సాక్షి, అమరావతి : అసత్యాలను అక్షరాలుగా పేర్చడంలో ఆరితేరిన రామోజీరావు అనేకానేక అబద్దల కథనాలతో ఈనాడును నింపేస్తున్నారు. రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమలపైనా విషం చిమ్ముతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా, లేని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గతంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి వాటిపై భారం వేశారంటూ పచ్చి అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. నిజానికి మార్ట్‌గేజ్ బాండ్‌కు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో ఎటువంటి మార్పు లేదు. గతంలో ఉన్న ఛార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయినా 25 రెట్లు పెరిగిందని అబద్దాలు ప్రచురించేశారు. ఎక్కడ ఏ పరిశ్రమకు ఎలా పెరిగిందో మాత్రం చూపలేకపోయారు. దాన్నిబట్టే ఈనాడులో అచ్చేసింది పచ్చి అబద్ధమని తేలిపోయింది.
ఆ రెండింటికీ తేడా తెలియదా?
డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకి, మార్ట్‌గేజ్ బాండ్‌కి తేడా తెలియకుండా రామోజీ అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రుణాలు పొందినప్పుడు ఇచ్చే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌కు మాత్రమే వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. మ«ద్య తరహా పరిశ్రమలకు ఎప్పుడూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు లేదు. మధ్యతరహా పరిశ్రమ రూ.5 కోట్లు రుణం తీసుకుంటే దాని మార్ట్‌గేజ్ బాండ్‌కి స్టాంప్ డ్యూటీగా 0.5 శాతం చొప్పున 2.5 లక్షలు చెల్లిస్తున్నారనడం పూర్తి అవాస్తవం.
డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌ని మార్ట్‌గేజ్‌బాండ్‌గా ఊహించుకుని దానికి 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాలనే కాకి లెక్క వేసి ప్రజలను మాయ చేయాలనేది రామోజీ ప్రయత్నం. ఒకవేళ ఏదైనా పరిశ్రమ తీసుకునే ఎన్ని కోట్ల రుణానికైనా డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకు చెల్లించే స్టాంప్ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంపు డ్యూటీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌కు వర్తించదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చట్టం ప్రకారం వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ కడితే సరిపోతుంది. 25 రెట్ల భారం ఎక్కడ వేసినట్లు? ఈ కనీస పరిజ్ఞానం కూడా రామోజీకి లేదు.
వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజలు, పరిశ్రమలకు అనుకూలంగా అనేక మార్పులు జరిగాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో పాటు ఈ–స్టాంపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా గతంలోకంటే సులభంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల సేవలు పొందుతున్నారు. ఇలాంటి అంశాలను తప్పుదోవ పట్టించే క్రమంలో రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలపై రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో బాదేస్తున్నారంటూ ఒక కల్పిత కథనాన్ని ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment