కోడ్‌ను అమలు చేయాలని ఆదేశించినా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేసింది. స్పోర్ట్స్‌ కోడ్‌ అమలులోకి వస్తే దశాబ్దాలుగా అసోసియేషన్ల పదవుల్లో పాతుకు పోయిన వారికి ఉద్వాసన తప్పదని.. అందుకే పట్టీపట్టనట్టు వ్యహరించారు.

పైగా అప్పట్లో అసోసియేషన్లకు జిల్లాలో ఎన్నికలు నిర్వహించకుండానే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వడం కూడా వర్గపోరుకు కారణం. దీనికి తోడు ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకుంటున్న వారికి కాకుండా సిఫారసులతో వచ్చిన వారికి గుర్తింపు ఇవ్వడం గమనార్హం.

కొన్ని అసోసియేషన్లు టీడీపీ కాలం నుంచి అనాదిగా రాష్ట్ర, జా­తీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను కాగితాలపైనే ఎంపిక చేసే ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రతిభ కలిగిన వారికి తీవ్ర అన్యాయం చేశాయి. కానీ, వైఎస్సార్‌ సీపీ హయాంలో క్రీడా సంఘాలకు పెద్దపీట వేసింది. అంతర్‌జిల్లా, జాతీయ పోటీల నిర్వహణకు 18 రాష్ట్ర క్రీడా సంఘాలకు రూ.­3.05 కోట్లను మంజూరు చేసింది. 

ఎన్నికల ముందు హడావుడిగా..
టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.13.76 కోట్లు అందించినప్పటికీ చిన్న క్రీడాకారులకు మేలు జరగలేదు. క్రీడలను కూడా రాజకీయాలతో చూసే బాబు ఎన్ని­కలకు ముందు హడావుడిగా 2018–19 లో 115 మందికి రూ.7.75 కోట్లు ఇచ్చారు. అంతకు ముందు ఇచ్చింది రూ.6 కోట్లు వీటిల్లో సింహభాగం అంతర్జాతీయ క్రీడాకారులకు కేటాయించినదే. 

శ్మశానాల్లో కేవీకేలా?
అవినీతి పరమావధిగా టీడీపీ నాయకులు క్రీడారంగాన్ని భ్రష్టు పట్టించారు.  కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు క్రీడా వికాస కేంద్రాలను తెరపైకి తెచ్చారు. ఊ­రికి దూరంగా మొండి గోడలతో భవనాలు ని ర్మించి బిల్లు చేసుకుని మింగేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రాధాన్య క్రమంలో గుర్తించి పే అండ్‌ ప్లే ద్వారా క్రీడా కార్యక్రమాలను ప్రారంభించింది.

ఇలా 41 కేవీకేలు వినియోగంలోకి వచ్చాయి. వీటితో పాటు మరో 428 క్రీడా సముదాయాలు ఏపీలో అందుబా­టులో ఉన్నాయి. ఇప్పటి వరకు శాప్‌ ఆధ్వర్యంలో 250 మంది కోచ్‌లు వివిధ రూపాల్లో నిత్యం 7356 మంది క్రీడాకారులకు సేవలందిస్తున్నారు. గ్రామీణ క్రీడాకారులకు ఉన్నత శిక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లు, ఒక రాష్ట్ర ఖేలో ఇండియా సెంటర్‌ను స్థాపించింది.

అడవి బిడ్డల ఆటకు పదును
కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలల్లో 10 క్రీడాంశాల్లో 279 మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 77 మంది జాతీయ స్థాయి, 5 గురు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పతకాలు సాధించారు. ఈ స్ఫూర్తితోనే శాప్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో తొలిసారిగా స్పోర్ట్స్‌ స్కూళ్లను ప్రారంభించింది. పశ్చిమగోదావరి జిల్లా బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలురకు పెదవేగిలో, బాలికలకు పోలసానిపల్లిలో క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది.

ఇక్కడ అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, ఫెన్సింగ్, షూటింగ్, వెయిట్‌ లిఫ్టింగ్‌లలో శిక్షణ అందిస్తోంది. దీనితో పాటు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఏకంగా 6 స్పోర్ట్స్‌ స్కూళ్లను ప్రవేశపెట్టింది. సీతంపేట(శ్రీకాకుళం), భద్రగిరి(విజయనగరం), ముసురిమిల్చి(తూర్పుగోదావరి), యర్రగొండపాలెం (ప్రకాశం), మహానంది (కర్నూల్‌), గొల్లలదొడ్డి(అనంతపురం)లో గిరిజన యువతను క్రీడాకారులగా తీర్చిదిద్దుతోంది. ఆయా స్పోర్ట్స్‌ స్కూళ్లలో 25 మంది కోచ్‌లను నియమించింది. దీనిని క్రీడాభివృద్ధిలో భాగంగా ఈనాడు చూడలేక నంగనాచి రాతలు రాసింది.  

రూ.20 కోట్లకుపైగా నగదు పురస్కారాలు
సీఎం జగన్‌ ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో సుమారు 65 క్రీడాంశాల్లో పతకాలు సాధించిన 1800 మంది క్రీడాకారులకు రూ.9,61,06,369 నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. అదే అంతర్జాతీయ స్థాయిలో 24 క్రీడాంశాల్లో 76 మందికి రూ.8,47,50,000 నగుదు పురస్కారాలు ప్రదానం చేసింది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక విధానమంటూ లేకపోవడంతో చాలా మంది క్రీడాకారులు నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాల’ను ప్రవేశపెట్టారు.

గతంలో ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచారు. దీంతో 2014 నుంచి 2019 మధ్య కాలంలో పతకాలు సాధించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎందరో క్రీడాకారులకు లబ్ధి చేకూరింది. ముఖ్యంగా 33 క్రీడాంశాల్లో 51 మంది అంతర్జాతీయ అథ్లెట్స్‌కు మెరుగైన శిక్షణ అందించేందుకు రూ.2,24,47,160 ఆర్థిక సాయాన్ని అందజేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క స్పోర్ట్స్‌ కోటాలోనే ఏకంగా 2వేల మందికిపైగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించింది. జగనన్న క్రీడా సంబరాల పేరుతో నాలుగు క్రీడాంశాల్లో రూ.50.24 లక్షల నగదు బహుమతులతో పోటీలను నిర్వహించింది.

ఇందులో దాదాపు 15వేల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా  26 జిల్లాల్లో 1356 వేదికల్లో సమ్మర్‌ క్యాంప్‌లను నిర్వహించింది. ప్రతి శిబిరానికి రూ.7వేల చొప్పున స్పోర్ట్స్‌ మెటీరీయల్స్‌ కొనుగోలుకు ఇచ్చి యువతను క్రీడలవైపు నడిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా రూ.120 కోట్లతో ఆడుదాం ఆంధ్రను విజయవంతంగా చేపట్టింది. ఇందులో సుమారుగా 38 లక్షల మంది పురుషులు, మహిళా క్రీడాకారులు భాగస్వాములయ్యారు. వీటన్నింటిని ప్రపంచం మొత్తం క్రీడలు అంటుంటే.. ఈనాడు ఆంధ్రాలో ఆటలు లేవంటూ తన అంధత్వాన్ని ప్రదర్శించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement