
ఎన్‌ఆర్‌ఈజీఎస్ రోడ్డు పరిశీలన
పాతపట్నం, మెళియాపుట్టి: మండలంలోని బడ్డుమర్రి, ఏఎస్ కవిటి గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రహదారిని శనివారం నేషనల్ లెవెల్ మానిటరింగ్ సభ్యులు కిరణ్ పాఢి బృందం పరిశీలించింది. రహదారి నాణ్యత, ఉపాధి హామీ పథకం పనితీరు, క్షేత్ర స్థాయిలో వేతనదారు లకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పథకాన్ని పారదర్శంగా అమలు చేయాలని సూచించారు. మెళియాపుట్టి మండలంలోని హడ్డివాడ గ్రామంలో ఉపాధి హామి పధకం ద్వారా చేపట్టిన రహదారి పనులను కూడా పరిశీలించారు. ఐటీడీఏ డీఈఈ బి.శిమ్మయ్య, హిరమండలం, టెక్కలి ఏపీడీలు రాధ, శైలజలు, ఎంపీ డీవో ప్రసాద్ పండా, జేఈలు ప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఓలు సురేష్, రవి, ఈసీలు పాల్గొన్నారు.