'రాజాసాబ్' మారుతి.. ఏకంగా ఆరు కథలు! | Rajasaab Movie Director Maruthi New Updates | Sakshi

Director Maruthi: 'రాజాసాబ్' తర్వాత ఏంటి? మారుతి ప్లాన్ ఇదా!

Jun 17 2025 3:46 PM | Updated on Jun 17 2025 4:07 PM

Rajasaab Movie Director Maruthi New Updates

'రాజాసాబ్' టీజర్‌కి అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొన్నాళ్ల ముందు వరకు డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఎందుకు సినిమా చేస్తున్నాడా అని తిట్టుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు టీజర్ చూసి మెచ్చుకుంటున్నారు. పర్లేదు మూవీ డీసెంట్‌గానే ఉండొచ్చు, హిట్ కొట్టబోతున్నాం అని మురిసిపోతున్నారు. అయితే డైరెక్టర్ మారుతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది.

స్వతహాగా ఆర్టిస్ట్ అయిన మారుతి.. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' సినిమాలతో దర్శకుడిగా మారాడు. ఈ రెండింటిలోనే బూతు డైలాగ్స్ ఉండేసరికి ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీని నుంచి బయటపడేందుకు నానితో 'భలే భలే మగాడివోయ్' సినిమా తీశాడు. తనపై ఉన్న బూతు ముద్రని చెరిపేసుకున్నాడు. తర్వాత నుంచి కామెడీ ఎంటర్‌టైనర్స్ తీస్తున్నాడు. గతంలో 'ప్రేమకథా చిత్రమ్'తో హారర్ కామెడీ ట్రెండ్ సెట్ చేసిన మారుతి.. ఇప్పుడు 'రాజాసాబ్'తో హారర్ ఫాంటసీ స్టోరీతో రాబోతున్నాడు.

(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)

సరే అసలు విషయానికొస్తే.. మారుతిలో దర్శకుడితో పాటు మంచి రైటర్ కూడా ఉన్నాడు. గతంలో తన కథలతో పలువురు దర్శకుల్ని పరిచయం కూడా చేశాడు. ఇప్పుడు 'రాజాసాబ్' తర్వాత కూడా అలానే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత మరో కొత్త మూవీ చేయడానికి చాలా టైమ్ పట్టొచ్చు. కానీ అంతలో తన దగ్గరున్న ఆరు స్టోరీల్ని టాలీవుడ్‌లోనూ పలువురు యంగ్ డైరెక్టర్స్‌కి ఇవ్వాలని ఫిక్సయ్యాడట. త్వరలో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి.

ఇక 'రాజాసాబ్' సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన మారుతి.. చూచాయిగా ఉండకపోవచ్చని అన్నాడు. డిసెంబరులో రాబోయే సినిమా హిట్ అయిన దానిబట్టి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పుకొచ్చాడు. మారుతి కామెంట్స్ బట్టి చూస్తే సెకండ్ పార్ట్ ఉండదు. డిసెంబరు 5న 'రాజాసాబ్' థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికీ ఇంకాస్త వర్క్ బ్యాలెన్స్ ఉంది. రిలీజ్‌కి ఇంకా చాలా సమయముంది కాబట్టి అంతలో పూర్తి చేసి చెప్పిన టైంకి రావొచ్చు. లేదంటే మాత్రం మళ్లీ డేట్ మారడం పక్కా.

(ఇదీ చదవండి: సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement