రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

Published Wed, Apr 30 2025 5:13 AM | Last Updated on Wed, Apr 30 2025 5:13 AM

రోడ్డ

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

చిత్రం ఎచ్చెర్ల నుంచి చిలకపాలెం వెళ్లే దారిలో ఉన్న ఫ్లై ఓవర్‌ సమీపంలోనిది. పారబోసిన వ్యర్థాలు ఏమిటో తెలుసా.. కాలం చెల్లిన సిరప్‌లు. ఇలా ఎక్స్‌పైర్‌ అయిన మందుల్ని ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. ఇలా భూమిలో కలిపేయడం కూడా ప్రమాదమే. కానీ ఇలా మందుల్ని ఇష్టానుసారం పారవేయడం ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారింది.

పొందూరు మండలం రాపాక జంక్షన్‌ నుంచి కృష్ణాపురం వచ్చే మార్గంలోని రహదారి ఇది. చిత్రంలో ఉన్నవేమిటో తెలుసా.. బాయిలర్‌ కోళ్లకు సంబంధించిన వెంట్రుకలు.. ఇతర పౌల్ట్రీ వ్యర్థాలు. అసలే బర్డ్‌ ఫ్లూ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఇలా పౌల్ట్రీ వ్యర్థాలను జాతీయ రహదారి పక్కనే పారవేయడం ఎంత వరకు సమంజసం.

డంపింగ్‌ యార్డులుగా రహదారులు

కుప్పలుతెప్పలుగా వ్యర్థాల పారబోత

రహదారుల వెంబడి దుర్వాసన

అధికారుల చోద్యం

ఇబ్బందుల్లో ప్రజానీకం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

హదారుల పక్కన వ్యర్థాలు డంపింగ్‌ అవుతున్న విషయంపై ‘సాక్షి’కి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నుంచి పొందూరు మండలం రాపాక వరకు 25 కిలోమీటర్ల దూరాన్ని ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పరిశీలనలో భయంకరమైన వ్యర్థాలు ఎలా పారబోస్తున్నారో వెల్లడైంది. పర్యవేక్షణ లేదనే విషయం కూడా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

చీకటి పడితే చాలు..

నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో చీకటి పడితే చాలు. వ్యర్థాల డంపింగ్‌ గుట్టుగా సాగిపోతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు.. మెడికల్‌ వేస్టేజ్‌.. ఫౌల్ట్రీ వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక పాలిథిన్‌ మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడైనా ఫంక్షన్‌ జరిగిందో అంతే సంగతులు.. ఆ ఊరి చివరి గుట్టలుగుట్టలుగా పాలిథిన్‌ వ్యర్థాలు దర్శనమివ్వడం పరిపాటిగా మారిపోయింది.

వందలాది మంది రాకపోకలు..

● ‘సాక్షి’ పరిశీలించిన ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు.. వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు.

● డంపింగ్‌ జరుగుతున్న ప్రదేశాలకు సమీపంలో కళాశాలలు.. వసతి గృహాలు ఉన్నాయి.

● అత్యధిక సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు.

● కూరగాయల విక్రయాలు కూడా వీటికి సమీపంలోనే సాగుతున్నాయి.

● మూగజీవాలు అత్యధికంగా సంచరించే ప్రదేశాలు కూడా ఇందులో ఉన్నాయి.

● ఇవేమీ పట్టనట్టుగా వ్యర్థాలను పారబోస్తూ కొందరు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.

● ఈ అంశంపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● ఈ వ్యర్థాల పారబోతకు అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరుతున్నారు.

ది కూడా పొందూరు మండలం రాపాక జంక్షన్‌ నుంచి కృష్ణాపురం వచ్చే మార్గమే. ఈ చిత్రంలో మూటలా ఉన్నవి ఏమిటో తెలుసా.. సోఫాలకు వినియోగించే లెదర్‌ షీట్‌ ముక్కలు. వీటిని ఇలా మూటలుగా కట్టి డంప్‌ చేస్తున్నారు.

పౌల్ట్రీ వ్యర్థాలతో అనర్థాలు

హైవే పక్కన దాదాపు వెయ్యి వరకు పౌల్ట్రీ ఫారాలు ఉన్నా యి. వీటి వ్యర్థాలను నిర్వీ ర్యం చేసే విషయంలో ఎవరికీ అవగాహన లేదు. వ్యర్థాలను రోడ్డు పక్కనే పడేస్తున్నారు. దీని వల్ల వెంట్రుకలు గాలిలోకి ఎగిరి వాహనదారుల కళ్లలో పడుతున్నాయి. అలాగే సింథటిక్‌, లెదర్‌, ప్లాస్టిక్‌ వంటి వాటిని గొయ్యి తీసి పూడ్చాలి. లేదంటే ప్రమాదకరం. ఎలక్ట్రానిక్‌ వేస్టు వల్ల కూడా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. – కొమ్ము రమణమూర్తి,

డైరెక్టర్‌, స్వీప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ

డంపింగ్‌ పెరిగింది

జనావాసాల్లో విచ్చలవిడిగా చెత్త డంపింగ్‌ పెరుగుతోంది. మనం వినియోగించే వస్తువుల్లో ఎలక్ట్రికల్‌తో పాటు పాలిథిన్‌ వస్తువులు పర్యావరణానికి, ప్రజల జీవన మనుగడకు ఎంతో ప్రమాదకరం. సాగునీటి వనరుల సమీపంలో వ్యర్థాలు వేయడం వలన ఒక వైపు వ్యవసాయంతో పాటు మరో వైపు భూగర్భ జలాలు విష పూరితంగా మారుతున్నాయి. దీనిపై పంచాయతీ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి.

–కె.ధర్మారావు, ప్రజా సంఘాల నాయకుడు, టెక్కలి

అత్యంత ప్రమాదకరంగా పర్యావరణం

చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఊర్లను నదులను స ముద్రాలను చెత్తకుండీలుగా మార్చడం వల్ల నేల, నీరు, గా లి, భూగర్భ జలాలు కలుషితం కావడమే కాక అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. మనం వాడి పడేసే అనేక వ్యర్థ పదార్థాల్లో గంధకం ఒకటి. ఇది వాతావరణంలో సల్ఫర్‌ డైఆకై ్సడ్‌ విడుదల చేస్తుంది. ఇది విష వాయువు. వస్తువులను రీసైకిల్‌ చేసి వాటి నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం అనేది చాలా కీలకం. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. – ఎం.పద్మనాభరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, టెక్కలి

ఈ ప్రాంతమూ రాపాక పరిసరమే. తెల్లగా ఉన్నదేమిటో తెలుసా.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌. భవన నిర్మాణాల్లో సీలింగ్‌ కోసం వినియోగించి ఆ వ్యర్థాలను ఇలా రహదారి పక్కనే పారవేస్తున్నారు.

ఇవి గాజు పెంకులు కాదండోయ్‌. అత్యంత ప్రమాదకరమైన వాయువులుండే టీవీలకు సంబంధించిన పిక్చర్‌ ట్యూబ్‌లు. వీటిని పెద్ద ఎత్తున రాపాక సమీపంలో డంప్‌ చేసేస్తున్నారు. వాటిని పగలకొట్టి మరీ పారేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదకర వాయు వులు పర్యావరణంలో కలుస్తున్నాయి.

చిలకపాలెం నుంచి పొందూరు వెళ్లే రోడ్డు ఇది. చిలకపాలెం గ్రామ సరిహద్దుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధికంగా డంప్‌ అవుతున్నా అడిగే నాథుడే లేడు. చూడండి రోడ్డు పొడ వునా ఎలా స్వాగతం పలుకుతున్నాయో..!

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు1
1/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు2
2/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు3
3/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు4
4/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు5
5/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు6
6/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు7
7/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు8
8/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు9
9/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు10
10/10

రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement