మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణం చేశారు. మంగళవారం క్రెమ్లిన్ ప్రాసాదంలో 2,500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి, విజయాలను అందుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్రెమ్లిన్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్‌ను తిలకించారు. దగ్గర్లోని అనన్షియేషన్ కేథడ్రల్‌లో రష్యన్ ఆర్థోడాక్స్ పాటియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. ఆరేళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment