నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్‌: మెరీనా | Marina Abraham Sets Rules For Daughter’s Safety, Requests Fans Respect Boundaries, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Marina Abraham: నా బిడ్డకు ఎవరూ చాక్లెట్స్‌ ఇవ్వొద్దు, ముద్దు చేయొద్దు.. తనకేదైనా అయితే..!

Mar 29 2026 8:51 AM | Updated on Mar 29 2026 11:36 AM

Bigg Boss Marina Abraham Set Boundaries for Her Daughter

నటి, బిగ్‌బాస్‌ ఫేం మెరీనా అబ్రహం గతేడాది తల్లిగా ప్రమోషన్‌ పొందింది. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్‌ కావడంతో మెరీనా- రోహిత్‌ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో పాపకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. అయితే తన బిడ్డపై ప్రేమను కురిపించడం వరకు ఓకే కానీ అతిగా ముద్దు చేయడం నచ్చడం లేదంటోంది మెరీనా. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్‌ చేసింది.

ఇదంతా డ్రామా కాదు
నా పాప కోసం నేను కొన్ని హద్దులు గీసుకున్నాను, దయచేసి వాటిని గౌరవిస్తారనుకుంటున్నాను. తనకు చాక్లెట్లు ఇవ్వొద్దని చెప్పానంటే ఎవరూ ఇవ్వడానికి వీల్లేదు. నా పాపను ముద్దు పెట్టుకోకండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఇదంతా డ్రామా కాదు, యాటిట్యూడ్‌ అంతకన్నా కాదు.. ఇది పిల్లల్ని పెంచే పద్ధతి. ఏదో ఒకసారి అలా చేస్తే ఏమవుతుంది? అందులో అంత ప్రమాదకరం ఏముందని మీరు అనుకోవచ్చు. .

నేనొకటే చెప్తున్నా..
మీరంతవరకే ఆలోచించారు. కానీ నేను దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. తను అనారోగ్యానికి గురైతే బెంగపడేది నేను.. జాగ్రత్తగా చూసుకునేది నేను. కాబట్టి నేనొకటే చెప్తున్నా.. నా బిడ్డను మీరంతగా ఇష్టపడితే, నా మాటల్ని గౌరవించండి, నాకు సహకరించండి, నేను పెట్టిన రూల్స్‌ను అతిక్రమించకండి. నా బిడ్డ రక్షణే నాకు అన్నింటికన్నా ముఖ్యం అని రాసుకొచ్చింది.

ఎందుకు భయం?
పెద్దలు చిన్నపిల్లలకు ప్రేమతో ముద్దుపెడతారు. కొన్నిసార్లు అది ఇన్‌ఫెక్షన్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు తినే చిరుతిండి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మెరీనా.. తన కూతురికి అటువంటివి అలవాటు చేయొద్దని కోరుతోంది. మెరీనా- రోహిత్‌ ఇద్దరూ తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో జంటగా పాల్గొన్నారు.

చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement