హీరోయిన్ ఛాన్సులు నిల్.. పూజా హెగ్డే షాకింగ్ డెసిషన్! | Actress Pooja Hegde Debut Into OTT With Ajay Gnanamuthu Netflix Movie | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఆ నిర్ణయం తీసుకున్న పూజా హెగ్డే.. మంచిదే కానీ!

Published Mon, Dec 25 2023 12:15 PM | Last Updated on Mon, Dec 25 2023 12:56 PM

Actress Pooja Hegde Debut Into OTT With Ajay Gnanamuthu Netflix Movie - Sakshi

బుట్టబొమ్మ అనగానే చాలామందికి పూజాహెగ్డేనే గుర్తొస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ల ముందు హీరోయిన్‌గా స్టార్ హోదా దక్కించుకుంది. తెలుగుతో పాటు దక్షిణాది, హిందీలో బడా స్టార్ట్స్‌తో మూవీస్ చేసింది. వరస ఫ్లాప్స్ పడేసరికి ఛాన్సుల్లేకుండా పోయాయి. ప్రస్తుతానికైతే ఒక్క హిందీ మూవీ మాత్రమే చేస్తున్నట్లు ఉంది. ఇలాంటి టైంలో యాక్టింగ్ విషయంలో పూజా.. ఓ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)

ముంబయి బ్యూటీ పూజాహెగ్డే.. 'మాస్క్' అనే డబ్బింగ్ మూవీతో కెరీర్ ప్రారంభించింది. 'ముకుంద', 'ఒక లైలా కోసం' తదితర చిత్రాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో తదితర చిత్రాలు ఈమె రేంజుని ఎక్కడితో తీసుకెళ్లిపోయాయి. గతేడాది మాత్రం రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్.. ఇలా వరసపెట్టి ఎదురుదెబ్బలు తగిలేసరికి కుదేలైపోయింది. దీనికి తోడు 'గుంటూరు కారం' నుంచి ఈమెని తప్పించేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవలోనూ ఈమెకి రావాల్సిన అవకాశం చేజారిపోయింది.

జస్ట్ రెండేళ్ల ముందు చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు ఖాళీగా ఉంది. దీంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తమిళ యంగ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు, నెట్‌ఫ్లిక్స్ కోసం తీయబోయే లేడీ ఓరియెంటెడ్ మూవీలో పూజాది మెయిన్ రోల్ అని టాక్. హారర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రంతో ఈమెకి నటిగా మరింత పేరు వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రెగ్యులర్ సినిమాల్లో ఈమెకు ఛాన్సులు తగ్గి, ఓటీటీల్లో పెరగొచ్చు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే క్లారిటీరావాలి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement