ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్‌ ఇండియా హీరో అయ్యాడు! | Vijay Devarakonda Birthday Special: Hero Cinema Journey | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Birthday Special: అతడి కాన్ఫిడెన్స్‌ చూసి ఇండస్ట్రీయే షాకైంది!

Published Wed, May 8 2024 5:19 PM | Last Updated on Thu, May 9 2024 10:39 AM

Vijay Devarakonda Birthday Special: Hero Cinema Journey

నువ్వు హీరోవా.. అని చీత్కారాలు పొందిన దగ్గరే నువ్వే అసలైన హీరో అని చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే మజానే వేరు! హీరో విజయ్‌ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు తన సినిమా రిలీజ్ చేయడానికి అష్టకష్టాలు, అవమానాలు పడ్డ విజయ్‌.. ఇవాళ తన సినిమాలను గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేసే స్థాయికి ఎదిగాడు. 

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి మనసులు గెలుచుకున్నాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్లకు రోల్ మోడల్ అయ్యాడు విజయ్. నేడు (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూసేద్దాం..

విజయ్ కాన్ఫిడెన్స్
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.

స్టార్‌గా ఎదగడమే కాదు
టాక్సీవాలాతో కాస్త డీలా పడ్డా.. గీత గోవిందం ఆయన కెరీర్‌లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. సినిమా మీద ప్యాషన్, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్‌గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా సమయంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా ఇతరత్రా సాయం చేశాడు.

దేవరశాంట
యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తాడు. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకున్నాడు.

చదవండి: వైరల్‌ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement