
వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడిగా
● పార్టీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడిగా కిల్లి సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకునిగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు నియమితులవ్వగా, విజయనగరం పార్లమెంటు పరిశీలకునిగా కిల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు జిల్లా నాయకులందరికీ సుపరిచితులు. మంచి వాగ్ధాటి, సమస్యలపై అవగాహన ఉన్న నాయకునిగా గుర్తింపు ఉంది.
కిల్లికి పెద్ద బాధ్యతలు..
పార్టీలో సీనియర్ నేతగా, రెండు పర్యాయాలు ఎంపీపీగా, సుదీర్ఘకాలం సర్పంచ్‌గా పనిచేసి ఆమదాలవలస నియోజకవర్గ నేతగా గుర్తింపు, అనుభవం ఉన్న కిల్లి సత్యనారాయణను విజయనగరం పార్లమెంటు పరిశీలకునిగా నియమించడం ఆయనకు దక్కిన గౌరవంగా కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న కిల్లి సత్యనారాయణకు ఇప్పుడు పార్లమెంటు పరిశీలకుడు అనే పెద్ద బాధ్యతను వైఎస్ జగన్ అప్పగించారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టి, ఇచ్చి న బాధ్యతను వందశాతం నిర్వర్తించి పార్టీ విజయానికి అహర్నిశలు పనిచేస్తానని చెబుతూనే, తనను గుర్తించిన అధినేతకు కిల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
కుంభా రవిబాబు
కిల్లి సత్యనారాయణ