
ప్రభుత్వ పాఠశాల టాపర్‌కు సత్కారం
శ్రీకాకుళం అర్బన్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుత ఫలితాలను సాధించాయని శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 586 మార్కులతో టాపర్‌గా నిలిచిన కృష్ణచైతన్యను ఉపాధ్యాయులతో కలిసి శనివారం అభినందించారు. సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ బోధన అందుతోందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం గోవిందరావు, స్టాఫ్ సెక్రటరీ తేజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.