శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Apr 27 2025 1:19 AM | Updated on Apr 27 2025 1:19 AM

శ్రీక

శ్రీకాకుళం

ప్రైవేటులో పేదలకు..ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య లభించ నుంది. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. –IIలో

ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మత్స్యకారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

త్స్యకారులైతే సరిపోదు.. టీడీపీ నాయకు లు ఎంపిక చేసి ఉండాలి. జనసేన, బీజేపీ జెండాలు మోస్తే సరిపోదు.. జై టీడీపీ అని ఉండాలి. ఎన్నికల్లో పనిచేస్తే సరిపోదు.. పాస్‌ సంపాదించుకునేంత పలుకుబడి ఉండి తీరాలి. చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా రుజువైన నిజాలివి. ఓ డైరెక్టర్‌ సినిమా ఏ రకంగానైతే షాట్‌ రెడీ అన్నట్టుగా చిత్రీకరిస్తారో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో చంద్రబాబు పర్యటన కూడా అదే రకంగా జరిగింది. ఎక్కడా బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వలేదు. నిలదీసే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగా అప్రమత్తమై పాసులున్న వారికే అనుమతి అని మెలిక పెట్టారు.

నిలదీస్తారనే భయంతోనే..

మత్స్యకారుల వేట విరామ సమయంలో ఇచ్చే భృతిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది ఎగ్గొట్టేసిన విషయం తెలిసిందే. గత ఏడాది వేట భృతి ఇవ్వకుండా ఈ ఏడాదికి సంబంధించి మాత్ర మే ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మత్స్యకారు లు చాలా వరకు ఆవేదనతో ఉన్నారు. గత ఏడాది వేట భృతి సంగతేంటని నిలదీసేందుకు సిద్ధమ య్యారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ముందస్తు గా పసిగట్టినట్టు ఉంది. దానిలో భాగంగా శనివా రం చంద్రబాబు పర్యటనను విస్తృత ఆంక్షల మధ్య నిర్వహించారు. సభా ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆంక్షలు పెట్టారు. అటు కుప్పిలి ఇటు కొచ్చెర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరికైతే పాసులిచ్చారో వారిని మాత్రమే లోపలికి వదిలా రు. పాసులు లేని వారిని వెనక్కి పంపించేశారు. ఇక, 2వేల వరకు పాసులు ఎంపిక చేసిన టీడీపీ సానుభూతి పరులకు మాత్రమే ఇచ్చారు. దీంతో వారు మాత్రమే సభా ప్రాంగణంలోకి వచ్చారు.

సెట్టింగ్‌లతో షూటింగ్‌లా..

షూటింగ్‌ స్పాట్‌ అందరికీ కనిపించేలా సముద్రతీరంలో సెట్టింగ్స్‌ పెట్టి, ఎంపిక చేసిన మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఎంపిక చేసిన వారికి ట్రాన్స్‌మీటర్స్‌ పెట్టి, వారి సమస్యలేంటని అడిగించారు. అక్కడే సిద్ధంగా ఉంచిన ఎండుచేపలను పరిశీలించారు. వారు ఎంపిక చేసిన మహిళలతో చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకుని బోట్లు మరమ్మతులు చేసే వారితో సంభాషించారు. తర్వాత మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్ర జావేదికలో తమకు కావాల్సిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలను వెంట బెట్టుకుని జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎంపిక చేసిన మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారడిగిన ప్రతి దానికి ‘చేసేద్దాం’ అని అక్కడికక్కడే హామీలిచ్చారు. కానీ, ఎప్పటిలోగా చేస్తామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ఇది కూడా బహిరంగ సభ అనేదాని కంటే క్లోజ్డ్‌ మీటింగ్‌ హాల్‌గా చెప్పుకోవాలి. ఎంపిక చేసిన, పాసులిచ్చిన వ్యక్తులకే ప్రాంగణంలోకి ప్రవేశం ఉండటంతో అంతా పథకం ప్రకారం సాగింది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, నిలదీతలకు తావులేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. వాస్తవంగా గత ఏ డాది వేట భృతి ఎగ్గొట్టడంపై ప్రశ్నించేందుకు చాలా మంది మత్స్యకారులు ఎదురు చూసినా వారికెవ్వరికీ లోపలికి ప్రవేశం లేకపోవడంతో అడిగేందుకు అవకాశం లేకుండా పోయింది. బహిరంగ సభ అనుకుని చాలామందిని ఆ పార్టీ నాయకులు తీసుకొచ్చినప్పటికీ స్క్రిప్ట్‌ ప్రకారం పాసులున్న వారికే అనుమతి ఇవ్వడంతో నేతల తరలింపులో వచ్చిన వారు కూడా అసంతృప్తితో వెనుదిరిగారు.

జనసేన, బీజేపీ నేతలకు అవమానం

బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటన సాగినా ఆ పార్టీ నేతలను గౌరవించలేదు. జనసేన నాయకులకు అదే ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. 300మంది టీడీపీ నాయకులకు సరిపడేలా ఏసీ సౌకర్యంతో కూడిన టెంట్‌ ఏర్పాటు చేశారు. అక్కడే మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. కానీ, బీజేపీ, జనసేన నాయకులకు ఏర్పాటు చేసిన టెంట్‌లో అలాంటి సౌకర్యం కల్పించ లేదు. మంచినీటి ప్యాకె ట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో బీజేపీ, జనసేన నాయకులు అసంతృప్తితో వెనుదిరిగారు.

●సువిశాల తీర ప్రాంతం ఉన్న మన జిల్లాలో ఇంత వరకు ఒక్క పోర్టును నిర్మించుకోలేకపోయాము.. చంద్రబాబు ఆశీస్సులతో మూలపేట పోర్టు నిర్మించుకుంటున్నామని వేదికపై చెప్పి వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మించిన మూలపేట పోర్టును కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తమ ఖాతాలో వేసుకున్నారు. జగన్‌ సర్కారు హయాంలో చాలా వరకు నిర్మాణం జరిగిన మూలపేట పోర్టును తాము నిర్మిస్తున్నట్టుగా చెప్పుకోవడం సిగ్గు చేటుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

ఫిష్‌ ఆంధ్రా షాపుల కోసం వెటకారంగా మాట్లాడిన

చంద్రబాబు, అచ్చెన్నాయుడులు.. ఇప్పుడేమో రొయ్యలు మార్కెటింగ్‌ పెంచాలని.. అప్పుడే వ్యాపారులు నష్టాలబారిన పడకుండా ఉంటారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

అధికార దాహంతో

చంద్రబాబు లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి

ఇప్పుడేమో అప్పుల

లెక్కలు

చూపిస్తున్నారు.

జిల్లాపై, మత్స్యకారులపై

ప్రేమాభిమానాలుంటే వైఎస్సార్‌సీపీ హయాంలో శంకుస్థాపన చేసిన పోర్టులన్నీ పూర్తిచేసి వలసల

నివారణకు ముఖ్యమంత్రి

చంద్రబాబు సహకరించాలి.

మత్స్యకారుల్ని ఓటు బ్యాంక్‌గా వాడుకుని

వదిలేస్తామంటే

మత్స్యకారుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం

గురికాక తప్పదు.

జిల్లాలో సీనియర్‌ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడులు జిల్లా అభివృద్ధికి,

మత్స్యకారుల వలసల నివారణకు ఏం చేశారో చెప్పాలి.

ఈ ప్రశ్నలకు జవాబేది

బాబూ..!

శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

30లోపు ఓపెన్‌ స్కూల్‌

పరీక్ష ఫీజు చెల్లించాలి

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌) 2025 మే నెలలో జరగబోయే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తే దీలోపు పరీక్ష పీజు చెల్లించాలని డైరెక్టర్‌ ఓపెన్‌ స్కూల్‌ వారు తెలియజేశారని జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఎస్‌.తిరుమల చైతన్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు ఎస్‌ఎస్‌సీకు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100, ఇంటర్‌ పరీక్ష ఫీజు ఒక్కో సబ్జెక్ట్‌ కు రూ.150 ఈ నెల 30వ తేదీలోపు కట్టాలన్నారు. రూ.50 అపరాధ రుసుంతో మే 4వ తేదీలోగా చెల్లించాలని, తత్కాల్‌ రుసుం కింద సబ్జెక్ట్‌కు రూ.1000 మే 5లోగా చెల్లించాలని డీఈఓ తెలిపారు.

న్యూస్‌రీల్‌

బుడగట్లపాలెం సెట్టింగులో

శ్రీకాకుళం1
1/2

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/2

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement