ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్‌మెంట్‌.. | Subhashree Rayaguru Engagement With Actor Ajay Mysore, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Subhashree Rayaguru Engagement: గుడ్‌న్యూస్‌ చెప్పిన శుభశ్రీ.. ప్రియుడితో నిశ్చితార్థం..

Jun 6 2025 10:20 AM | Updated on Jun 6 2025 10:39 AM

Subhashree Rayaguru Engaged with Actor Ajay Mysore

తెలుగు బిగ్‌బాస్‌ 7 సీజన్‌ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్‌ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని క్యాప్షన్‌ జోడించింది.

ఆన్‌స్క్రీన్‌ కపుల్‌.. రియల్‌ లైఫ్‌లోనూ..
ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్‌తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్‌ లైఫ్‌లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్‌ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

చదవండి: అక్కినేని అఖిల్‌ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement