
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని యూబీ పరిశ్రమ సమీపంలోని శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖపట్నం నుంచి రణస్థలం వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఒక గుర్తు తెలియని వ్యక్తి ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బిచ్చగాడని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్ పురం ఏఏస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
27న జిల్లా స్థాయి
బాస్కెట్ బాల్ ఎంపికలు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ అండర్ –13 బాల బాలికల జట్ల ఎంపికలు 27న జరగనున్నాయని శ్రీకాకుళం జిల్లా బాస్కె ట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 13ఏళ్ల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను చిత్తూరు వేదికగా వచ్చే నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఏపీ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వెల్లడించారు. రేపు జరిగే ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కృష్ణమూర్తి కోరారు. మరిన్ని వివరాలకు డీఎస్‌ఏ బాస్కెట్ బాల్ కోచ్ జి.అర్జున్ రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని ఆయన కోరారు.
పెన్షనర్లలో ఐక్యత అవసరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్ల ఐక్యత అవసరం పెరిగిందని ఐక్యవేదిక సదస్సు నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎన్జీఓ హోమ్ లో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కన్వీనర్ మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వా త గౌరవప్రదమైన జీవితం కోసమే పెన్షన్ విధానం ప్రవేశపెట్టారని, ప్రభుత్వ విధానాలు పెన్షన్ భద్రత ను ప్రశ్నార్థకం చేస్తున్నాయని అన్నారు. ఇటీవల ఓల్డ్ పెన్షన్ స్కీం (ఒ.పి.ఎస్) పెన్షనర్లకు నష్టం కలిగించే రీతిలో ఉద్యోగ విరమణ తేదీ బట్టి విభజన చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం సరికాదన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సి.పి.ఎస్) విధానంలో చెల్లించే పెన్షన్ మొత్తానికి గ్యారెంటీ లేదని, యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యు.పి.ఎస్) విధానంలో అనేక లోపాలున్నాయని తెలిపారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం ఆశాజనకంగా లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థల విశ్రాంత ఉద్యోగుల ఐక్య సదస్సు ఈ నెల 27వ తేదీ (ఆదివారం) ఉద యం 10 గంటలకు జరుగుతుందని జిల్లాలోగల వివిధ సంస్థలలో పని చేసిన పెన్షనర్లు పాల్గొని సద స్సు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డి.పార్వతీశం, కె.సోమ సుందర్‌రావు, ఎంఎస్‌ఆర్‌ఎస్ ప్రకాశరావు, ఎస్.భాస్కర్‌రావు, పి. సుధాకర్‌రావు, వి.చిన్నబాబు పాల్గొన్నారు.