
శ్రీకాకుళం
గ్రీవెన్స్‌కు 165 వినతులుకలెక్టర్ గ్రీవెన్స్‌కు 165 వినతులు వచ్చాయి. బాధితులు సమస్యలు ఏకరువు పెట్టారు. –8లో
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● రాణిస్తున్న సిక్కోలు నాట్యకారులు
● జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం
బరంపురంలో డిగ్రీ చదువుతున్న మోనాలీదాస్ నృత్య ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. మోనాలీ తల్లి మనోజ్ మంజరీ త్రిపాఠీ ఇ చ్ఛాపురం మండలం తేలుకుంచి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒడియా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి లక్ష్మణదాస్ ఒడిశాలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి వద్దే నృత్యం నేర్చుకున్న మోనాలీ కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీలో ప్రావీణ్యం సంపాదించింది. పలు చానెళ్లలోనూ ప్రదర్శనలు ఇచ్చింది.
ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన మంగి మాధవరావు లారీ డ్రైవర్. తల్లి దాలమ్మ గృహిణి. వీరి కుమార్తె దివ్య పలు రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ప్రదర్శనలు ఇచ్చింది. స్వేచ్ఛా నృత్య తరంగణి నృత్య శిక్షణాలయంలో నృత్యం నేర్చుకున్న దివ్య గిన్నిస్ రికార్డు అందుకున్న సిలికానాంధ్ర కూచి పూడి ప్రదర్శనలోనూ పాల్గొంది. విజయవాడలో జరిగిన పోటీల్లో మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. సుమారు 800 వరకు నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.
న్యూస్‌రీల్
జాతీయ స్థాయిలో రాణిస్తూ..
లారీ డ్రైవర్ కుమార్తె

శ్రీకాకుళం

శ్రీకాకుళం