#MemanthaSiddham: ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ రెండో రోజు అప్‌ డేట్స్‌..

CM YS Jagan Memanta Siddham Bus Yatra In Nandyala Live Updates - Sakshi

ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం

నేడు నంద్యాలలో సాయంత్రం సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ

నిన్న ఇడుపులపాయలో మొదలై.. కడప పార్లమెంట్‌ పరిధిలో సాగిన యాత్ర

అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన అభిమాన గణం

ప్రొద్దుటూరు బహిరంగ సభకు పోటెత్తిన జనం

#MemanthaSiddham Day-2 Live Updates..

05:55PM, March 28, 2024

నంద్యాల భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌

నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది

  • జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోంది
  • నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు
  • మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు
  • వారిని అడ్డుకేనేందుకు ప్రజలంతా సిద్ధం
  • సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి
  • ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు,బిజేపీ
  • వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది
  • పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి
  • 175 ఎమ్మెల్యే,25 ఎంపీ స్ధానాలు గెలిచి డబుల్ సెంచరీ కొడదాం
  • గతంలో చంద్రబాబు అబద్ధాలు చూశాం..మోసాలు చూశాం
  • వైఎస్సార్‌సీపీ ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి
  • ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లు కూడా ఓసారి ఆలోచించాలి
  • వైఎస్సార్‌సీపీ ఐదేళ్లపాలనపై అందిరితో చర్చించండి
  • ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి
  • మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి
  • ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి
  • లంచాలు, వివక్షలేని సంక్షేమ పాలన అందించాం
  • ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు
  • గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూల్స్ ఏర్పాటు చేశాం
  • పౌర సేవలతో పాటు ప్రతి గ్రామంలో మహిళా కానిస్టేబుల్
  • ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి
  • 58 నెలల్లో ప్రతి ఇంటి తలుపుతట్టి సంక్షేమం అందించాం
  • పిల్లల చదువుల గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేదు
  • నాడు నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చాం
  • ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం
  • 3వేల ప్రొసీజర్స్ చేర్చి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం
  • రాష్ట్రంలో 10,600 విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటు చేశాం
  • రైతులకోసం 10,700 ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు
  • చంద్రబాబు మూసేసిన డెయిరీలను తెరిపించి పాడిరైతులను ఆదుకున్నాం
  • పేదల గుండెల్లో నాకు చోటు దక్కింది..అదే నాకు బహుమతి
  • పేదల బతుకుల్లో మార్పు కోసమే నా ఆరాటం
  • చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు
  • బాబు పేరు చెబితే బషీర్ బాగ్ కాల్పులు,కరువు కాటకాలు గుర్తొ్స్తాయి
  • 2014లో చంద్రబాబు రంగురంగుల హామీల ఇచ్చారు
  • సూపర్ సిక్స్ అంటూ మళ్లీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారు
  • రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణమాఫీ ఒక్కరూపాయి కూడా చేయలేదు
  • ఆడబిడ్డ పుడితే రూ.24 వేలు ఇస్తామన్నారు..ఒక్క రూపాయి అయినా ఇచ్చారా
  • ప్రజలు యుద్దానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది

5:45PM, March 28, 2024

నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ

  • నా దమ్ము, ధైర్యం సీఎం జగనే: శిల్పా రవిచంద్రారెడ్డి
  • మనందరి వెనుక సీఎం జగన్‌ ఉన్నారు
  • సీఎం జగన్‌ పాలనలోనే అభివృద్ధి సాధ్యమైంది

నంద్యాల చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

  • కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌
  • జనసంద్రంగా మారిన నంద్యాల


ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులకు సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదం

మేము సిద్దం రోడ్ షోలో తనను చూసేందుకు వచ్చిన అవ్వను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్‌

దీబగుంట్లకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర.

  • దీబగుంట్లలో సీఎం జగన్‌ ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • భారీగా తరలివచ్చిన జనం. 

యర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్‌ ముఖాముఖి..
యర్రగుంట్లలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

  • యర్రగుంట్లలో వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారు. 
  • యర్రగుంట్ల పరిధిలో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి జరిగింది.  
  • ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం. 
  • ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 
  • ఎర్రగుంట్లలో 1391 ఇళ్లకు 48.74కోట్లు అందించాం. 
  • అమ్మ ఒడి కింద 1043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది. 
  •  వైఎస్సార్‌ ఆసరా ద్వారా మూడు కోట్ల పైగా లబ్ధి చేకూరింది. 
  • ఆరోగ్యశ్రీ కింద రెండు కోట్లకుపైగా లబ్ధి చేకూరింది. 
  • చేదోడు కింద 31,20,000 లక్షలు లబ్ధి జరిగింది. 
  • వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇది. 
  • 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదు?. 
  • ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి. 
  • మొట్టమొదటి సారిగా స్కూల్స్‌ బాగుపడ్డాయి. 
  • ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వైద్యం అందిస్తున్నారు. 
  • మీ బిడ్డ హయాంలోనే రైతన్నకు పెట్టుబడి సాయం అందించే మార్పు జరిగింది. 
  • మార్పు ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి. 

కార్యక్రమంలో వికలాంగుడైన లబ్దిదారుడు ప్రసాద్‌ మాట్లాడుతూ.. నేను, నా భార్య వికలాంగులం. మాకు పెన్షన్‌ ఆరు వేలు వస్తోంది. జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేం. సీఎం జగన్‌ గొంతులా మిమిక్రీ చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. 

మరో లబ్ధిదారుడు మాట్లాడుతూ.. తన కుమారుడికి ఆరోగ్య శ్రీ కింద ఎంతో మేలు జరిగింది. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేయాల్సిన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగింది. దీంతో, నా కుమారుడు మీ దయతో ఆరోగ్యంగా ఉన్నాడు. దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎం జగన్‌ అని కితాబు. 

ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. మీకు ఈరోజు రెండు విషయాలు చెబుతాను. సీఎం వైయస్ జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వస్తే రైతు భరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ మద్దతు చూరగొని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా ప్రతి ఒక్క హామీని ఎలాంటి దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా మీకే అందించారు.

గత ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందివ్వకపోగా దాదాపు 650 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం ఒకటే చెబుతున్నాం మాకు అధికారం ఇస్తే మీ గ్రామాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత అందిస్తామని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తామని కోరుతుంటే ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో గమనించండి.  ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన చేయాలి.

ఇంకొకడు..మేం అధికారంలోకి వస్తే మీరు గుడుల్లో, బడుల్లో దాచి పెట్టుకోవాలి అంటాడు. మేం కూడా ఆళ్లగడ్డ వాళ్లమే, గుడుల్లో, బడుల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు కలలు మానుకోండి. అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎగిరేది వైఎస్సార్ కాంగ్రెస్ జెండా. 2019లో మీరు మంచి మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మీకు పెద్దఎత్తున సంక్షేమం చేసే అవకాశం దొరికింది. కాబట్టి రానున్న రోజుల్లో మీకు, మీ కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుతున్నాను.

వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో, పాదయాత్రలో మన నుంచి విన్నారు దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్లీ వినడానికి వచ్చారు.

పేదల కోసం పెత్తందారులందరితో యుద్ధం చేస్తున్నారు. ఈరోజు మన అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు ఒక సమయం వచ్చింది. సిద్ధమేనా మన అందరం.

యర్రగుంట్లలో సీఎం జగన్‌. 

ఎ‍ర్రగుంట్లకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

కాసేపట్లో సీఎం జగన్‌ ముఖాముఖి
కాసేపట్లో ఎర్రగుంట్లలో మేధావులు, ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి
ప్రజల నుంచి తన పాలనపై ఫీడ్‌బ్యాక్‌తో పాటు మరింత మెరుగుపర్చుకునేందుకు సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు 

అంబులెన్స్‌కు దారిచ్చి ప్రాణం కాపాడిన సీఎం జగన్‌..

బత్తులూరు సమీపంలో మేమంతా సిద్ధం యాత్ర
సీఎం జగన్‌ కోసం బత్తులూరు ప్రజల ఎదురు చూపులు

► నల్లగట్టు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర 

  • మేమంతా సిద్ధం యాత్ర.. సీఎం జగన్‌ బస్సు యాత్రకు పూలు చల్లి స్వాగతం పలికిన గ్రామస్తులు
  • పార్టీ శ్రేణులకు, అభిమాన ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్‌

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతున్న బస్సు యాత్ర

ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర  ప్రారంభమైంది. 

మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైట్‌ హాల్ట్‌ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

ఇది కూడా చదవండి: మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం జగన్‌

అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సే­నా­పురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేక­మవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.  

ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్‌ కామెంట్స్‌..
విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్‌సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది.  

పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్‌ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్‌ గుర్తుపై రెండు మార్లు బటన్‌ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం. 

ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్‌ క్యాంపెయినర్‌గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్‌పై వచ్చి టీ గ్లాస్‌ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే.  

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top