
మే 20న అఖిలభారత సమ్మె
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మిక హక్కులు కాల రాసే లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మే 20న నిర్వహించనున్న అఖిలభారత సమ్మె జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రిటిష్ కా లం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల ను మోదీ ప్రభుత్వం మార్చివేసిందన్నారు. యజమానులు చేసే నేరపూరిత చర్యలను నేరాలుగా పరిగణించకుండా కార్మికులు చేసే పోరాటాలను, యాజమానులను ప్రశ్నించినా నేరాలుగా పరిగణించేలా యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవ హరించేలా చట్టాలు మారుస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ప్రజల త్యాగాలతో జాతి నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్‌ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచం కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తివంతంగా జరపాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ భారాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, ఎన్.గణపతి, ఎన్‌వీ రమణ, కె.సూరయ్య, ఎం.ఆదినారాయణమూర్తి, హెచ్.ఈశ్వరరావు, బి.ఉత్తర, ఆర్.ప్రకాశ రావు, పి.లతాదేవి, పి.గోపి, ఆర్.సురేష్ బాబు, త్రినాధ్, సుశీల, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.