
బొంతలకోడూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ఎచ్చెర్ల క్యాంపస్: స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లపై కక్ష సాధిస్తోంది. కారణం లేకుండా తప్పుడు నివేదికలతో చెక్ పవర్ రద్దు చేస్తోంది. తాజాగా బొంతలకోడూరు గ్రామ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో కూటమి నాయకులు వ్య క్తిగత కక్షతో, ప్రజాప్రతినిధులు ఒత్తిడితో చెక్ పవర్ తొలగించారు. ఇటీవల కూటమి నా యకులు గ్రామంలోని మలిపెద్దివాని చెరువు ఆక్రమణలకు ప్రయత్నించారు. సర్పంచ్ అడ్డుకున్నారు. మరోపక్క పంచాయతీలో కూటమి నాయకులకు వేలు పెట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో వీరు చెక్ పవర్ రద్దుకు కారణాలు అన్వేషించారు.
గ్రామానికి రూ. 40 లక్షలు గ్రామ సచివాలయం భవనం మంజూరైంది. ఈ సచివాలయ భవనం కాంట్రాక్టర్‌కు అప్పగించా రు. కాంట్రాక్టర్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణం ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ఇతర నిర్మాణాలు వద్దని హైకోర్టు తీర్పు మేరకు ఈ భవనం పనులు నిలిపివేశారు. ఇంజినీరింగ్ అధికారుల ఎం–బుక్ రికార్డు మేరకు కాంట్రాక్టర్‌కు పంచాయతీ నుంచి రూ.1.80 లక్షలు చెల్లించారు. ఇది సర్పంచ్ విధులు దుర్వినియోగంగా కూటమి నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ వ్యక్తిగత దుర్వినియోగం లేదని, పనికి చెల్లింపు మాత్రమే జరిగిందని ఇంజినీరింగ్ అధికారులు సైతం నివేదిక ఇచ్చారు. పంచాయతీ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చివరికి చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని సర్పంచ్ తెలిపారు.
మృతదేహాలకు పోస్టుమార్టం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గూడేం గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడిన తల్లీకూతుళ్లు మోదు సావిత్రమ్మ, ఈదల వరలక్ష్మీ మృతదేహాలకు సోమవారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సావిత్రమ్మ తల్లి బిలాయి నుంచి గూడేం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.