Jagananna Arogya Suraksha
-
30 లక్షల మందికి సేవల దిశగా ఆరోగ్య సురక్ష–2
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 30 లక్షల మందికి వైద్య సేవల దిశగా రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం (జేఏఎస్–2) కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన రెండో దశ కార్యక్రమంలో నిర్దేశిత షెడ్యూల్ మేరకు గ్రామాలు, వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోంది. ప్రతి జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంలో గ్రామీణంలో వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మందికి సేవలు జేఏఎస్ –2 లో రాష్ట్రవ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 నిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటివరకూ వైద్య సేవలందించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షలు, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాలకు వద్దకు వచ్చి సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13 వేల మందికి ఆస్పత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి, దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేలా స్థానిక పీహెచ్సీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 5 వేల మంది ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 మంది జనరల్ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్ట్ వైద్యులు, 3 వేల మంది వరకూ వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. -
డబ్బా కాదు బాస్..ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ
-
ఆరోగ్య సురక్ష సాధించిన ఘనత కోటి మందికి ఉచిత వైద్యం..
-
డబ్బా కాదు బాస్.. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం గ్రామ గ్రామాన, వాడవాడలా వైద్య శిబిరాలు నిర్వహించి, పేదల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా? అంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలను పరీక్షించి, మందులు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రజారోగ్యంపై సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం ఒక ప్రబల నిదర్శనం. ఆరోగ్య శ్రీ పథకం, 108, 104, తల్లీపిల్లల ఎక్స్‌ప్రెస్, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ, వేల కోట్లతో నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య రంగంలో ఖాళీలన్నవి లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం.. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణాలు. గ్రామగ్రామాన, వాడవాడలా జేఏఎస్ శిబిరాల్లో లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు పరీక్షలు చేసి, అవసరమైన వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇంత మంది శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందితే రామోజీకి కనిపించవు. అంతా ఖాళీగా ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కలిపి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క వైద్య శిబిరం నిర్వహించారా? ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కట్టించారా? ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క విభాగాన్నైనా ఆధునీకరించాచా? ఆయన హయాంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత దయనీయ స్థితికి వెళ్లిందో ప్రతి ఒక్కరికీ కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఆస్పత్రి అంటే పాములు, ఎలుకల నిలయాలుగా పేరుపడ్డాయి. ఇంత దారుణ వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లో కళ్లు మూసుకున్న రామోజీ.. నేడు ప్రజలంతా ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకుంటుంటే చూడలేకపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తుండటం ఆదర్శనీయమని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే.. పచ్చ బాసు రామోజీకి మెదడు మొద్దుబారింది. పచ్చ రోగం ముదిరిపోయి కడుపు మంట కథనాలు అచ్చేస్తున్నారు. అదే క్రమంలో జేఏఎస్ శిబిరాలపైనా పడ్డారు. ‘ఎందుకీ శిబీరాలు!’ అంటూ ఈనాడులో ఓ కుటిల కథనం అచ్చేశారు. ప్రజలపై భారం లేకుండా చేయడం సొంత డబ్బానా? ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం జగన్ 58 నెలల పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రజలకు బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించి, సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తున్నారు. జేఏఎస్ తొలి విడతలో భాగంగా గత ఏడాది 1.45 కోట్ల ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. 12 వేలకు పైగా వైద్య శిబిరాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 60.28 లక్షల మంది వైద్య సేవలు అందుకున్నారు. కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న 80,115 మందికి కేటరాక్ట్ సర్జరీలు చేయించారు. ఇరత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు డాక్టర్లు పంపించారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కేటరాక్ట్ సర్జరీలు, అవసరమైన చికిత్సలు చేయించింది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించింది. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. తొలి విడతలో 2.51 లక్షల మంది హైపర్‌టెన్షన్, 1.54 లక్షల మంది షుగర్ కేసులను కొత్తగా గుర్తించి, బాధితులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో రెండో విడత జేఏఎస్‌ను ప్రారంభించి ఇప్పటివరకు 27.33 లక్షల మందికి సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించింది. 12,837 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేయగా 4,609 మందికి ఇప్పటికే చికిత్సలు అందించారు. 2,313 మందికి కేటరాక్ట్ అవసరమని వైద్యులు సూచించగా ఇప్పటివరకు 1,740 మందికి సర్జరీలు చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు వైద్యుల కన్సల్టేషన్, పరీక్షలు, మందులు, చికిత్సలు, చివరికి దారి ఖర్చులకు కూడా ఒక్క రూపాయి చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. పైపెచ్చు తాముంటున్న గ్రామం, వార్డులకే వైద్యులు వెళ్లి ప్రజలకు సేవలు అందించారు. ఇదంతా గమనిస్తే ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రజలకు ఎంతో మేలు జరిగిందనే వాస్తవం కనిపిస్తుంది. ఒక్క రామోజీకి తప్ప. -
ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వం గుర్తించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా చికిత్సలు చేయించి సాంత్వన చేకూరుస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సురక్ష క్యాంపుల్లో గుర్తించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్సలు చేయించడంతోపాటు బాధితులపై రవాణా ఖర్చుల భారం కూడా పడకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. చికిత్సల అనంతరం కూడా బాధితులకు బాసటగా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధితులను చేయిపట్టి సీఎం జగన్ ముందుకు నడిపిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తున్నారు. విజయవంతంగా 2.O ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ 6,710 శిబిరాలు నిర్వహించగా.. ఒక్కోచోట సగటున 359 చొప్పున 24,11,785 మంది వైద్య సేవలు పొందారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, హెచ్‌బీ, యూరిన్, మలేరియా, డెంగీ సహా ఇతర 32.64 లక్షల స్పాట్ టెస్ట్‌లను శిబిరాల వద్ద నిర్వహించారు. రెండో దశలో భాగంగా శిబిరాల వద్దకు వచ్చిన ప్రజల్లో 8,179 మందికి తదుపరి వైద్య సేవలు అవసరం ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరిలో ఇప్పటికే 2,030 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు అందుకున్నారు. ఇక 2.13 లక్షల మందికి కంటి స్క్రీనింగ్ చేపట్టగా.. 60 వేల మందికి మందులతో నయమయ్యే సమస్యలను గుర్తించి అక్కడికక్కడే మందులు అందించారు. మరో 1.50 లక్షల మందికి అద్దాలను, 2,090 మందికి కేటరాక్ట్ సర్జరీలను సూచించారు. 98 శాతం మందికి చికిత్సలు పూర్తి గత ఏడాది ఆరోగ్య సురక్ష తొలి దశ కార్యక్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా శిబిరాలు నిర్వహించింది. వీటిలో 60.27 లక్షల మంది అవుట్ పేషెంట్ సేవలు పొందారు. వీరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని వైద్యులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వారందరికీ చికిత్సలు చేయించేలా వైద్య శాఖ పర్యవేక్షించింది. వీరిలో ఇప్పటివరకూ 98 శాతం అంటే.. 84,982 మందికి ప్రభుత్వమే చికిత్సలు చేయించింది. చిన్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్, పుట్టుకతో గుండెలో రంధ్రాలు, ఇతర సమస్యలతోపాటు, పెద్దల్లో న్యూరో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, వంటి ఇతర సమస్యలకు ఉచిత చికిత్సలు అందించారు. చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, పశి్చమ గోదావరి జిల్లాల్లో వంద శాతం మందికి చికిత్సలు చేయించారు. మొత్తం రోగుల్లో 1,731 మందికి చికిత్సలు అందించేలా వైద్య శాఖ పర్యవేక్షిస్తోంది. కాగా.. తొలి దశలో కంటి సమస్యలతో బాధపడుతున్న 80,155 మందికి కేటరాక్ట్ సర్జరీలు అవసరమని వైద్యులు సూచించగా.. 41633 మందికి ఇప్పటికే సర్జరీలు పూర్తి అయ్యాయి. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. 5.63 లక్షల మందికి పంపిణీ పూర్తయింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామానికి చెందిన రైతు అనిల్ దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమార్తె మధుప్రియ గ్రహణం మొర్రితో పుట్టడంతో వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మధుప్రియ గుండెకు రంధ్రం కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. పాప పెద్దయ్యాక గానీ ఆపరేషన్ చేయడానికి వీలుండదని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం మధుప్రియకు మూడేళ్లు నిండాయి. పాప గుండెకు ఆపరేషన్ చేయించాలనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేలో మధుప్రియ సమస్యను తల్లిదండ్రులు తెలియజేశారు. దీంతో వైద్య శిబిరానికి హాజరవ్వమని చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకు వెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి మధుప్రియను తిరుపతిలోని చిన్న పిల్లల హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ పూర్తయింది. బాలిక పూర్తిగా కోలుకుంది. మధుప్రియ తరహాలోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆరోగ్య సురక్ష వరంగా మారింది. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్‌తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
పేదలకు అద్భుత వైద్యం అందిస్తున్న జగనన్న ఆరోగ్య పథకం
-
ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9.48 లక్షల మందికి వైద్యం ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశలో 60.27 లక్షలు తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది. యూరినరీ సమస్యకు పరిష్కారం కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా నిరంతరం ఫాలోఅప్ సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్ ఉంచుతున్నాం.రిఫరల్ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
జగనన్న ఆరోగ్య సురక్షజనాలకు రక్ష
గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన జి.సుబ్బారావుకు 69 ఏళ్లు. కొద్ది రోజులుగా కంటి చూపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే సెకండరీ కేర్ ఆస్పత్రికి.. లేదంటే గుంటూరులోని పెద్దాస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణచార్జీలు, ప్రయాసల భారం తప్పనిసరి. అయితే ఇవేవీ లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష(జేఏఎస్) కార్యక్రమం ద్వారా గ్రామంలోనే సుబ్బారావుకు ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ నెల ఐదో తేదీన రెండో దశ జేఏఎస్లో భాగంగా గ్రామంలో వైద్య శాఖ సురక్ష వైద్య శిబిరం నిర్వహించింది. ర్యాండమ్ బ్లడ్ షుగర్, రక్తపోటుతో పాటు, విజన్ టెస్ట్‌లను గ్రామంలోనే ఉచితంగా నిర్వహించారు. విజన్ టెస్ట్‌లో గుర్తించిన అంశాల ఆధారంగా చూపు సమస్య నివారణకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స అందించింది. సాక్షి, అమరావతి: సుబ్బారావు తరహాలోనే రాష్ట్రంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జేఏఎస్ కార్యక్రమం వరంగా మారింది. సమయం, ఓపిక లేని, ఆర్థిక పరిస్థితులు సహకరించని, అదే పనిగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోలేని లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను జేఏఎస్ పరిష్కరిస్తోంది. గ్రామ స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్యులు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు. మందులు అవసరమైతే అక్కడికక్కడే ఉచితంగా అందిస్తున్నారు. మెరుగైన చికిత్సలు అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫరల్ కేసుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభుత్వమే మందులను డోర్ డెలివరీ చేస్తోంది. 4.19 లక్షల మందికి ఉచిత వైద్యం రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఒక జిల్లాలోని మండలాలను రెండుగా విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలుంటాయి. ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలు నిర్వహించేలా కార్యాచరణతో ముందుకెళుతున్నారు. కాగా, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,315 సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించగా.. సగటున 319 మంది చొప్పున 4,19,249 మంది స్వగ్రామం, వార్డుల్లోనే చికిత్సలు అందుకున్నారు. నంద్యాల జిల్లాలో 56 శిబిరాలు నిర్వహించగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ సగటున 458 ఓపీలు నమోదు కావడం విశేషం. ఇక ఇప్పటి వరకూ జేఏఎస్–2లో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 4.19 లక్షల మంది సేవలు పొందగా.. వీరిలో 2.19 లక్షల మంది మహిళలు, 1.99 లక్షల మంది పురుషులున్నారు. మూడు వేల మంది స్పెçషలిస్ట్ వైద్యులతో ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ ఆరోగ్య సురక్ష నిర్వహించేలా వేగంగా అడుగులు వేస్తున్నారు. జనవరిలో 3,583 శిబిరాలను నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 1,315 శిబిరాలు పూర్తయ్యాయి. ఇక షెడ్యూల్ ప్రకారం గ్రామం/వార్డులో సురక్ష శిబిరం ఏర్పాటుకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు రెండో సారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జేఏఎస్–2 పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్‌లు మూడు వేల మంది వరకూ వైద్యులను, కంటి సమస్యల గుర్తింపునకు స్క్రీనింగ్ చేపట్టడానికి 562 పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను డిప్లాయ్ చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు చేయించాం తొలి ఆరోగ్య సురక్షలో మా పీహెచ్సీ పరిధిలో 111 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశాం. వారిలో 72 మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు పూర్తయ్యాయి. ఇక 306 మందిలో కంటి సమస్యలను గుర్తించాం. వీరిలో 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. మిగిలిన వారు పొలం పనుల కారణంగా చికిత్సలు, క్యాటరాక్ట్ సర్జరీలను వాయిదా వేసుకున్నారు. వారికి కూడా వీలైనంత త్వరగా చికిత్సలు పూర్తి చేసేలా ఫాలోఅప్ చేస్తున్నాం. – డాక్టర్ సుశ్మప్రియదర్శిని, మెడికల్ ఆఫీసర్, వత్సవాయి పీహెచ్సీ, ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్యశ్రీ కింద స్టంట్ వేశారు గతేడాది మా ఊళ్లో ప్రభుత్వం సురక్ష శిబిరం నిర్వహించింది. ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతున్న నేను శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించుకున్నాను. ఈసీజీ తీశారు. ఈ క్రమంలో గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్టు గుర్తించారు. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్లగా.. రక్తనాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించి స్టంట్ వేశారు. – భారతీలక్ష్మి, దబ్బాకుపల్లి, ఎన్టీఆర్ జిల్లా చేయి పట్టి నడిపిస్తూ వైద్య శిబిరాల ద్వారా స్వగ్రామాల్లోనే వైద్య సేవలు అందించడమే కాకుండా అనంతరం కూడా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయిపట్టి ముందుకు నడిపించనుంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తున్నారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష తొలి దశలో అందించిన సేవలు ఆరోగ్య సిబ్బంది సందర్శించిన గృహాలు 1,45,35,705 నిర్వహించిన వైద్య పరీక్షలు 6,45,06,018 నిర్వహించిన మొత్తం సురక్ష శిబిరాలు 12,423 (రూరల్–10,033, అర్బన్–2,390) శిబిరాల్లో నమోదైన ఓపీలు 60,27,843 తదుపరి వైద్యం కోసం నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫరల్ 1,64,982 మంది -
ఉచితంగా పరీక్షలు, వైద్యం, మందులు
-
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశలో 13,818 క్యాంపులు
గుంటూరు రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,818 వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ మెడికల్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో నిర్వహించిన క్యాంపునకు మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి రెండురోజుల చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి బుధవారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 10,032 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల పరిధిలో 13,818 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తీసుకురావడం, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు పంపి ఉచితంగా అందేలా చేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగమని ఆమె వెల్లడించారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యమిత్ర, ఏఎన్ఎంల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే చేస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా, వేగంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తుండటం వల్లే వైద్య, ఆరోగ్య రంగంలో కనీవిని ఎరుగని సంస్కరణలను ప్రవేశపెట్టారని రజిని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న చికిత్సల సంఖ్యను ఏకంగా 3,257కు జగనన్న పెంచారని పేర్కొన్నారు. వైద్య ఖర్చును రూ.25లక్షలకు పెంచారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులను కూడా కొత్తవి మంజూరు చేసి జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆసరా అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రోగులకు చికిత్సకాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డీకే బాలాజీ, డీఎంఈ నర్సింహం, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రావణ్‌బాబు పాల్గొన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రశంసలు
-
జగనన్న ఆరోగ్య సురక్షపై డాక్టర్ల గొప్ప మాటలు
-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన
-
AP: ఆరోగ్య సురక్ష రెండోదశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’(జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్‌ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. చేయి పట్టి నడిపిస్తూ.. వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తోంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున అందచేస్తోంది. రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్య పరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు జేఏఎస్–2 కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగాధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరానికి చర్యలు చేపడతారు. ప్రజల వద్దకే వైద్యం జేఏఎస్–2 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, వైద్య పరీక్షల కిట్లు సరఫరా చేశాం. శిబిరాల నిర్వహణపై జిల్లా యంత్రాంగాలు షెడ్యూల్లు రూపొందించాయి. ఆ మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జేఏఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
JAS: పల్లె- పట్టణం తేడా లేకుండా ఉచిత వైద్యం
సాక్షి, విజయవాడ: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు ప్రారంభమైన.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. రెండవ దశలో తొలుత గ్రామీణ ప్రాంతాలలో... 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు మొదలవుతాయి. ఆర్నెల్లపాటు సాగే ఈ రెండోదశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటిలోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలకు అప్పగించారు. వారు చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అంద జేస్తారు. జేఏఎస్ తొలి దశ.. సూపర్‌హిట్ తొలిదశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాలల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. తొలిదశ కార్యక్రమంలో సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలలో 1,45,35,705 ఇళ్ళను సందర్శించి 6.45 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపి సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. ఈ నేపథ్యంలో రెండో దశను మరింత విస్తృతస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయ్యింది. ►వైద్య ఆరోగ్యసేవల్ని అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్నీ వదిలి పెట్టరాదన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమానికి ఆరు నెలల వ్యవధిని నిర్దేశించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు తొలిదశలో 50 రోజులకు పైగా నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 60 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. ►జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా.. పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాలనుండి సిహెచ్వోలు, ఎఎన్ఎంలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులలోని ఆరోగ్యమిత్రల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుటుంది. దీంతో పాటు ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారా పరిశీలించి పేషెంట్ల రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం రు.500 లని వారికి వైద్య ఆరోగ్య శాఖ అందజేయనుంది. ఆరు నెలలపాటు రెండో దశ.. జగనన్న ఆరోగ్య సురక్ష తొలిదశ కార్యక్రమం పూర్తి విజయవంతం కావటంతో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతాలలో విస్తరించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ కార్యక్రమాన్ని ఆర్నెల్లపాటు నిర్వహించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. రెండోదశ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయస్సుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నారు. ►రెండోదశ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొదటి దశలో వైద్య శిబిరాల వివరాలను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి తెలియజేస్తారు. మొదటి దశలో వాలంటీర్లతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటినీ సందర్శించి రెండోదశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వివరాల్ని తెలియజేస్తారు. రెండో దశలో ఆరోగ్యశిబిరాల నిర్వహణ, మూడో దశలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన కేసుల ఫాలోఅప్ సేవల్ని అందజేస్తారు. ఆరోగ్య శిబిరం నిర్వహణా తేదీని ముందు ప్రతి వాలంటీరూ రెండుసార్లు ప్రతి ఇంటికి తిరిగి వివరాలను తెలియజేయాల్సి వుంటుంది. ►మొదటి సారి వైద్య శిబిర నిర్వహణకు 15 రోజుల ముందు, రెండోసారి శిబిర నిర్వహణ తేదీని గుర్తు చేసేందుకు మూడు రోజుల ముందు వాలంటీర్లు ఇళ్ళను సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబరాల్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లు, పట్టణ వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు. మొత్తం మండలాలను సమానంగా విభజించి మంగళవారం తొలి అర్ధభాగంలోనూ, శుక్రవార మిగిలిన ప్రాంతాలలోనూ శిబిరాల్ని నిర్వహిస్తారు. కంద పట్టణ ప్రాంతాలలో వార్డు సచివాలయాలలో ప్రతి బుధవారం ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ►ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాలలోని గ్రామ, వార్డు సచివాలయాలలో వైద్య సేవలందచేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతి ఆరోగ్య శిబిరంలో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లతో కలిపి కనీసం ముగ్గురు డాక్టర్లు, ఒక పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆర్నెల్ల వ్యవధిలో 13,495 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహిస్తారు. ఇందులో 10,032 శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో, 3,922 శిబిరాలు పట్టణ ప్రాంతాలలో నిర్వహిస్తారు. జనవరి నెలలోనే 3,583 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇదీ చదవండి: ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష.. కాకినాడలో ఘటన సర్వం సిద్ధం జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమంలో వైద్య సేవలందించేందుకు జనరల్ మెడిసిన్ 543, గైనకాలజిస్ట్ లు645, జనరల్ సర్జన్లు 349, ఆర్థోపెడిషియన్లు 345 మంది, ఇతర స్పెషలిస్టులు 378 మందిని సిద్ధం చేస్తున్నారు.. వీరితో పాటు 2,545 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 2743 మంది ఎంబిబిఎస్ డాక్టర్లు కూడా ఈ శిబిరాలలో భాగస్వాములవుతారు. అలాగే కంటి పరీక్షల కోసం మొత్తం 562 మంది పారా మెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్లను కూడా సిద్ధమవుతున్నారు. రెండో దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులను సిద్ధం చేస్తున్నారు. ►వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం మరో 14 రకాల మందుల్ని, వైద్య పరీక్షల నిర్వహణ కోసం 7 రకాల కిట్లను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు.. మూడో దశలో చేపట్టే ఫాలో అప్ సేవలలో ఫ్యామిలీ డాక్టర్, సిహెచ్ఓ, ఎఎన్ఎంలు భాగస్వాములవుతారు. వీరికి అవసరమైన మందుల్ని నేరుగా విలేజ్ క్లినిక్ లకు పంపి.. అక్కడ ఎఎన్ఎం, సిహెచ్ఓలు రోగులకు వారి ఇళ్ల వద్ద అందజేసి ఎలా వాడాలన్నది చెప్తారు. -
ఆరోగ్యానికి మరింత భరోసా
‘విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే మన ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య పథకం కోసం ఇప్పటిదాకా దాదాపు రూ.12,000 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కోసం రూ.1,309 కోట్లు ఖర్చు చేశాం. 108, 104 అంబులెన్స్‌ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో రూ.750 కోట్లు వెచ్చించాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుడుతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ క్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజారోగ్య రంగంలోనే ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఉద్ఘాటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభిస్తుందని తెలియజేయండి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన అనంతరం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చికిత్స చేయించుకున్న వారు తిరిగి ఫాలో అప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేలా చూడాలి. ఇందులో భాగంగా ఫాలో అప్ కన్సల్టేషన్ కోసం రవాణా చార్జీల కింద రూ.300 చొప్పున అందజేయండి. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆస్పత్రులకు రెఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. వీరు ఆస్పత్రులకు వెళ్లడం కోసం రవాణా చార్జీల కింద రూ.500 చొప్పున అందిస్తున్నాం. మరో విషయం ఏమిటంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే దానిపై రూపొందించిన వీడియో అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచాలి’ అని ఆదేశించారు. కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్‌పై ఉన్న రోగులు వాడుతున్న మందులు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసి.. బాధితుల ఆరోగ్యంపై వాకబు చేయాలని సూచించారు. మార్కాపురంలోనూ పలాస తరహా వైద్య చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్నారు. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం కోసం ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. దీంతో పాటు యూరాలజీ విభాగం కూడా తీసుకురావాలని, ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కోసం అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సూచించారు. 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ప్రారంభించనుంది. 19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టి, జనవరి నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చనే దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సహా, పథకంపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను ప్రజల సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసి, యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. పనిలో పనిగా దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేస్తారు. ఇదిలా ఉండగా జనవరి ఒకటో తేదీ నుంచి ఫేజ్–2 జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ఒక వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించనున్నారు. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుధవారం నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ పాల్గొన్నారు. -
ఆరోగ్యం మీ హక్కు!
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో సంతృప్తి కరంగా సేవలందించేలా అడుగులు వేస్తోంది. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా రోగులను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి నాణ్యమైన సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను భుజానకెత్తుకుంది. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటూనే మందుల విషయంలో రాజీపడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని.. ఈ విషయంలో వాళ్లు అప్పులపాలు కాకుండా ఉండేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా బలోపేతం చేసింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేస్తూ ప్రజలు నచ్చేలా.. ప్రభుత్వాన్ని మెచ్చేలా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతీ ఒక్కరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. సేవలు వినియోగించడం గురించి తెలియని వ్యక్తి అంటూ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,42,34,464 కొత్త కార్డులను ప్రింట్ చేయిస్తున్నారు. ఈనెల 18 నుంచి వీటిని అందజేస్తారు. మరోవైపు.. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునేలా కార్యక్రమం చేపడుతోంది. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఈ రెండు యాప్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య సురక్షపై నిరంతర సమీక్ష మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా యజ్ఞంలా సాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనందించే కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. అందులో మొదటిది.. ► సురక్షలో గుర్తించిన రోగులకు మందులు అందించడం, కాలానుగుణంగా ఆరోగ్యంపై ఫాలోఅప్ చేయడం.. ► రెండోది.. గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, చికిత్సపై ఫాలోఅప్ సేవలు అందించడం.. ► మూడోది.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తున్న మందులను కోర్సు ముగిసేలోపే వాటిని అందుబాటులో ఉంచడం. ఈ మూడు ప్రధాన అంశాలపై నిరంతరం సమీక్ష చేయనుంది. ► అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మందులపై ప్రత్యేక శ్రద్ధ.. ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేదా? అన్న దానిపైనా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అలాగే, సురక్షలో గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స అవసరమున్న రోగులకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వడమే కాక.. సురక్ష క్యాంపుల నుంచి ఆస్పత్రులకు రిఫర్ చేసి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్లుగా చేరిన వారిని మరోసారి డాక్టర్ల బృందం పరిశీలించేలా.. శిబిరాల్లో ఇంకా వైద్యం అందాల్సిన వారికి వెంటనే నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోనుంది. చైనా వైరస్‌పైనా అప్రమత్తం చైనాలో హెచ్9ఎన్2 వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా మన దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్న మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. మందులు, ఆక్సిజన్, పడకల విషయంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడా వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు లేకుండా చూడాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సూచించారు. 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. అంతకుముందు.. వైద్యశాఖలో అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం చికిత్సలు పెరిగాయన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచేలా చూస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని కూడా వారు సీఎంకు వివరించారు. ► కంటి చికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారని.. ► ఇందులో 73,602 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నామని.. ► చాలామందికి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు మందులు ఇచ్చారని.. అనంతరం తదుపరి చికిత్స కోసం 16,128 మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. ► వీరిలో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్మెంట్లు పూర్తయ్యాయి. ► 78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామని అధికారులు వివరించారు. ► ఇక కంటిచూపు సంబంధిత సమస్యలున్న 13,614 మందికి ఇప్పటికే కేటరాక్ట్ సర్జరీలు చేయించామన్నారు. 5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నామన్నారు. ► క్యాంపుల్లో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు అందేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. జనవరి నుంచి రెండోదశ ఆరోగ్య సురక్ష.. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతీవారం ఒక ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రచించామన్నారు. క్యాంపుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని.. మందులు, వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఇలా 110 మున్సిపాలిటీల్లోని పట్టణ, నగర ప్రాంతాలను కవర్ చేస్తూ వారంలో 162 క్యాంపులు ఉంటాయన్నారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రివెంటివ్ కేర్ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్‌పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణకు చర్యలు చేపడుతున్నారు. ప్రివెంటివ్ కేర్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్(బీపీయూహెచ్)లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 334 యూనిట్లు నిర్మించాల్సి ఉండగా, తొలి దశలో 166 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ.30 లక్షలు చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్మాణాలన్నీ చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 141 యూనిట్ల భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా, 94 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా.. పీహెచ్సీ ప్రాంగణాల్లో నిర్మిస్తున్న బీపీయూహెచ్‌లు మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా వ్యవహరిస్తాయి. వీటిల్లో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) యూనిట్‌తోపాటు పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సెమీఆటో అలైజర్, సెల్ కౌంటర్, ట్రూనాట్, అల్ట్రాసౌండ్, హెచ్‌బీ1సీ పరికరాలు ల్యాబ్‌లలో ఉంటాయి. కరోనా వైరస్, డయేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపించినప్పుడు ఈ యూనిట్ల ద్వారా సర్వేలెన్స్ ఉంచుతారు. ఎపిడమాలజిస్ట్‌లతోపాటు విజిలెన్స్ సెల్ కూడా అందుబాటులోకి వస్తాయి. యూనిట్లన్నింటినీ జిల్లా, బోధనాస్పత్రుల్లోని ల్యాబ్‌లకు అనుసంధానం చేస్తారు. -
జగనన్న ఆరోగ్య సురక్షకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
-
పిల్లలకు పునర్జన్మ
♦ దుర్గావరప్రసాద్, ఆదిలక్ష్మి దంపతులది కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామం. ప్రసాద్ గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరి మూడేళ్ల కుమార్తె జాహ్నవికి పుట్టుకతోనే గుండెజబ్బు ఉంది. మూడేళ్లు పైబడ్డాక ఆపరేషన్ చేయడానికి వీలుంటుందని అప్పట్లో వైద్యులు చెప్పారు. ఇంతలో గత నెలలో తాళ్లరేవులో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. దీంతో ఆదిలక్ష్మి జాహ్నవిని ఆరోగ్య సురక్ష శిబిరానికి తీసుకెళ్లింది. వైద్యులు కాకినాడ జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి(డీఈఐసీ) రిఫర్ చేశారు. 25న పాపను డీఈఐసీకి తీసుకుని వెళ్లగా పలు వైద్య పరీక్షల అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వెళ్లాల్సిందిగా సూచించి ప్రయాణ ఖర్చుల కోసం డబ్బులిచ్చారు. 29న పాపను హృదయాలయానికి తీసుకెళ్లగా ఈనెల 2న గుండెకు ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ‘ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వమే నా బిడ్డకు గుండె ఆపరేషన్ చేయించింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుంది. ఆస్పత్రికి రానుపోను డబ్బులు కూడా ఇచ్చారు. పాప విశ్రాంత సమయంలో భృతి కింద వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద కూడా సాయం ఖాతాలో జమవుతుందన్నారు. ఈ మేలును జన్మలో మరువలేం’.. అని ఆదిలక్ష్మి ఎంతో సంతోషంతో అంటోంది. ♦ నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన రైతు అనిల్ దంపతులకు ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె మధుప్రియకు గ్రహణం మొర్రి సమస్య ఉండటంతో పుట్టిన వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధారించారు. పాప పెద్దయ్యాక ఆపరేషన్ చేయడానికి వీలుంటుందని చెప్పారు. ప్రస్తుతం పాపకు మూడేళ్లు దాటాయి. దీంతో పాప గుండెకు ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించింది. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వేలో పాప సమస్యను తల్లిదండ్రులు వివరించారు. దీంతో వైద్య శిబిరానికి హాజరుకావాలని సిబ్బంది చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇక్కడి నుంచి మధుప్రియను హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ పూర్తయింది. ‘మా కోసమే ప్రభుత్వం ఆరోగ్య సురక్ష పెట్టిందా అనిపిస్తోంది. రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే మాకు ఆపరేషన్ చేయించడం స్థోమతకు మించిన అంశం’.. అని అనిల్ చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ..జాహ్నవి, మధుప్రియల తరహాలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల భవితకు సీఎం జగన్ ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుట్టుకతో న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, వంకర పాదాలు, నడుం భాగం వృద్ధిలోపం, గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే చెవుడు, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, మేథోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్ సహా ఇతర 30 రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను వైద్యశాఖ గుర్తిస్తోంది. వీరికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 7.12 లక్షల పీడియాట్రిక్ ఓపీలు.. గతనెల సెప్టెంబర్ 30 నుంచి మంగళవారం (ఈనెల ఆరో తేదీ) వరకూ రాష్ట్రవ్యాప్తంగా 12,138 సురక్ష శిబిరాలు నిర్వహించగా ఏకంగా 58.81 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ఇందులో 7,12,639 పీడియాట్రిక్ ఓపీలున్నాయి. వీటిలో 1,247 మంది పుట్టుకతో గుండె జబ్బులు, వినికిడి లోపం, గ్రహణం మొర్రి, ఇతర పెద్ద సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరినీ సురక్ష శిబిరంలోని వైద్యులు డీఐఈసీలకు రిఫర్ చేశారు. మిగిలిన చిన్నచిన్న సమస్యలున్న పిల్లలందరికీ శిబిరాల్లోనే వైద్యంచేసి, ఉచితంగా మందులు అందజేశారు. మరోవైపు.. ప్రయాణ ఛార్జీలతో సహా మెరుగైన వైద్యం కోసం డీఐఈసీలకు రిఫర్ చేసిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్యం చేయిస్తోంది. అంతేకాక.. వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ప్రయాణ ఛార్జీల కింద రూ.500లను కూడా అందిస్తోంది. రూ.లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. వినికిడి లోపం ఉన్న వారికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయిస్తున్నారు. ఇలా.. ఆస్పత్రులకు రిఫర్ చేసిన 1,247 మంది చిన్నారుల్లో 646 మందికి ఇప్పటికే చికిత్స పూర్తయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 165 మంది చిన్నారులను రిఫర్ చేయగా వంద శాతం పిల్లలకు చికిత్సలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ అండ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల ఆరోగ్యాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వినికిడి లోపం ఉన్న చిన్నారుల రెండు చెవులకు బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. రూ.12 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇక 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నాటికి వినికిడి లోపంతో బాధపడుతున్న 566 మంది చిన్నారులకు రూ.34 కోట్ల నిధులతో ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించింది. గుండె జబ్బులున్న పిల్లల కోసమైతే సీఎం జగన్ తిరుపతిలో ప్రత్యేకంగా హృదయాలయం ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇప్పటివరకు రెండు వేల మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించారు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వైద్యసేవలు.. ఆరోగ్య సురక్ష ద్వారా రిఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులపై ఎలాంటి ఆర్థిక భారంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలు అందిస్తోంది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ప్రయాణ ఛార్జీల కింద రూ.500 చొప్పున కూడా అందిస్తోంది. రిఫరల్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది ద్వారా ప్రతి రిఫరల్ కేసును ఆస్పత్రికి తరలిస్తున్నాం. అక్కడ పూర్తి ఉచితంగా పరీక్షలు, చికిత్సలు, మందులు అందించేలా చూస్తున్నాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
పేదల పాలిట అపూర్వ పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలలో ఈనెల 5వ తేదీ వరకు 85 వేలమంది పేషెంట్లను మెరుగైన చికిత్స కోసం నెట్వర్క్ ఆస్పత్రి, టీచింగ్ ఆస్ప త్రులకు వైద్యులు రిఫర్ చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో, పట్టణాలలో మాత్రమే లభ్యమయ్యే వైద్య సేవలు, ఈ శిబిరాలనిర్వహణ వల్ల పేద, మధ్యతరగతి గ్రామీణులకు కూడా అందుబాటులోకి రావడం ముదావహం. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో వున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ ‘జగనన్న ఆరోగ్య సురక్ష‘ కింద నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావు. పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే వీటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన ఆరోగ్య సంబంధిత పథకాల్లో ఈ సురక్ష పథకం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98 శాతం, వార్డు సచివాలయాల్లో 77 శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యింది. బృహత్తరమైన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి కుంటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు నిర్వహించటం మొదటి అడుగు. పట్టణ ప్రాంతాల్లో 91 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం స్క్రీనింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మరో వారంలో నూరు శాతం పూర్తి అవుతుందని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు స్క్రీనింగ్ జరిగిన 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించటం కని విని ఎరుగని విషయం. ఇలా స్క్రీనింగ్ చేసిన వారిని మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్ చేస్తారు. ఆ తర్వాత విలేజ్ క్లినిక్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు, గ్రామ సచివా లయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించి, వారి ద్వారా రోగులకు నయం అయ్యేంతవరకూ తగిన విధంగా సహాయ చర్యలు తీసుకొంటారు. ఇప్పటికే వేలాది మందిని మెరుగైన వైద్యం కోసం రిఫరల్ ఆస్పత్రులకు పంపిన ప్రభుత్వం మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించడానికి తగిన చర్యలు తీసుకొంటోంది. వారికి కావాల్సిన మందులు ఉచితంగా ఇవ్వటంతోపాటు ఆరోగ్యం బాగయ్యే వరకూ తగిన విధంగా వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. పేదలపాలిట ‘సంజీవని’గా ఉన్న ఈ పథకం ఇప్పటికే అందరి మన్ననలూ పొందుతోంది. కొన్ని నెట్వర్క్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగు తున్న మెడికల్ మాఫియా అక్రమాలు అరికట్టేందుకు మెడికల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ప్రభుత్వం నియమించింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులకు చెక్ పెట్టడం సాధ్యమ య్యింది. ఈ విధంగా జగన్ ప్రభుత్వం సాధారణ ప్రజానీకం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో వైద్యాన్ని అందించడంతో ‘ఆరోగ్యాంధ్రపదేశ్’ సాకారానికి దారి ఏర్పడింది. ప్రజలు వైద్యానికి అయ్యే ఖర్చులు మిగుల్చుకొని పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి ఆ డబ్బును ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడింది. అందుకే జనం జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకొంటున్నారు. చలాది పూర్ణచంద్ర రావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 94915 45699 -
ట్వీట్ చేయడం కాదు.. లోకేష్ దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు
-
ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలు.. అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నిరంతరం ‘ఆరోగ్య సురక్ష’
‘‘సోమవారం నాటికి.. ‘ఆరోగ్య సురక్ష’లో దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి’’. సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఉంటాయని.. ప్రతి వారం మండలంలో ఈ క్యాంపు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలా నెలలో ఆ మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని.. ఆరు నెలల్లో ప్రతి మండలం.. ప్రతి గ్రామంలో క్యాంపు జరుగుతుందన్నారు. తద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష, డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రివెంటివ్ కేర్ అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయని సీఎం చెప్పారు. ఏదైనా జబ్బు వచ్చాక వైద్యం అందించడం కన్నా.. అవి రాకుండా వాటిని నియంత్రించడమే ముఖ్యమని ఇందుకు ఈ వ్యవస్థలన్నీ ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రజారోగ్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని.. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల బాధితులకు చేయూత అందించాలని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత కీలకం ఐదో దశ.. ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదో దశ కార్యక్రమం మొత్తంలో అత్యంత కీలకమైంది. ప్రస్తుతం మనం నిర్వహించే వైద్య శిబిరాలు మామూలు శిబిరాలు మాత్రం కావు. సాధారణంగా నిర్వహించే వైద్య శిబిరాలు అప్పటికప్పుడు నిర్వహించి వైద్యంచేసి మందులిస్తే అక్కడితో అంతా అయిపోతుంది. అయితే, మన కార్యక్రమంలో శిబిరాల నిర్వహణ అనంతరం అసలు పనిమొదలవుతుంది. శిబిరాలు నిర్వహించిన అనంతరం వివిధ ఆరోగ్య సమస్యల బాధితులను మనం వైద్యపరంగా చేయిపట్టి నడిపిస్తాం. ఇదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. ఆరోగ్య సురక్షలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ సురక్షలో భాగంగా పట్టణాల్లో 91 శాతం, గ్రామాల్లో 94.94 శాతం మంది జనాభా స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల గృహాలను ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లు జల్లెడపట్టి 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో సగటున నాలుగు పరీక్షలు చేస్తూ జల్లెడ పట్టాం. గ్రామాల్లో 10,032 శిబిరాలకుగాను 98 శాతం అంటే 9,869 శిబిరాలు.. పట్టణాల్లో 2,390 శిబిరాలకు గాను 1,841 శిబిరాలు అంటే 77శాతం నిర్వహణ పూర్తయింది. ఇక గ్రామాల్లో ఈనెల 22న, పట్టణాల్లో 29 నాటికి శిబిరాల నిర్వహణ ముగుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం ఐదో దశలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా శిబిరాలకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తున్నాం. ఎవరెవరికి తదుపరి వైద్యసేవలు అవసరం ఉంది? ఎవరెవరిని ఆస్పత్రులకు రిఫర్ చేశాం? ఎవరెవరు ఏఏ సమస్యలతో బాధపడుతున్నారన్న సమగ్ర సమాచారం మన దగ్గర ఉంది. ఈ సమాచారం ఆధారంగా మనం మూడు రకాల కార్యక్రమాలు ఈ దశలో చేపట్టాలి. కార్యక్రమం–1 జబ్బులు నయమయ్యే వరకూ చేయిపట్టి నడిపించాలి.. ఇక సోమవారం నాటికి.. దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. రిఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులకు ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వాలి. 85వేల కేసుల్లో 13,850 మందికి ఇప్పటివరకూ చేయూతనిచ్చి తదుపరి చికిత్సల కోసం నెట్వర్క్/జిల్లా ఆస్పత్రులకు పంపించాం. మిగిలిన వారిని కూడా రాబోయే రోజుల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. వీరందరికీ చేయూతనందిస్తూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. ఈ కార్యక్రమంపై మీ అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి, గుర్తించిన మొత్తం రిఫరల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్‌ను 3,300కు పెంచాం. అయినప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని.. ఎక్కడైనా ఆరుదైన ఆరోగ్య సమస్యలు, జబ్బులు బయటపడిన సందర్భాల్లో ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా ఆదేశాలు జారీచేస్తున్నా. కార్యక్రమం–2 వైద్య సేవలపై ఆరా తీయాలి.. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించుకున్న రోగులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఇందులో భాగంగా.. ► డిశ్చార్జ్ అయి వచ్చిన రోగి ఇంటికి విలేజ్ క్లినిక్ సిబ్బంది వారం రోజుల్లో వెళ్లాలి. ► ఆస్పత్రుల్లో వైద్యసేవలపై ఆరా తీయాలి. ఎలాంటి లంచాలకు తావు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్సలు అందాయో లేదో తెలుసుకోవాలి. ► మందులు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలించాలి. ► వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందిందో లేదో నిర్ధారించుకోవాలి. ► రోగితో ఫొటో తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ► ఆరోగ్యశ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. ► కానీ, సరైన అవగాహనలేక, కొందరు తెలీక.. ఇతర కారణాలతో మరికొందరు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ► ఇలా చికిత్సానంతరం మూడు నెలల తర్వాత కేవలం 33 శాతం పేషెంట్లు మాత్రమే మందులు తీసుకుంటున్నారు. ► ఆరు నెలల తర్వాత 22 శాతం, ఏడాది తర్వాత చూస్తే కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. ► ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి రోగులు ఠంఛన్‌గా వెళ్లి మందులు తీసుకునేలా చూడాలి. ► ఈ మేరకు మొబైల్ యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం. ► రోగులు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు ఉంది. కార్యక్రమం–3 మందులు ఎంత ఖరీదైనా సరే అందించాలి.. కిడ్నీ, లివర్ రోగులతో పాటు, మస్క్యులర్ డిస్ట్రోపీ బాధితులు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది. అంత ఖరీదైన మందులను పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేరు. అలాంటి వారికి మందులు అందిస్తూ చేయూతనివ్వాలి. మందులు ఎంత ఖరీదైనా సరే వెనకడుగు వేయకుండా మనం అందించాలి. ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చాను. గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్స్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలి. వైద్యం కోసం ప్రజలు ఖర్చుపెట్టకుండా చూడాలి.. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. పథకం ద్వారా ఉచితంగా సేవలు పొందడం గురించి తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలి. మంచి ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలిచ్చాను. ఈ కార్డుల పంపిణీ కూడా అదేరోజు నుంచి ప్రారంభించాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. 1.24 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను తమ ఫోన్లలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్ క్లినిక్‌లో సంప్రదించినా, 104కు ఫోన్‌చేసినా గైడ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై బుక్లెట్ కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడంపై సీహెచ్ఓ, ఏఎన్‌ఎలు, ఆశా వర్కర్లు అవగాహన కలిగించాలి. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 950 నెట్వర్క్ ఆసుపత్రులుంటే, ప్రస్తుతం 2,295 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేశాం. అయినా వైద్యం కోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాలి? అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మనందరి బాధ్యత. 8.72 లక్షల మందికి కంటి పరీక్షలు.. ఇక ఆరోగ్య సురక్షలో కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 8.72 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు సిఫారసు చేశారు. వీరికి వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, 73,474 మందికి కంటి సర్జరీలు చేయాలని గుర్తించారు. వీరికీ సర్జరీలు చేయించాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తికావాలి. మరోవైపు.. రక్తపోటు కేసులు 2,48,638గా.. మధుమేహం 1,49,879 కేసులను గుర్తించారు. వీరిందరికీ నిర్ధారణ పరీక్షలు చేసి మందులివ్వాలి. ఆ తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్ కేర్‌లో ఇది చాలా కీలకమైన అంశం. పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం, మందులు అందుతున్నాయో లేదో విలేజ్ క్లినిక్స్ ద్వారా పరిశీలించాలి. రక్తహీనత బాధితుల మీద మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు దృష్టిపెట్టాలి. మందులు, సంపూర్ణ పోషణం ప్లస్ ద్వారా తగిన ఆహారం కూడా ఇప్పించాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థలు లేవు.. దేశంలో ఏ రాష్ట్రంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. అలాగే, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, గ్రామ సచివాలయంలాంటి వ్యవస్థలు లేవు. ఇవన్నీ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో మనల్ని అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. ప్రతి కలెక్టర్ దీన్ని సవాల్‌గా తీసుకుని, జీరో ఎనీమిక్ కేసులు దిశగా ప్రయత్నించాలి. అలాగే, 9,969 లెప్రసీ అనుమానాస్పద కేసులున్నాయి. వీరందరికీ వెంటనే నిర్ధారణ పరీక్షలు చేపట్టాలి. 442 మందికి టీబీ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరికి సక్రమంగా మందులు అందించాలి. 1,239 మంది చిన్నారులు 4–డి (డెఫీషియన్సీస్, డిఫెక్టŠస్ ఎట్ బర్త్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్) సమస్యలతో బాధపడుతున్నట్లుగా తేలింది. సాధ్యమైనంత త్వరగా వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందిస్తే పిల్లలు ఈ సమస్యల నుంచి బయటపడతారు. సేవలు మరింత విస్తరిస్తాం.. టెరిషరీ కేర్ వైద్యసేవలను రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తున్నాం. ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఒకవైపు పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా అభివృద్ధిపరుస్తూనే ఇవన్నీ చేపడుతున్నాం. ఇక నియామకాల పాలసీ మీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ప్రతి జిల్లాలో స్పెషలిస్టు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే కేవలం ఆరోగ్య రంగంలో 53 వేల ఖాళీలను మనం భర్తీచేశాం. ఈ నేపథ్యంలో.. ఎక్కడ ఖాళీలున్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, రాష్ట్రంలో తొలిసారిగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును çసృష్టించాం. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్‌జైన్, కార్యదర్శులు గుల్జార్, డాక్టర్ మంజుల, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ గిరిజాశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఈనెల 9 నుంచి 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం
-
జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల వద్ద ప్రస్తావించారు. సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారాయన. జగనన్న ఆరోగ్య సురక్షలో ఇప్పటిదాకా పురోగతిని వివరిస్తూనే.. రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నదానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారాయన. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తైంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూతనివ్వడం చాలా ముఖ్యం. ఇవి సాధారణమైన సాధారణ వైద్య శిబిరాలు కావు. శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అనేదే అత్యంత ముఖ్యమైంది’’ అని ఆయన అన్నారు. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ చేదోడుగా నిలవడమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారాయన. ‘‘ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోంది. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మనం జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నాం. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నాం. వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై మన దగ్గర డేటా ఉంది’’ అన్నారాయన. .. ‘జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్ 5 కల్లా 85వేల మంది పేషెంట్లను తదుపరి చికిత్సలకోసం నెట్వర్క్ ఆస్పత్రి/ టీచింగ్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరికి చేయూత నివ్వడం ఒక కార్యక్రమం. మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత విలేజ్ క్లినిక్‌కు, ఫ్యామిలీడాక్టర్‌కు, గ్రామ సచివాలయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించాలి. వారి ద్వారా వీరికి నయం అయ్యేంతవరకూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. 13,850 కేసులను ఇప్పటివరకూ చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్సలకోసం ఆస్పత్రులకు పంపించడం జరిగింది. మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. వారికి కావాల్సిన మందులు ఇచ్చి.. వారిని నయం అయ్యేంత వరకూ కూడా తగిన విధంగా చేయూత నివ్వాలి’ అని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. .. ‘‘మిగిలిన ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి గుర్తించిన మొత్తం రిఫరెల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమం డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలి. వీరు చికిత్సలు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి కావాల్సిన మందులు అందించడంతోపాటు, వారు వేసుకునేలా తగిన విధంగా చేయూత నివ్వాలి. రిఫరల్ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఈ పేషెంట్లకు రూ.500లు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ఒకవేళ ఆరోగ్య శ్రీ ప్రొసీజర్‌లో కవర్ కాని కేసులు అక్కడక్కడా ఉండొచ్చు. ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్య శ్రీకింద ఉచితంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు సీఎం జగన్. జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలన్న సీఎం జగన్.. ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే.. ఆరోగ్య శ్రీ కింద నమోదుకాని రోగాలు ఏమైనా కనిపించినా.. ప్రత్యేక కేసుల కింద పరిగణించి వారికి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందచేయాలన్నరు. అలాంటి పేషెంట్ల చికిత్సకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అధికారులతో అన్నారాయన. ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై దృష్టిపెట్టడం అనేది మరొక విషయం. చికిత్సలు చేయించుకున్న తర్వాత వీరికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు కనుక్కోవాలి. ఎలాంటి లంచాలకు తావులేకుండా ఉచితంగా వైద్యం అందిందా? లేదా? అనేది తెలుసుకోవాలి. వాళ్లు మందులు తీసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలి. ఆరోగ్య శ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నాం. అయితే వాళ్లు క్రమం తప్పకుండా తిరిగి వీళ్లు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. పేషెంట్లకు తెలియక, సరైన అవగాహన లేక తదితర కారణాల వల్ల చికిత్సలు చేయించుకున్న రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకోని సందర్బాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి పేషెంట్లు వెళ్లి.. మందులు తీసుకునేలా చూడాలి. ఈమేరకు యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం. అలాగే.. ఆ బాధ్యత విలేజ్ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు కూడా ఉంటుంది అని సీఎం జగన్ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల కింద గుర్తించిన పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పటిదాకా 8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే 73 వేలమందికిపైగా కంటి సర్జరీలు చేయాలని వైద్యులు చెప్పారు. ఆ సర్జరీలు కూడా వెంటనే పూర్తి కావాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీకూడా పూర్తికావాలి అని సీఎం జగన్, అధికారులకు ఆదేశించారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్టుగా గుర్తించిన వారికి తదుపరి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. అందులోకూడా నిర్ధారణ అయిన తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్ కేర్‌లో ఇది కీలక అంశం. అలాగే 9,969 మందికి లెప్రసీ అనుమానాస్పద కేసులు ఉన్నాయి. వీరికి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. అలాగే 442 మందికి టీబీ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. సుమారు 1, 239 మంది చిన్నారులు 4-D సమస్యలతో బాధపడుతున్నట్టుగా తేలింది: వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందించడం వల్ల ఆ పిల్లలు ఈ సమస్యలనుంచి బయటపడతారు. ఇప్పటికే తీవ్రరోగాలతో బాధపడుతున్న వారికి తగిన రీతిలో చేయూత నందించాలి. ఈ మందులు ఖరీదైనవి కాబట్టి, వాళ్లు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి కూడా మందులు అందించాలి. మందులు ఎంత ఖరీదైనా సరే, పేషెంట్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రామ వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌తో అనుసంధానం చేయాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నాయి. పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ప్రతి జిల్లాలోకూడా అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఉన్న మెడికల్ కాలేజీలను కూడా పునరుద్ధరిస్తున్నాం. రిక్రూట్మెంట్ పాలసీమీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఎక్కడైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే 53 వేలమందిని ఆరోగ్య రంగంలో ఖాళీలను మనం భర్తీచేశాం. ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, మెడికల్ రిక్రూట్ బోర్డును సృష్టించడం జరిగింది. ప్రివెంటివ్ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్‌లు అత్యంత కీలకం కానున్నాయి. పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందుతుందా? వారికి మందులు అందుతున్నాయా? అనే విషయాల్ని విలేజ్ క్లినిక్ ద్వారా పరిశీలన చేయించాలి. లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఏ రాష్ట్రాంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెస్ట్, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థ ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. జనవరి 1 నుంచి క్రమంత తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ ఉండాలి. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలి. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలి. ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుంది. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయి. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత. అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలి: మంచి ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలి. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్.. ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్ చేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం.. 2,295 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. అయినా వైద్యంకోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాల్సిన అవసరం ఏముంది?. అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మన అందరి బాధ్యత. ఆ దిశగా అడుగులు వేసే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం అని సీఎం జగన్ అన్నారు. -
ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోంది
-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో నిరుపేదలకు మెరుగైన వైద్యం..
-
తుది దశకు చేరుకున్న జగనన్న ఆరోగ్య సురక్ష
-
93 శాతం శిబిరాలు పూర్తి
సాక్షి, అమరావతి: వైద్యాన్ని పేదలకు చేరువలోకి తీసుకువచ్చి, ప్రజలందరి ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ విజయవంతంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది మొదలు ప్రజలు పెద్దఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 12,422 ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణ లక్ష్యం కాగా, 93.07 శాతం.. అంటే 11,562 శిబిరాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో వంద శాతం కార్యక్రమం పూర్తి అయింది. మిగిలిన జిల్లాల్లో 860 గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో ఈనెల 15వ తేదీ లోగా పూర్తి చేసేలా వైద్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం ఆరోగ్య సురక్ష శిబిరాల్లో స్పెషలిస్ట్ వైద్యుల పరిశీలన అనంతరం మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ సుమారు 80 వేల మందికి పైగా రోగులను రిఫర్ చేశారు. వారిని స్థానిక ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు అనుసంధానించి తదుపరి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ నాటికి 520 మందికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో సర్జరీ/వైద్యం చేశారు. వీరిలో 451 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు కూడా వెళ్లారు. ఇదే తరహాలో మిగిలిన రోగులందరికీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు, అవసరం ఉన్న వారికి సర్జరీ సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కూడా వీరి ఆరోగ్యంపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది ద్వారా నిరంతరం వాకబు చేస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బుల బాధితులకు భరోసా.. కొత్తగా మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారిని ఆరోగ్య సురక్షలో ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటినీ జల్లెడ పట్టి స్క్రీనింగ్ చేయగా.. గతంలో ఉన్న బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. మరోవైపు నమూనాలు సేకరించి 417 మందిలో క్షయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుష్టు వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
దీర్ఘకాలిక జబ్బులకు ‘సురక్ష’తో భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వైద్య శాఖ ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజలందరినీ స్క్రీనింగ్ చేయడమే కాకుండా.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ), క్షయ జబ్బులతో బాధపడుతున్నవారిని గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1.84 కోట్ల మందిలో షుగర్ లక్షణాలు.. గత నెలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 4.63 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారు. 2.16 కోట్ల మందిలో బీపీ, 1.84 కోట్ల మందిలో షుగర్ జబ్బు లక్షణాలను గుర్తించారు. గతంలో నిర్వహించిన నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో నిర్ధారించిన పాత బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బీపీ కేసులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 12,790, నెల్లూరులో 12,583, విజయనగరంలో 12,124 వెలుగులోకి వచ్చాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 9,279, నెల్లూరులో 8,275, విజయనగరంలో 7,363 షుగర్ కేసులను గుర్తించారు. మరోవైపు క్షయ అనుమానిత లక్షణాలున్న 1,78,515 మంది నుంచి నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించగా.. 417 మందిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలున్న 9,925 మందిని గుర్తించగా.. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 8 లక్షల మందిలో కంటి సమస్యలున్నట్టు గుర్తించిన వైద్యులు.. సాధారణ మందులతో తగ్గే సమస్యలున్న 2.44 లక్షల మందికి మందులు అందజేశారు. 4.86 లక్షల మందిని కళ్లద్దాలకు, 69,676 మందిని కేటరాక్ట్ సర్జరీలకు రిఫర్ చేశారు. వీరిలో 833 మందికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా సర్జరీలు నిర్వహించింది. కొత్తగా బయటపడిన బీపీ, షుగర్, క్షయ తదితర జబ్బులున్న వారికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. ప్రారంభదశలోనే గుర్తిస్తే ఎంతో మేలు.. చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. చాలా మందికి బీపీ, షుగర్ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. ఇలా అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే.. 20 శాతం పెరాలసిస్ కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్ సమస్యను కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీ, గుండె, ఇతర సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముంది. దేశంలో బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా 64.9 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా గుర్తించిన మధుమేహం, రక్తపోటు, క్షయ, ఇతర సమస్యలన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అనుసంధానం చేశాం. కొత్తగా గుర్తించిన మధుమేహం కేసుల్లో సంబంధిత వ్యక్తులకు హెచ్1బీ ఏసీ టెస్టులు నిర్వహిస్తాం. సంబంధిత వ్యక్తుల ఆరోగ్యాలను ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు మందులు అందిస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే తగిన సహకారం అందిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 6 లక్షల మందికిపైగా బీపీ బాధితులకు, 4.10 లక్షల మందికిపైగా మధుమేహం బాధితులకు నిరంతర వైద్య సేవలందిస్తున్నాం. –జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజారోగ్యంలో మంచి ఫలితాలు గ్రామాల్లో వ్యవసాయం, ఇతర కూలిపనులు చేసుకుంటూ జీవించే పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వమే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వైద్య సేవలందించడం శుభపరిణామం. ఇలా చేయడం ద్వారా బీపీ, షుగర్, ఇతర జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ప్రజారోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ -
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లక్ష మంది పేదలకు రిఫరల్ సేవలు
సాక్షి, గుంటూరు జిల్లా: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి రాగా.. వీరిలో దాదాపు లక్ష మందికి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యానికి డాక్టర్లు రిఫరల్‌కు పంపించారని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. కేవలం రిఫరల్‌తో ఆగిపోకుండా చికిత్స అనంతరం తిరిగి గ్రామాలకొచ్చాక కూడా ఆయా పేషంట్ లు ఏమేరకు సంతృప్తి పొందారో ఫీడ్ బ్యాక్ తీసుకుని, బాగుందని సంతృప్తి చెందే వరకు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు. ఆ దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మార్కండేయ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆరోగ్య శ్రీ సీఈవో ఎం.యన్.హరీందర ప్రసాద్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ బాబు పాల్గొన్నారు. గతంలో ఒక యుపిహెచ్సీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నామని తెలిపిన ఎం. టీ. కృష్ణబాబు.. ప్రతి వార్డు సచివాలయంలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ యాప్‌లను వాలంటీర్ల ద్వారా డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తద్వారా సమీపంలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు,ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు వంటి సమాచారం యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఆరోగ్య శ్రీకి సంబంధించి పూర్తి సమాచారంతో ముద్రించిన బ్రోచర్లను కూడా ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 వేలకు పైగా శిబిరాల్ని నిర్వహించామని, సరాసరి 450 ఓపీలు నమోదయ్యాయని కృష్ణ బాబు పేర్కొన్నారు. వీరందరికీ పరీక్షలు, మందులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని ఉచితంగా అందించామన్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ కూడా చేశారన్నారు. ఆరోగ్య శ్రీ పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. పేద ప్రజలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా.. ప్రభుత్వం నుండి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఆరోగ్య శ్రీపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసేందుకు ఎఎన్ ఎం/సిహెచ్వోలు, వాలంటీర్లతో కలిసి పనిచేస్తారని కృష్ణ బాబు తెలిపారు. గ్రామాల్లో అక్కడికక్కడే పూర్తి స్థాయి షుగర్ టెస్టులు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కృష్ణబాబు తెలిపారు. తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయాలని కమీషనర్ నివాస్, ఆరోగ్య శ్రీ సీఈవో హరీంధరప్రసాద్లకు ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా ఆరోగ్య శ్రీ బ్రోచర్ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు.ఆరోగ్యశ్రీ బ్రోచర్లోని సమాచారాన్ని చదివారా? అని రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. శిబిరానికొచ్చిన రోగులు , వృద్ధులు, గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ యాప్ ను ఎఎన్ఎంలు డౌన్లోడ్ చేయిస్తున్నారా అని ఆరా తీశారు. జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులు , ఫోల్డర్లు సరిపడా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకన్నారు. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు కొండంత అండ అంటున్న తిరుపతి వాసులు
-
పేదల ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వం భరోసా
-
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను సందర్శించిన మంత్రి కాకాణి
-
పేదోళ్లకు వరం.. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం
చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్షతో పేదోళ్ల ఆరోగ్యానికి అత్యంత రక్షణ కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనా విధానం నుంచి పుట్టిన అద్భుత పథకమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుగాలికాలనీలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి బుధవారం పరిశీలించారు. శిబిరానికి హాజరైన పేద రోగులను ఆత్మీయంగా పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందజేయటమే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కోటి34లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,535 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. 71,173 మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్యం అందించినట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యరంగం కుదేలైందని విమర్శించారు. గతంలో 1,059 ఉన్న ఆరోగ్య శ్రీ వైద్య సేవలను జగనన్న ప్రభుత్వం 3,257కు పెంచిందని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రవి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొన్నారు. -
ఈనాడుతప్పుడు రాతలపై మండిపడిన పాలకొల్లు ప్రజానీకం
-
పేదవాడి ఆరోగ్యానికి భరోసా..
-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో సరికొత్త వైద్య విప్లవం..
-
రోగుల చెంతకే వైద్యం
-
పేదరికం తగ్గుతోంది!
దేశంలో గత ఐదేళ్లలో రెండేళ్లు కరోనా మహమ్మారి ఇబ్బందిపెట్టినా పేదరికం తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ, విద్యా, వైద్య పథకాల ఫలితమేనని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ నివేదిక –2023ను పరిశీలించినప్పుడు దేశంలో పేదరికం పరిస్థితి ఇటీవలి సంవత్సరాల్లో (2015–16, 2019–21) ఎలా ఉందో స్పష్టమవుతోంది. సుస్థిరాభివృద్ది లక్ష్యాలు (ఎస్డీజీ)... సామాజిక–ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కొరకు ‘ఎవరినీ వదిలి పెట్టకూడదు’ అనే దృష్టితో నిర్దేశించబడ్డాయి. అంటే ఆదాయంతో ముడిపడిన పేదరికమే కాకుండా, మిగతా అన్ని వసతు లనూ పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేసి దాని నిర్మూలించడం కూడా ఒక లక్ష్యమన్నమాట. అనేక కోణాలను పరిగణన లోకి తీసుకుని పేదరికాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, అవసరమైన వసతులు... అంటే నీరు, పారిశుద్ధ్యం, పోష కాహారం, శిశు, ప్రసూతి మరణాలు, పాఠశాల హాజరు, ఇతర ప్రాథమిక గృహ సౌకర్యాలు పొందడం వంటి వాటినన్నిటినీ పేదరికాన్ని నిర్వచించడంలో పరిగణించాలి. ఇటువంటి పేదరిక అంచనా కోసం నిర్దేశించిన 12 సూచికలలో పదింటిని, ప్రపంచ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేయడానికి చేర్చినవి కాగా మిగిలిన రెండు సూచికలు: ప్రసూతి ఆరోగ్యం, బ్యాంక్ ఖాతాలు దేశంలో పేదరికాన్ని అంచనావేయడానికి అదనంగా చేర్చబడ్డాయి. ఇటువంటి అనేక కోణాల ఆధారంగా నిర్ధారించిన పేదరికం (ఎంపీఐ) జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులలో ఎలా ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక తెలియజేస్తోంది. దేశ స్థాయిలో పేదరికం బాగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. 2015–16లో మన జనాభాలో 25 శాతం పేదలు ఉండగా, 2019–21 నాటికి 15 శాతానికి పేదరికం తగ్గింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వేసిన అంచనా దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని సూచిస్తోంది. సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలు 2030 కంటే ముందుగానే, భారతదేశం సాధించవచ్చని ఇది చెబుతోంది. మొత్తం 12 సూచి కలు అభివృద్ధిని చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గుముఖం పట్టింది. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 8.65 శాతం నుండి 5.27 శాతానికి పేదరికం తగ్గింది. 28 రాష్ట్రాలలో, పది రాష్ట్రాలు 2019–21లో దేశ సగటు 14.96 శాతం కంటే ఎక్కువ శాతం పేదరికాన్ని నమోదు చేశాయి. దేశంలో అత్యల్పంగా కేరళలో ఒక శాతం కంటే తక్కువ మంది పేదలుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పేదల శాతం దేశ సగటు కంటే చాలా తక్కువగా ఉంది.2019–21లో దేశ సగటు పేదరిక స్థాయి కంటే, తెలుగు రాష్ట్రాల్లో, పైన చెప్పిన విధంగా అంచనా వేసిన పేదల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది 2015–16 లో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 12 నుండి 13 శాతం ఉండగా, 2019–21 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 6 శాతానికి తగ్గింది. పేదరిక అంచనాలో ఉపయోగించిన సూచికలలో, పిల్లల–కౌమార మరణాలు, పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల హాజరు, విద్యుత్ సౌకర్యం, ఆస్తులు కలిగి ఉండటం వంటివి రెండు తెలుగు రాష్ట్రాలలో సమాన శాతంలో ఉన్నాయి. 2023 ఏడాదిలో విడుదల అయిన నీతి ఆయోగ్ నివేదిక, కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా, సామాజికంగా అతలా కుతలం అయిన కాలాన్ని అనగా 2019–21ను ప్రతిబింబిస్తోంది. పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు బహుసూచికలతో పొందు పరచిన పేదరిక శాతాన్ని తగ్గించడంలో బాగా సహాయ పడ్డాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్ఆర్ అమ్మ ఒడి’, ‘వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన’, ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’, గృహనిర్మాణ పథకం; తెలంగాణలో ‘ఆరోగ్య లక్ష్మి’, గృహనిర్మాణ పథకం, ‘కేసీఆర్ కిట్’ ‘మిషన్ భగీరథ’ పథకాలు పేదరిక శాతాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడ్డాయి. అదనంగా, రెండు రాష్ట్రాలలో, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయడం కూడా పాఠశాల హాజరు, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహద పడుతున్నాయి. ఈ పథకాల పూర్తి ప్రభావం తదుపరి నీతి ఆయోగ్ నివేదికలో ఎక్కువగా ప్రస్ఫుటం గావచ్చు. ఈ పథకాల ప్రభావంతో, తెలుగు రాష్ట్రాలలో, పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గవచ్చు. డా‘‘ పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త ఆర్థిక అంశాల నిపుణుడు ఈ–మెయిల్: prudhvikar@cess.ac.in -
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
-
పేదల కళ్లల్లో కాంతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్‌వో, ఏఎన్ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు. బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్యుల సేవలు కూడా... రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
జగనన్న ఆరోగ్య సురక్ష సరికొత్త రికార్డ్..!
-
ఆరోగ్య సురక్ష విస్తరణ
-
ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష
తుని రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య బృందం అందించిన అత్యవసర వైద్య సేవలు ఓ యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట శివారు టి.వెంకటాపురంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హెచ్.కొత్తూరుకి చెందిన మలగంటి లోకేష్ ఉన్నట్టుండి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. అతడికి మెరుగైన వైద్యం అందించాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని పట్టణానికి తీసుకువెళ్లాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టి.వెంకటాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరుగుతోందని తెలుసుకున్న లోకేష్ బంధువులు వెంటనే అక్కడికి తీసుకువెళ్లారు. వైద్య బృందం 104లో ఉంచి సీపీఆర్ పరికరంతో హృదయ స్పందన, శ్వాస తిరిగి ప్రారంభమయ్యేలా ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించడంతో కొంతసేపటికి హృదయ స్పందన తిరిగి ప్రారంభమై లోకేష్ కళ్లు తెరిచాడు. వెంటనే ఎర్రకోనేరు గ్రామం వరకూ 104లో, అక్కడి నుంచి 108లో తుని ఆస్పత్రికి తరలించారు. గోల్డెన్ సెక్షన్స్‌లో సీపీఆర్ సేవలు అందించడం సత్ఫలితాన్ని ఇచి్చందని వైద్యులు చెప్పారు. -
విశాఖ జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష
-
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే @ 5.28 కోట్లు
సాక్షి, అమరావతి : జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11వరకు మొత్తం 5,28,33,324(ఏడు రకాల) వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్ఎంలు, కమ్యునిటీ హెల్త్ ఆఫీ సర్లు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, గత నెల 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరాలకు భారీగా జనం వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు తీసుకుంటున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో మొత్తం ఏడు రకాల పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్, మూత్ర (యూరిన్), హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శిబిరాలకు రాక ముందే పౌరుల ప్రొఫైల్‌తో కూడిన కేస్ షీట్‌ను ప్రింట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే రోగులకూ ఆరోగ్య శిబిరాల్లో కేస్ షీట్ ఇస్తున్నారు. వీరందరికీ ఆరోగ్య శిబిరాల్లో స్పెష లిస్ట్ సేవలందిస్తున్నారు. మహిళా రోగుల కో సం ప్రత్యేకంగా మహిళా వైద్యులు సేవలందిస్తు న్నారు. 172 రకాల డ్రగ్స్ అందుబాటులో ఉంచి.. అవస రాన్ని బట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎల్ ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, సీరమ్ వంటి 53 రకాల తదుపరి పరీక్షల కోసం పీహెచ్‌సీలకు అను సంధానం చేయ డంతో పాటు ఏఎన్ఎం ద్వారా పరీ క్షల ఫలితాలను తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఫాలోఅప్ చేయిస్తున్నారు. పెద్ద చికిత్సలు అవసరమైన వారిని నెట్వర్క్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నారు. పోషకాహార ప్రదర్శనలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలనే దానిపైనా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆరోగ్య శిబిరాల్లో టీబీ, కుష్టు పరీక్షలు చేసిన ప్పుడు పాజిటివ్ అని తేలితే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. శిబిరాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఆరోగ్య శ్రీ కార్డుల్లేని అర్హులైనవారికి ఆరోగ్య శిబిరాల్లోనే కార్డులు మంజూరుచేస్తున్నారు. తీవ్రమైన పోష కాహార లోపం కేసులను గుర్తించడంతో పాటు, పోష కాహార పునరావాస కేంద్రాలకు సిఫారుసు చేస్తు న్నారు. పిల్లల్లో పుట్టకతో వచ్చే లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సలు సూచిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో చికిత్సలకు వచ్చే వారి కోసం కుర్చీలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఆ రోగ్య శిబిరాల నిర్వహణకు ఒక్కో విలేజ్ క్లినిక్‌కు రూ.20 వేల చొప్పున, పట్టణ పీహెచ్‌లకు రూ.40 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పీహెచ్సీ పరిధిలో నలుగురు, పట్టణాల్లో 4–5 పీహెచ్‌సీల పరిధిలో ఒకరిని పర్యవేక్షణ కోసం నియమించారు. -
జగనన్న ఆరోగ్య సురక్షకు విశేష స్పందన
-
హక్కుగా ‘ఆరోగ్యం’ - వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా ప్రజలంతా సంతృప్తి చెందేలా సేవలందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలని, అనారోగ్య బాధితులను చేయి పట్టుకుని నడిపిస్తూ శిబిరాల్లో సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. క్యాంపుల్లో చికిత్సతోపాటు మందులు కూడా ఇస్తున్నామన్నారు. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మందుల విషయంలో రాజీ పడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలని ఆదేశించారు. సురక్ష కార్యక్రమం ప్రభుత్వ ప్రతిష్టనే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిష్టనూ పెంచుతుందన్నారు. ఆరోగ్య సురక్ష నిర్వహణ కోసం కలెక్టర్లకు మరిన్ని నిధులు అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, నాడు – నేడు కార్యక్రమాలు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ... అంతటితోనే ఆగొద్దు.. ప్రజల ఆరోగ్య అవసరాలు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య శిబిరాల్లో వైద్యం చేస్తున్నాం. శిబిరాల్లో వైద్యం అందించడంతోనే మన బాధ్యత ముగిసినట్లు కాదు. ఆ తర్వాత కూడా మనం ప్రజలకు అండగా నిలవాలి. వారిని వైద్య పరంగా చేయి పట్టుకుని నడిపించాలి. ఈ క్రమంలో 5 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఇవీ ఐదు అంశాలు.. వెద్య శిబిరాల్లో మెరుగైన చికిత్స అవసరమని గుర్తించిన వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా రిఫర్ చేసిన వారి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తీసుకోవాలి. వారికి నెట్వర్క్ ఆస్పత్రిలో అవసరమైన వైద్యం, శస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీ కింద అందేలా చూడాలి. ఆరోగ్య సమస్య పూర్తిగా నయం అయ్యేవరకూ చేయి పట్టుకుని నడిపించాలి. వారికి చేయూతను అందించాలి. ఆస్పత్రుల్లో గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చికిత్స అనంతరం మందులను క్రమం తప్పకుండా వాడటం చాలా ముఖ్యం. లేదంటే సమస్య మళ్లీ తిరగబెడుతుంది. వీరు వాడాల్సిన మందుల విషయంలో రాజీ పడొద్దు. అవి ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలి. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ వీరికి చెకప్‌లు చేయాలి. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాలపై వాకబు చేస్తుండాలి. వైద్య పరంగా ఏ అవసరం వచ్చిన సిబ్బంది తక్షణమే స్పందించాలి. ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న రోగులకు కూడా మనం చేయూత అందించాలి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో వాకబు చేయాలి. సరిగా మందులు వాడుతున్నారో? లేదో? తెలుసుకోవాలి. చికిత్స, క్రమం తప్పకుండా చెకప్, మందులు.. ఇలా వివిధ అవసరాల్లో వారికి అండగా నిలవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలి. ప్రతి సచివాలయం వారీగా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనేది వివరాలు సేకరించి వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టలతో అనుసంధానం చేయాలి. వీరికి వైద్య పరంగా అండగా నిలవడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వచ్చే నెల 15వ తేదీతో ముగుస్తుంది. అయితే అనంతరం కూడా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహించాలి. ప్రతి నెలా మండలంలో నాలుగు సచివాలయాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రతి పౌరుడికి వైద్య పరంగా అండగా నిలవడం ప్రభుత్వంగా మన బాధ్యత. వైద్య శిబిరాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంపుల్లో సంతృప్తకర స్థాయిల్లో సదుపాయాలు ఉండేలా చూడాలి. రోగులకు చేయూతను అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సురక్ష కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు కార్యక్రమాన్ని సది్వనియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ ఐదు అంశాలపై నేనే సమీక్షిస్తా. నలుగురు వైద్యులు.. ఇద్దరు స్పెషలిస్టులు ఆరోగ్య సురక్ష క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. రోగులకు ఉత్తమ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలి. వీరిలో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలి. రోగిని పరిశీలించినప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు చేసి సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తిరుపతి తరహాలోనే చిన్న పిల్లలకోసం అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలి. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) అజయ్‌జైన్, కార్యదర్శి మంజుల డి హోస్మణి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిర ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వీసీ ద్వారా సమీక్షకు హాజరయ్యారు. ఆరోగ్యశ్రీపై అందరికి అవగాహన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన లేని వ్యక్తి ఒక్కరూ ఉండటానికి వీల్లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వాళ్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి. ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ చార్జీలు కూడా ఇవ్వాలి. రక్త హీనతతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారాన్ని అందించేలా ఎస్వోపీ రూపొందించాలి. దివ్యాంగులకు సరి్టఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచి్చనప్పుడు అక్కడే వీరికి సరి్టఫికెట్లు జారీ చేసేలా ఆలోచన చేయాలి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇవ్వడం, వారికి అవసరమైన ఖరీదైన మందులను అందించే కార్యక్రమం చేపట్టాలి. మందులు అందడం లేదన్న మాటే రోగుల నుంచి రాకూడదు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో సంచలన ఫలితాలు
చిలకలూరిపేట: రాష్ట్రంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాల దిశగా దూసుకుపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి విడదల రజిని సందర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ వరకు అంటే తొలి పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,041 వైద్య శిబిరాల్లో ఏకంగా 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించామన్నారు. ఇప్పటి వరకు 34 వేల మంది రోగులకు మెరుగైన వైద్యం అవసరం ఉందని గుర్తించి, పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేశామని పేర్కొన్నారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు డీఎంఅండ్‌హెచ్‌వోలు, ఆయా గ్రామాల సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యంగా తిరిగి వచ్చేవరకు ఫాలోఅప్ ఉంటుందని, ఆ తర్వాతే వారి కేసు ఆన్లైన్లో ముగుస్తుందని వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని ఆమె వివరించారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయం’ అంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కొనియాడారు. మంగళవారం ఆయన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను ప్రశంసిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘బేస్‌లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా పేదల ఆరోగ్యంపై శ్రద్ధకు శ్రీకారం చుట్టారు. తెలుగునాట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ రూపంలో, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ‘ఆరోగ్య సురక్ష’ ద్వారా అధ్వానంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థకు జీవం పోశారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేవలం అనారోగ్యం, సరైన వైద్యం అందక, వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం శుభపరిణామం. ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండటంతో.. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అంటూ వీడియో సందేశంలో జయప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్‌ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఒక్క రోజులోనే 32 హెల్త్ క్యాంపులు
-
పథకాల అమలులో ఏపీ ప్రామాణికం
సాక్షి, బెంగళూరు: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే గొప్ప ప్రామాణికంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ మీడియా గ్రూప్.. సౌత్ ఫస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్ డైలాగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మదింపు జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాల ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా? ఒకవేళ ఉంటే అది సరైన దారిలోనే ఉందా? అనే అంశాలపై చర్చ నిర్వహించారు. అనేక సంస్కరణలకు శ్రీకారం.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. మన దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పథకం ఆయన ఆలోచన నుంచి వచ్చేందేనన్నారు. అమ్మఒడి ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల డ్రాపవుట్లు నివారించి అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామన్నారు. నాలుగేళ్లలో ఈ పథకానికి తమ ప్రభుత్వం ఏకంగా 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అలాగే రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు–నేడు కింద రూ.17,805 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా 1 నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు రూ.19,178.17 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున అందించిందన్నారు. 30 లక్షల మందికిపైగా మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీ ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం కనీవినీ ఎరుగని సంస్కరణలు ప్రవేశపెట్టిందని రజిని తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. దేశంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని వెల్లడించారు. రూ.16 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
జగనన్న ఆరోగ్య సురక్షకు విశేష స్పందన
-
ఊరూ వాడా జగనన్న ఆరోగ్య సురక్షకి అద్భుత స్పందన (ఫోటోలు)
-
అవ్వలతో మంత్రి విడదల రజిని సరదా సన్నివేశం
-
ఊరూ వాడా.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. ఉచితంగా పరీక్షలు.. మందులు ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. టోకెన్లు లేకున్నా వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మహిళలకు ప్రత్యేక కౌంటర్ – పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి – కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)) ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది. ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి. 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. -
‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ లక్ష్యంగా ప్రజల చెంతకే వైద్యం
-
గర్భిణీలూ.. నెలలు నిండకుండానే బర్త్ వెయిటింగ్ హాల్‌కు రండి: మంత్రి రజిని
సాక్షి, అల్లూరి జిల్లా: మన్యానికి జ్వరం వచ్చింది అన్న శీర్షికలతో గతంలో వార్తలు చదివాం.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది మన్యానికి మంచి ఆరోగ్యం వచ్చింది. సీఎం జగన్ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇది ఓ చరిత్ర.. అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సందర్శించారు. అక్కడ వచ్చినా రోగులతో మాట్లాడారు. వివిధ దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల మంచి మనసు తనకు ఎంతో మనసుకు నచ్చిందన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలని సీఎం జగన్ ఆలోచన మేరకు కృషి చేస్తున్నట్టు వివరించారు. గర్భిణీలు నెలలు నిండే వరకు గిరిజన గ్రామాల్లో ఉండకుండా బర్త్ వెయిటింగ్ హాళ్లకి చేరాలని కోరారు గర్భిణీ తో వచ్చే సహాయకులకు ఉచితంగా వసతి ఆహారం అందిస్తామని చెప్పారు. దీనిద్వారా ప్రసాద్ సమయంలో ఇబ్బందులు పడకుండా దోళీమోతలు లేకుండా ఉంటాయని వివరించారు. ఈ విషయంలో గర్భిణీలకు ఆశా వర్కర్లు సహకరించాలని సూచించారు. ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు రోజుల్లోనే గరిష్టంగా 11 వేల 550 మందికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ ఆసుపత్రులకు సిఫార్సు చేశామన్నారు. సాధారణ జ్వరం లాంటి రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సదుపాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష నగరాలు గ్రామీణ ప్రాంతాల కంటే మారుమూల గిరిజన గ్రామాలకు చెరువు చేయాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. గతం మాదిరిగా పాడేరు అరకు మన్యం ప్రాంతాల నుంచి వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే అధునాతన వైద్యం అందే రీతిన చర్యలు చేపట్టారని, వచ్చే ఏడాదికి పాడేరు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి 300 పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి వస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. గతంలో చూస్తే మన్యంలో ఖనిజ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని.. ఇప్పుడు అందుకు భిన్నంగా గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ ఆలోచనలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతానికి దగ్గరగా ఉన్న గర్భిణీలు కోసం ఆసుపత్రులకు దగ్గరలో బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన ప్రజల కోసం పాడేరు పార్వతిపురం మన్యం జిల్లాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వచ్చే గిరిజనులకు మధ్యాహ్నం ఆహారం కూడా ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపించాలని ఆమె కోరారు. తొలిసారిగా గర్భిణీ స్త్రీల వెయిటింగ్ హాల్ కోసం తన క్వార్టర్స్ ను కేటాయించిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ను ఆమె అభినందించారు. మరింత మెరుగైన వైద్యం గిరిజన ప్రజలకు అందించడానికి అవసరమైన కొత్త ప్రణాళికలను అమలు చేస్తామని మంత్రి విడుదల రజిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ..పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ.. జగన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర.. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ధనవంతులతో సమానంగా వైద్యం
-
‘జగనన్న ఆరోగ్య సురక్ష’తో మేం సురక్షితంగా ఉన్నాం
-
జగనన్న ఆరోగ్య సురక్ష...ప్రజారోగ్య రంగంలో సువర్ణాధ్యాయం
-
AP: ప్రభుత్వ వైద్య సేవల్లో కొత్త అధ్యాయం
చానా సంతోషం నాయనా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బాలసంటి. వయసు 90 ఏళ్ల పైనే. బాలసంటి గ్రామం పేరు బెలుం. ఇది కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లాలో ఉంటుంది. ఇతనికి ఏ వైద్య అవసరం కావాలన్నా ఇంతకు ముందు 70 కిలోమీటర్ల దూరంలోని ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిందే. ఇప్పుడతనికి గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. శనివారం జగనన్న సురక్ష క్యాంపునకు వచ్చిన అతను మాట్లాడుతూ.. ‘‘గతంలో ప్రొద్దుటూరు వెళ్లి కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నా. ఇప్పుడు మళ్లీ కండ్లు సరిగా కనిపిస్తలేవు. బయటకు వెళ్లలేకున్నా, నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టినారని తెలిసినోళ్లు ఇక్కడికి తీసుకొచ్చినారు. అప్పటికప్పుడు అన్ని పరీక్షలు చేసినారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఎక్కడెక్కడో తిరిగే బాధ కూడా తప్పింది. చానా సంతోషం నాయనా’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 620 ఆరోగ్య సురక్ష క్యాంప్‌లు నిర్వహించారు. ఒక్కో క్యాంప్‌లో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు.. మొత్తం నలుగురు వైద్యులు అందుబాటు లో ఉండి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేశారు. 1,45,611 మంది స్వగ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు. అంటే.. ప్రతి క్యాంప్‌లో సగటున 235 ఓపీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం(సెపె్టంబర్ 30) నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని శుక్ర వారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. శనివారం జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్యాంప్‌లను ప్రారంభించారు. మహిళలే అధికం తొలి రోజు ఆరోగ్య సురక్ష క్యాంప్‌లలో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల మంది సేవలు పొందగా వీరిలో 63,257 మంది పురుషులు, 82,354 మంది మహిళలు ఉ న్నారు. మొత్తం వైద్య సేవలు పొందిన వారిలో మెరుగైన వైద్యం అవసరమున్న 5,809 మందిని స్థానికంగా ఉన్న పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు పొందేలా స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతో పెద్ద ఆస్పత్రుల్లోను వీరందరికీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తారు. రూపాయి ఖర్చు లేకుండా క్యాంప్‌లకు వచ్చిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు, మందులను అందించింది. ప్రతి క్యాంప్ లో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామం/పట్టణంలో ఆరోగ్య సు రక్ష క్యాంప్‌పై ప్రజలకు వైద్య సిబ్బంది, వలంటీర్లు అవగాహన కల్పించారు. సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లే పనిలేకుండా జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ వంటి ఇతర స్పెషలిస్ట్ వైద్యులే గ్రామంలో సేవలు అందిస్తున్నారని తెలిసి ప్రజలు శిబిరాలకు తరలి వచ్చారు. క్యాంప్‌ల్లో వైద్య సేవలు పొందిన వారికి వ్యక్తిగత కేస్ షీట్స్‌ను ప్రభు త్వం అందించింది. కేస్ షీట్లో వ్యక్తి పేరు, చిరునామా, వయసు వంటి వివరాలతో పాటు, వైద్యుడు పరిశీలనాంశాలు, సూచించిన మందుల ప్రిస్క్రిప్షన్ నమోదు చేశారు. కేస్ షీట్ ఫోల్డర్, వైద్యుడు సూచించిన మందులతో జగనన్న ఆరోగ్య కిట్‌ను వైద్య శాఖ పంపిణీ చేసింది. వీరిపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంచనున్నారు. ఐదు దశల్లో.. ప్రభుత్వం 5 దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తొలి దశలో వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు హెల్త్ క్యాంప్ నిర్వహించే 15 రోజుల ముందు ఇళ్లన్నింటినీ సందర్శిస్తున్నారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ప్రజలకు ఇంటి వద్దే బీపీ, షుగర్, హెచ్‌బీ, డెంగీ, మలేరియా సహా ఏడు రకాల పరీక్షలు అవసరం మేరకు నిర్వహించి ఫలితాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇక మూడో దశలో క్యాంప్ నిర్వహణకు మూడు రోజుల ముందు వలంటీర్, ప్రజాప్రతినిధులు ఇంటింటిని సందర్శించి హెల్త్ క్యాంప్ జరిగే ప్రదేశం, సమయం ఇతర వివరాలను తెలియజేస్తున్నారు. నాలుగో దశలో క్యాంప్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదో దశలో హెల్త్ క్యాంప్‌లో వైద్య సేవలు పొందిన వారికి, రిఫరెన్స్ మేరకు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారికి తదుపరి వైద్య అవసరాల విషయంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లు చేయిపట్టి నడిపిస్తారు. వృద్ధులకు మేలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వృద్ధులకు ఎంతో ఉపయోగకరం. ఇంటింటికి వచ్చి వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరిస్తున్నారు. గుమ్మం వద్దే వైద్య పరీక్షలు చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చి ఊళ్లోనే వైద్యం చేయిస్తున్నారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఇలాంటి సేవలో మాకు అందేవి కావు. – శివలింగరెడ్డి, చిటిపిరాళ్ల గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణులతో పేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాలు గతంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నేను గతకొద్ది కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాను. ఆసుపత్రికి వెళితే ఎంత ఖర్చు అవుతుందో అన్న భయంతో వెళ్లలేదు. ఈ రోజు వైద్య శిబిరంలో ఈసీజీ తీసి పరీక్షించారు. – కొల్లు అప్పారావు, మర్రిమొక్కవీధి, జగ్గంపేట, కాకినాడ జిల్లా అన్ని పరీక్షలు చేశారు నాకు గత కొంతకాలంగా నడుం నొప్పి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం నాకు సాధ్యం కాదు. మా ప్రాంతానికి 104 వాహనం రావడం, మందులు ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం లభించింది. ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన పెద్ద డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. మందులు ఇచ్చి కొన్ని సూచనలు చేశారు. –పాలిక లక్ష్మి, శెట్టిబలిజపేట, జగ్గంపేట, కాకినాడ జిల్లా పడిపోయి.. నడవలేక.. ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాను. కాలికి గాయమైంది. నడవలేక ఇబ్బంది పడుతున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వెళ్లాను. అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. కాలుని పట్టిపట్టి చూశారు. పెద్దగా భయపడాల్సిన పనిలేదన్నారు. మందులిచ్చి వేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పీహెచ్‌సీకి రమ్మని చెప్పారు. – అప్పలనాయుడు, జమాదులపాలెం, కశింకోట మండలం, అనకాపల్లి జిల్లా -
‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
45 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
-
కలెక్టర్లు అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి: సీఎం జగన్
-
గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములే
-
జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట వరం
-
ఏడు రకాల వైద్య పరీక్షలను ఇళ్ల వద్దనే నిర్వహించనున్న వైద్యులు: సీఎం జగన్
-
ప్రతి ఇంటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సమస్య నయం అయ్యేవరకు తోడుంటాం: సీఎం జగన్