fact check: ఉన్నత విద్యపై ఉన్మాద రాతలు | fact check: Eenadu Ramoji Rao Fake News on AP Higher Education | Sakshi
Sakshi News home page

fact check: ఉన్నత విద్యపై ఉన్మాద రాతలు

Published Tue, Feb 27 2024 3:31 AM | Last Updated on Tue, Feb 27 2024 3:31 AM

fact check: Eenadu Ramoji Rao Fake News on AP Higher Education - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘డబ్బులుండే వాళ్లకే క్వాలిటీ ఎడ్యుకేషన్‌ వస్తుంది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవాలంటే ఏ విధంగా చదువుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. ఎక్కడ చూసినా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత ద్వారానే మంచి విద్యా సంస్థలు వచ్చాయి. కార్పొరేట్లు తమ భుజస్కందాలపై విద్యా సంస్థలను పెట్టుకోవాలి’’.

..ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయా రామోజీ!? స్వయంగా మీ పార్ట్‌నర్, మీ ఆత్మబంధువు చంద్రబాబు నోట జాలు­వారిన ఆణిము­త్యాలు. విభజన ఆంధ్రప్రదేశ్‌­ను ఉద్ధరిస్తా­నంటూ మాయమా­టలు చెప్పి సీఎం సీటుపై కూర్చున్న వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వ విద్య­ను నిర్వీర్యం చేసే కుట్రకు బీజంపడిన రో­జులవి. చంద్రబాబు చెప్పినట్లే తన ఐదేళ్ల పాలనలో ఉన్నత విద్య పేరుతో కార్పొరేట్లకు దోచిపెట్టారు. హాజరు పట్టికలో తప్ప తరగతి గదుల్లో పాఠాలు చెప్పని విద్యా సంస్థలకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని దోచిపెట్టారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అది కూడా సకాలంలో చెల్లించకుండా నానా ఇబ్బందులు పెట్టారు.

ఇదంతా జగమెరిగిన సత్యం. రామోజీ దివ్యదృష్టికి మాత్రం ఇది కనిపించకపోవడంలో ఆశ్చర్యంలేదు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదింటి బిడ్డలను గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంటే పెత్తందారి మనస్తత్వంతో రామోజీ ఆత్మ ఓర్వలేకపోతోంది. నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘ఉన్నత విద్య పేదలకు మిథ్య’ అంటూ సోమవారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో అభూతకల్పనను సృష్టించే ప్రయత్నం చేసి బొక్కబోర్లాపడింది. ఈనాడు కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్‌’ ఏమిటంటే..

ఆరోపణ: పేదలకు కొరకరాని కొయ్యగా ఉన్నత విద్య..
వాస్తవం: చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లు చెల్లిస్తోంది. విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అత్యధికంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఇచ్చింది కేవలం రూ.35 వేలలోపు మాత్రమే. అదే సీఎం జగన్‌ ప్రభుత్వం గరిష్టంగా ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షల వరకు చెల్లిస్తూ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇలా వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లిస్తోంది.

టీడీపీ ఐదేళ్లలో రూ.­12,141 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. చివరికి గద్దె దిగుతూ 2019లో చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు పెట్టిన బకాయి అక్షరాల రూ.1,778 కోట్లు. ఇది కూడా చెల్లించింది సీఎం జగన్‌ ప్రభుత్వమే. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలుకాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. అప్పట్లో కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యా­ర్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌­టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చది­వించాల్సిన దుస్థితి నెలకొంది. అదే ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంటే విద్యార్థులపై ఏ విధంగా భారం పడుతోందో రాజగురువు రామోజీనే చెప్పాలి.

ఆరోపణ: ఉన్నత విద్యలో తగ్గిన జీఈఆర్‌ నిష్పత్తి..
వాస్తవం: రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యలో భాగంగా యూజీ, పీజీ, పీహెచ్‌డీ, సర్టిఫికేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు స్థిరంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో 2017–­18లో 16.97 లక్షలు ఉంటే ఇప్పుడు 2021–­22 నాటికి 19.29 లక్షలకు పెరిగాయి. అంతకుముందు.. ఏడాది కంటే ఇది స్వల్పంగా తగ్గింది. దీనికి కారణం డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు అత్యధికంగా కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడమే. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇంటర్న్‌షిప్, కరిక్యులమ్‌లో విప్లవాత్మక మార్పులతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేస్తున్నారు.

అందుకు చంద్రబాబు హయాంలో గరిష్టంగా 35వేలు క్యాంపస్‌ ఎంపికలు నమోదైతే.. సీఎం జగన్‌ హయాంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీలోనే 60వేలకు పైగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పీజీకి వెళ్లేవారు సహజంగానే తగ్గుతారు. కానీ, ఉద్యోగం చేస్తూ వివిధ రూపాల్లో చాలామంది తమ ఉన్నత విద్యను కొన­సాగిస్తున్నారు. కానీ, కనికట్టు విద్యలో ఆరితేరిన ఈనాడుకు ఇదంతా కనిపించదు.

ఆరోపణ: ప్రభుత్వ కళాశాలలు లేని­చోట పేద విద్యార్థులకు ఇబ్బందులు..
వాస్తవం: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉన్నతస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే మహా యజ్ఞాన్ని సీఎం జగన్‌ తలపెట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశా­లలను బలోపేతం చేస్తూనే.. ప్రైవేటు కళాశా­లల్లో పేదింటి బిడ్డలు చదువు­కునేందుకు వీలుగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. కానీ, ఈనాడు, ఎల్లో మీడి­యా వంటి దుష్ట­శక్తులు అసత్య కథనా­లతో నిత్యం ఈ యజ్ఞంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నా­యి. ఎయిడెడ్‌ కళాశాలల అంగీకారం మేరకే వాటిని ప్రభుత్వం టేకోవర్‌ చేస్తోంది. ఈ ప్రతిపాదనల్లో చాలా ఎయి­డెడ్‌ కళాశా­లలు ప్రైవేటుగా నిర్వ­హించుకునేందుకు ఇష్టపడ్డా­యి. ఇలా 600 మంది టీచింగ్, 800 మందికి పైగా నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని ప్రభు­త్వానికి ఇచ్చేశాయి. వీళ్లందరూ ఆయా ప్రభుత్వ కళాశాలల్లో బోధనలో నిమ­గ్న­­మయ్యారు. అంటే ప్రభుత్వ కళా­శాల­ల్లో టీచింగ్‌ సామర్థ్యం పెరిగినట్లే కదా?

ఆరోపణ: ప్రభుత్వ కళాశాలల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం..
వాస్తవం: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొత్త ఒరవడిలో పయనిస్తు­న్నాయి. గత విద్యా సంవత్సరంలో దాదాపు 18వేల మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు దక్కాయి. ఇది మొత్తం అడ్మిషన్లలో 65 శాతానికి పైగా ఉండటం విశేషం. 2020 నుంచి 15 కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వచ్చాయి. ఐదు ఎయిడెడ్‌ కళాశాలలు ప్రభుత్వంలో విలీనమ­య్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని అరకులో వంద శాతం అడ్మిషన్లు నమోదయ్యాయి. పాడేరులో 99, చింతపల్లిలో 97, గుమ్మలక్ష్మీపురం 92 శాతం ప్రవేశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు 2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే నాక్‌ సర్టిఫికేషన్‌ ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరడం ‘ప్రభుత్వ చదువుల అభివృద్ధికి’ నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో మొత్తం 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఏప్రిల్‌ నాటికి 100 కళాశాలలకు న్యాక్‌ గుర్తింపుతో కొత్త విద్యా సంవత్సరంలోకి విద్యా­ర్థులను ఆహ్వానించనున్నాయి.

ఆరోపణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లడంతో ఆర్థిక భారం..
వాస్తవం: ప్రభుత్వం పూర్తిఫీజు రీయింబర్స్‌­మెంట్‌ ఇవ్వడంతో పాటు జగనన్న వసతి దీవె­న­ను ఎటువంటి పక్షపాతం లేకుండా అందిస్తోంది. గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.­10వేల మధ్య శ్లాబ్‌ పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ, సీఎం జగన్‌ పాలనలో శ్లాబ్‌ విధానాన్ని తొల­గించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఐటీఐ విద్యా­ర్థు­లకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.­15 వే­లు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కో­ర్సు­లు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తు­న్నా­రు.

ఇక్కడ వీలై­నంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కు­టుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.­లక్ష ఉంటే.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాల వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధిచేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. తద్వారా ప్రతిభగల విద్యార్థులు వర్సిటీల్లో ఉచితంగానే పీజీ విద్యను అభ్యసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement