
మార్గాలు..దుర్మార్గాలు
టీడీపీ నేతల భూములకు ఉపాధి నిధులతో రోడ్లు
సరుబుజ్జిలి మండలం దాకరవలస పంచాయతీలోని సూర్యనారాయణపురం రహదారి ఇది. ఏబీ రోడ్డు నుంచి టీడీపీ నాయకుడు అంబల్ల రాంబాబు పొలాల వరకు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు వేసేందుకు మంజూరు చేశారు. ఈ రోడ్డు వేస్తే టీడీపీ నాయకుడికి తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదు. చెరువు గర్భం మీదుగా రోడ్డు ప్రతిపాదించడంతో దిగువ ప్రాంతాలైన నక్కలపేట, పెద వెంకటాపురం, చిన వెంకటాపురం గ్రామాలకు సాగునీటి సమస్య కూడా ఉత్పన్నం కానుంది.
● మెటీరియల్ కాంపోనెంట్ నిధులు
దుర్వినియోగం
● నాయకుల పొలాలు, కొబ్బరి తోటలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సీసీ రోడ్లు
● టీడీపీ నాయకులు చెప్పినట్టుగా
వ్యవహరించిన అధికారులు
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో కొత్తగా వేసిన సీసీ రోడ్డిది. ఇక్కడ అప్పటికే మంచి సీసీ రోడ్డు ఉంది. చెక్కు చెదరలేదు. కానీ, మళ్లీ అదే రోడ్డుపై కొత్తగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్డు వేశారు.
కవిటి మండలం డి.గొనపుట్టుగలో కొత్తగా వేసిన సీసీ రోడ్డిది. ఇక్కడేమి జనసంచారం లేదు. కానీ, కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ తోటల మధ్య సీసీ రోడ్డు వేశారు. భవిష్యత్ లేఅవుట్ వేయాలన్న ఆలోచనలో భాగంగానే వ్యూహాత్మకంగా సీసీ రోడ్డు వేసినట్టు తెలుస్తోంది. రికార్డుల్లో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి హనుమాన్ విగ్రహం వరకు అంటూ శిలాఫలకంపై రాతలు రాశారు. కానీ, సగం వరకు(కొబ్బరి తోటలకు ఉపయోగపడే విధంగా) వేసి వదిలేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం పక్కనున్న పంచాయతీ ఇది.
కవిటి మండలం సీహెచ్ జల్లుపుట్టుగలో వేసి రోడ్డు ఇది. ఇక్కడ కూడా జనసంచారం లేదు. కొబ్బరి తోటలకు విలువ పెరిగేలా వాటి మధ్య వేసిన రోడ్డు ఇది. భవిష్యత్ లేఅవుట్ వేసి లబ్ధి పొందాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగా ముందస్తుగా వేసిన రోడ్డుగా తెలుస్తోంది. మరిడమ్మ గుడి వరకు సీసీ రోడ్డు వేసినట్టు శిలాఫలకంలో రాసినప్పటికీ సగం వరకు మాత్రమే వేశారు.
పొందూరు మండలం బాణాం పంచాయతీ తానేం గ్రామ శివారులో కొత్తగా వేసిన సీసీ రోడ్డు ఇది. వాస్తవానికి, ఈ రోడ్డు వేసిన వైపు ఒక్క ఇళ్లు లేదు. అలాగని మరో గ్రామం లేదు. కేవలం టీడీపీ నాయకుడి రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ఉపయోగపడే విధంగా మాత్రమే రోడ్డు వేశారు. దానికోసం రూ.37లక్షలు ఖర్చు పెట్టారు.

మార్గాలు..దుర్మార్గాలు

మార్గాలు..దుర్మార్గాలు

మార్గాలు..దుర్మార్గాలు

మార్గాలు..దుర్మార్గాలు