
పీజీపీ క్లాస్–2024, డాక్టోరల్ ఎఫ్‌పీఎం,
ఈఎఫ్‌పీఎం విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్
ఐఎస్‌బీ క్యాంపస్‌లో కోలాహలం
రాయదుర్గం: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ) క్లాస్–2024, డాక్టోరల్ ప్రోగ్రామ్ ఫెల్లో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం), ఎగ్జిక్యూటివ్ ఫెల్లో ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఈఎఫ్‌పీఎం) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 617 మంది విద్యార్థులు, వారిలో 593 మంది పీజీపీ క్లాస్–2024, 19 మంది ఈఎఫ్‌పీఎం విద్యార్థులకు, ఐదుగురు ఎఫ్‌పీఎం విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెబీ చైర్మన్ మధబి పూరి బుచ్ హాజరయ్యారు. ఐఎస్‌బీ చైర్మన్ హరీష్ మన్వాని, పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, డీన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రదానం చేశారు.
అంకితభావం, నిబద్దత ప్రశంసనీయం : సెబీ చైర్మన్ మధబిపూరిబుచ్
నేటి తరం విద్యార్థుల అంకిత భావం, నిబద్దత ప్రశంసనీయమని సెబి చైర్మన్ మధబిపూరిబుచ్ అన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచ చిన్నదిగా భావించినప్పుడు సమృద్ధిగా అవకాశాలను అందిస్తూ కాలం వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తుందన్నారు. పని–జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ, కార్పొరేట్, ప్రభుత్వ పాత్రలను అన్వేషించడానికి, బ్యాలెన్స్ చేయడానికి అనేక రకాల కెరీర్ ఎంపికలు ఉన్నాయన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమయాన్ని వెచ్చించాలని సూచించారు. ఇటీవలే యువతిని కలిశానని ఆమె పలు దేశాల్లో 32 స్టార్టప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్య పోయానన్నారు. ఐఎస్‌బీ చైర్మన్ హరీష్ మన్వాని మాట్లాడుతూ ఐఎస్‌బీలో చదివినవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో గ్రాడ్యుయేషన్ డే ఎంతో విలువైనదని, భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుందని భావిస్తూ ముందుకు సాగే రోజు వచ్చిందన్నారు. కార్యక్రమంలో పలువురు ఐఎస్‌బీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబసభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు

బెలూన్‌లతో విద్యార్థులు

మాట్లాడుతున్న సెబీ చైర్మన్ మధబిపూరిబుచ్
Comments
Please login to add a commentAdd a comment