
హమరేశ్, ప్రార్థనా సందీప్ జంటగా ఆడుగలం మురుగదాస్, సాయి శ్రీ, అక్షయ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం ‘రంగోలి’. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‘సత్య’పేరుతో శివమ్ మీడియాపై శివ మల్లాల తెలుగులో ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలోని ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసి.. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. తను నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి సినిమా పాటను కాజల్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు శివ మల్లాల.
ఇక పాట విషయానికొస్తే.. ‘నిజమా ప్రాణమా’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి రాంబాబు గోసాల అద్భుతమైన లిరిక్స్ అందించారు. సుందరమూర్తి కేఎస్ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. . వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన విధానం ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం తన ప్రతిభని కనపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment