జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలపై కుటిల రాతలెందుకు రామోజీ?
లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు చేసిన సేవలు కనిపించవా?
ప్రజారోగ్యంపై సీఎం జగన్‌కు ఉన్న శ్రద్ధకు వైద్య రంగంలో సంస్కరణలే నిదర్శనం
చంద్రబాబు ఏనాడైనా ఒక్క వైద్య శిబిరం పెట్టారా?
బాబు హయాంలో వైద్య రంగ దుస్థితి కనిపించలేదా?
నాడు ఆస్పత్రులు పాములు, ఎలుకలకు నిలయాలు కాదా?
నేడు ఆస్పత్రులను ఆధునికంగా తీర్చిదిద్దుతున్న సీఎం జగన్
వాడవాడలా, గ్రామ గ్రామాన వైద్య శిబిరాలతో లక్షలాది మందికి సేవలు
ఉచితంగా మందులు పంపిణీ అవసరమైన వారికి కేటరాక్ట్, ఇతర చికిత్సలు
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం గ్రామ గ్రామాన, వాడవాడలా వైద్య శిబిరాలు నిర్వహించి, పేదల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా? అంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలను పరీక్షించి, మందులు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రజారోగ్యంపై సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం ఒక ప్రబల నిదర్శనం.
ఆరోగ్య శ్రీ పథకం, 108, 104, తల్లీపిల్లల ఎక్స్‌ప్రెస్, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ, వేల కోట్లతో నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య రంగంలో ఖాళీలన్నవి లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం.. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణాలు. గ్రామగ్రామాన, వాడవాడలా జేఏఎస్ శిబిరాల్లో లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు పరీక్షలు చేసి, అవసరమైన వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇంత మంది శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందితే రామోజీకి కనిపించవు. అంతా ఖాళీగా ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటారు.
ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కలిపి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క వైద్య శిబిరం నిర్వహించారా? ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కట్టించారా? ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క విభాగాన్నైనా ఆధునీకరించాచా? ఆయన హయాంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత దయనీయ స్థితికి వెళ్లిందో ప్రతి ఒక్కరికీ కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఆస్పత్రి అంటే పాములు, ఎలుకల నిలయాలుగా పేరుపడ్డాయి. ఇంత దారుణ వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లో కళ్లు మూసుకున్న రామోజీ.. నేడు ప్రజలంతా ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకుంటుంటే చూడలేకపోతున్నారు.
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తుండటం ఆదర్శనీయమని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే.. పచ్చ బాసు రామోజీకి మెదడు మొద్దుబారింది. పచ్చ రోగం ముదిరిపోయి కడుపు మంట కథనాలు అచ్చేస్తున్నారు. అదే క్రమంలో జేఏఎస్ శిబిరాలపైనా పడ్డారు. ‘ఎందుకీ శిబీరాలు!’ అంటూ ఈనాడులో ఓ కుటిల కథనం అచ్చేశారు.
ప్రజలపై భారం లేకుండా చేయడం సొంత డబ్బానా?
ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం జగన్ 58 నెలల పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రజలకు బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించి, సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తున్నారు. జేఏఎస్ తొలి విడతలో భాగంగా గత ఏడాది 1.45 కోట్ల ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు.
12 వేలకు పైగా వైద్య శిబిరాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 60.28 లక్షల మంది వైద్య సేవలు అందుకున్నారు. కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న 80,115 మందికి కేటరాక్ట్ సర్జరీలు చేయించారు. ఇరత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు డాక్టర్లు పంపించారు.
వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కేటరాక్ట్ సర్జరీలు, అవసరమైన చికిత్సలు చేయించింది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించింది. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. తొలి విడతలో 2.51 లక్షల మంది హైపర్‌టెన్షన్, 1.54 లక్షల మంది షుగర్ కేసులను కొత్తగా గుర్తించి, బాధితులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తోంది.
ఈ ఏడాది జనవరి నెలలో రెండో విడత జేఏఎస్‌ను ప్రారంభించి ఇప్పటివరకు 27.33 లక్షల మందికి సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించింది. 12,837 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేయగా 4,609 మందికి ఇప్పటికే చికిత్సలు అందించారు. 2,313 మందికి కేటరాక్ట్ అవసరమని వైద్యులు సూచించగా ఇప్పటివరకు 1,740 మందికి సర్జరీలు చేశారు.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు వైద్యుల కన్సల్టేషన్, పరీక్షలు, మందులు, చికిత్సలు, చివరికి దారి ఖర్చులకు కూడా ఒక్క రూపాయి చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. పైపెచ్చు తాముంటున్న గ్రామం, వార్డులకే వైద్యులు వెళ్లి ప్రజలకు సేవలు అందించారు. ఇదంతా గమనిస్తే ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రజలకు ఎంతో మేలు జరిగిందనే వాస్తవం కనిపిస్తుంది. ఒక్క రామోజీకి తప్ప.
Comments
Please login to add a commentAdd a comment