Top Stories
ప్రధాన వార్తలు

HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజాగా మరోసారి ఉద్ఘాటించింది.

SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌ను ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. అదే జోరును కొనసాగించలేకపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన కమిన్స్ బృందం.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన రైజర్స్.. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో గురువారం తలపడనున్న సన్‌రైజర్స్.. గత సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొన్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఇదే. మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్.. ఇప్పటి వరకు సంయుక్తంగా 18 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 217 పరుగులు ఇచ్చుకున్నారు.దీనిని బట్టి ప్రత్యర్థి బ్యాటర్లు వీరిద్దరి బౌలింగ్‌లో ఎంతలా చితక్కొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. షమీ, కమిన్స్ బౌలింగ్ మెరుగుపడితేనే సన్‌రైజర్స్ పరిస్థితి బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అదే విధంగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ‘‘జట్టులో ఒక స్పిన్నర్‌కే ఛాన్స్ ఇస్తారనిపిస్తోంది. సిమర్జీత్ పునరాగమనం చేస్తాడు.అయితే, గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జీషన్ అన్సారీని మాత్రం తుదిజట్టు నుంచి పక్కనపెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో సిమర్జీత్ ఆడొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.గత మ్యాచ్‌లో (ఢిల్లీ క్యాపిటల్స్) సన్‌రైజర్స్ తుదిజట్టు ఇదేట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.కేకేఆర్దీ అదే పరిస్థితిఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా పరిస్థితి కూడా రైజర్స్ కంటే భిన్నంగా ఏమీలేదు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏడు వికెట్ల తేడాతో రహానే సేన ఓటమి పాలైంది. అనంతరం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో గెలిచిన కేకేఆర్.. అదే జోరును కొనసాగించలేకపోయింది. చివరగా ముంబై ఇండియన్స్‌తో తలపడి ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పుడు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలుTrust the process 🔄💪#PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/pvVEwjV95c— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025

పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
నామినీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) చందాదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.పీపీఎఫ్ ఖాతాలకు నామినీ పేర్లను మార్చడానికి ఆర్ధిక సంస్థలు రూ.50 వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చార్జీలను తొలగించడానికే జీవో తీసుకురావడం జరిగింది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులు, భద్రతా లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వరకు నామినీలు ఉండవచ్చు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!నామినేషన్ కోసం ఫారం-10 ని దాఖలు చేయడం ద్వారా మీరు మీ పీపీఎఫ్ ఖాతాలోని నామినీ వివరాలను మార్చవచ్చు. దీన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాదారులు వివరాలను నవీకరించడానికి అనుమతిస్తాయి.Recently was informed that a fee was being levied by financial institutions for updating/modifying nominee details in PPF accounts. Necessary changes are now made in the Government Savings Promotion General Rules 2018 via Gazette Notification 02/4/25 to remove any charges on… pic.twitter.com/Hi33SbLN4E— Nirmala Sitharaman (@nsitharaman) April 3, 2025

హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం ఎడతెరిపి ఇవ్వకుండా దంచికొడుతోంది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఉక్కపోత నుంచి ఊరట పొందుతున్నప్పటికీ.. అకాల వర్షంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా.. సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్‌లోనూ కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీశైలంలోనూ నాన్ స్టాప్‌గా వానపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌లో పిడుగు ధాటికి ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే క్యుములో నింబస్ కారణంగా.. ఉత్తర తెలంగాణకు వడగండ్లు, ఉరుములు మెరుపులతోనూ వానలు పడొచ్చని హెచ్చరిస్తోంది. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సూచనలు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనట్లు తెలుస్తోంది.

నాన్నా.. అమ్మ ఎక్కడ?.. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తండ్రి
విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానికఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.

కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు ‘2029 నాటికి జీరో పావర్టీ’ అంటే మరో నాలుగేళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్న మాట. ఇందుకోసం ఆయన పీ-4 అనే విధానాన్ని తెస్తారట. దీని ప్రకారం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ధనికులు పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా? కాదా? ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వ్యయం చేయాలి? అన్నది పక్కనబెడితే, ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగి పోవాల్సిందే.ఇలాంటి దత్తత కార్యక్రమాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు దానధర్మాలు చేస్తుంటారు. మరి కొందరు తమకు తెలిసిన పేదల కుటుంబాలలోని పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరు అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. దీనికి పీ-4 అని పేరు తగిలించి, వీటన్నింటినీ తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్రలేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది.పీ-4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు, అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులు అవుతారు అనుకున్న వారూ లేకపోలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు రూ.900 కోట్లు అని ఏడీఆర్ ప్రకటించింది. దాంట్లో కొంత ఉంచుకుని మిగిలింది పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైఎస్సార్సీపీ నేతలు ఎత్తి పొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలిచ్చి స్థితిమంతులుగా చేస్తారేమో అని కొందరు విశ్లేషకులు ఊహించారు. అవేమీ జరగలేదు.టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సరిపెట్టారు. అది కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకే కదా!. ఎంతమంది పేదలను ఆ ట్రస్టు ద్వారా కోటీశ్వరులను చేశామని చెప్పగలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ పీ-4 కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న మరో మోసం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య ఎనిమిది లక్షలుగా ఉందని, 90 శాతం మంది వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఇవేవి తెలియకుండా చంద్రబాబు ప్రజలను తన సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెఘా సంస్థ అధినేత పీవీ.కృష్ణారెడ్డి పీ-4 సభా వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని మరికొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఒక విద్యార్ధికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను లాక్కున్నారని ఒక అబద్దం చెబుతూ, తమ ప్రభుత్వంలో ప్రజలకు వాటాలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజంగా స్వచ్చందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్‌లతో సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా తమ ఆస్తులలో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో!. కానీ, వారెవరూ ఆ పని చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ పేదలకు వాటాలు ఇస్తున్నామని సినిమా డైలాగులు చెప్పారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అమెరికా ప్రముఖులు తమ ఆదాయంలో కొంత వాటాను విరాళాలుగా ఇచ్చేస్తుంటారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే మరో విద్యార్ధిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికలలో ఈయన వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు.వైఎస్ జగన్ పాలన సమయంలో గ్రీన్ కో కంపెనీకి భూమి కేటాయించి, విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో తెలిసిందే. వైఎస్సార్సీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్ధిని మెడికల్ సీట్ ను ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదలుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే, కూటమి సర్కార్ వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది. ఇది కూడా పీ-4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేటు కాలేజీలో చదివించాల్సి వస్తే ఆ విద్యార్ధినికి దాత రెండో, మూడో కోట్ల రూపాయల డొనేషన్ కట్టడానికి సిద్దపడతారా? అన్నది ఒక డౌటు. చంద్రబాబు నాయుడు ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త డైలాగు తెరపైకి తెస్తుంటారు. తద్వారా అంతకుముందు తాను చెప్పిన డైలాగుల్ని జనం మర్చిపోయేలా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఎటూ ఆయన భాజ భజంత్రీలు వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ పీ-4ను వీరంతా కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడెన్‌గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. లేకుంటే 2029 నాటికి జీరో పావర్టీగా ఉండాలని చంద్రబాబు చెబితే అది అయ్యే పనో, కాదో అందరికీ తెలుసు.నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. ఆయన 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, వేలాది మంది ఉద్యోగులను ఊడపీకడం చేశారు. రైతులు విద్యుత్ భారంతో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానిపై పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైమ్ లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దానిని చంద్రబాబు హేళన చేసి మాట్లాడే వారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇస్తానని కబుర్లు చెప్పేవారు. కానీ, ఆ సంస్కరణల వల్ల పేద, మద్య తరగతి వారికి ఒరిగిందీ లేదు. చంద్రబాబు వారికి సాయం చేసింది లేదు.2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించి చూపించారు. ఎన్టీ రామారావు పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటిని మార్చేశారు. అధికారం లేనప్పుడు, ఎన్నికల ప్రచారాలలో మాత్రం పేదలకు అవి చేస్తా, ఇవి చేస్తానని చెబుతూంటారు ఈయన. వీటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే. 2014లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా వందల హామీలు ఇచ్చిన బాబు పవర్ లోకి వచ్చాక అరకొరగా అమలు చేసి రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలైతే రద్దే చేయలేదు.తాజాగా 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం హోరెత్తించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు ఇలా పలు హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తరువాత మాత్రం బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోందని హామీలకు మంగళం పాడేశారు. అప్పులు చేసి సంక్షేమం చేయలేమని ఒకసారి, తాను ఎన్నికలకు ముందు ఒకరకంగా అనుకున్నానని, ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఇంకోసారి చెప్పడం ఆరంభించారు. అంటే చిత్తశుద్ది లేకుండా కేవలం అధికారమే ఏకైక లక్ష్యంగా ఏ అబద్దాన్ని అయినా ఆడవచ్చన్నది ఆయన నమ్ముతున్నారన్నమాట.ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే దానికి ప్రతిగా పీ-4 అమలు చేస్తున్నాం కదా! అని దబాయిస్తారు. ఎవరినైనా ధనికుడిని మీరే వెతుక్కోండి అని పేదలకు చెప్పినా చెప్పవచ్చేమో. పేదల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి. పీ-4 తెచ్చాం కదా! ప్రైవేటు స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో!. గతంలో విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు అన్నారు. వలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారి సేవలను కంటిన్యూ చేస్తామని, వేతనం రూ.10వేలు చేస్తామని ఉగాది పర్వదినం రోజున ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసి వేశారు. ఈసారి ఉగాది నాడు కొత్తగా పీ-4 అన్న నాటకంలో మొదటి అంకం ప్రారంభించారు. ఇందులో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో చెప్పజాలం.ఉగాది కల్లా మహిళలకు ప్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రామ్ ప్రసాదరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది వెళ్లిపోయింది. ప్రస్తుతం బస్‌లలో ప్రయాణించే వారిలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వారేనన్న సంగతి తెలిసిందే. నిజంగానే వీరికి చెప్పిన హామీలు అమలు చేయాలన్న నిజాయితీ ఉంటే, పేదలకు ఉపకరించే ఈ స్కీములను ఈ ఏడాదంతా ఎగవేసి, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తారా?.మరో సంగతి చెప్పాలి.. చంద్రబాబు 2014 టర్మ్‌లో ఐదేళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, అదే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా నిరుపేదల శాతం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. వైఎస్ జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే చంద్రబాబు కూటమి మాత్రం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికి తిలోదకాలు ఇచ్చేసింది. అమరావతిలో వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ యాభై వేల మంది పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటోంది. దీనిని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది.చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి. ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండని ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఏతావాతా పీ-4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగు ముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథా ప్రకారం ఆ పేద, బడుగు వర్గాలను అవమానిస్తూ వారిని తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ పీ-4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ ఆర్యమ వాదించారు.దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీఎం కొంత మేర సంయమనం పాటించాలి. గతంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది. మేము సంయమనం పాటిస్తున్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి. అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తాం.. .. గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత నియంత్రణ పాటించాలి కదా?. ఆ సమయంలో మేము చర్యలు తీసుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేతలు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితిని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి?..’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. రేవంత్ ఏమన్నారంటే..మార్చి 26వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025

ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ సుందరం అన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
సోషల్ మీడియాలో పుణ్యమా అని క్షణాల్లో వైరల్ అయిపోతున్నారు. సరైన సామర్థ్యం ఉండాలేగానే డిజిటల్ మాద్యమంతో అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. డిజిటల్ ఎరా పవర్ అలాంటిది మరి. కన్నుమూసి తెరిచే లోపే వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా సూపర్స్టార్లుగా మారిపోతున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ వీరాభభిమాని 19 ఏళ్ల అమ్మాయి ఆర్యప్రియ భుయాన్ విషయంలో కూడా అదే జరిగింది. సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ (IPL) మ్యాచ్ (RR vs CSK) లో ఈ అమ్మడి హావభావాలు, ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అవుట్‌కు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దెబ్బకి ఈ ఐపీఎల్ పాపులర్ గర్ల్ రాత్రికి రాత్రే లక్షల ఫాలోయర్లను సంపాదించుకుని సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆర్యప్రియ తన హావభావాలతో మిలియన్లకొద్దీ అభిమానులను సంపాదించుంది. కొన్ని సెకన్ల క్లిప్‌తో సూపర్ వైరల్ అయిన ఐపీఎల్ అమ్మాయి ఎవరు? ఆర్యప్రియ భుయాన్ (Aaryapriya Bhuyan) గౌహతికి చెందిన 19 ఏళ్ల టీనేజర్. మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఆర్యప్రియ సోదరి ఆమెను 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సీఎస్కే, ధోనిని పరిచయం చేసింది. అంతే అప్పటినుంచి సీఎస్కే అన్నా, మన మిస్టర్ కూల్ అన్నా పిచ్చి అభిమానం అట.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో ధోనీ ఔట్ : ఏం జరిగిందంటే?చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగ్ఆన్ లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో అభిమానులను నిరాశపర్చింది. ఈక్రమంలో స్టేడియంలోని ఆర్యప్రియ కూడా నిర్ఘాంతపోయింది. ‘అరె ఏంట్రా ఇది’ అన్నట్టు ఫీలింగ్స్ ఇచ్చింది. క్యాచ్ పట్టుకున్న క్రికెటర్ని చంపేద్దామన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కె మ్యాచ్ సమయంలో తనను టీవీలో చూపించారని ఆర్యప్రియకు తెలియదు కానీ వైరల్ ఐపీఎల్ గర్ల్ అభిమానులు అమాంతం పెరిగారు. అప్పటివరకు 800 ఉన్న ఫాలోవర్ల సంఖ్య 1.72K లక్షలకు పెరిగింది. కొందరు ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. మరికొందరు క్రష్ అంటూ కమెంట్ చేశారు. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గా, 'మీమ్ గర్ల్'గా మారిపోయింది.#IPL cameramen supremacy 🤩🤩#Dhoni Fan Girl reaction when #dhoni got out 🥲Chooo cute 🥰🥰🥰#CSKvsRR #RRvCSK #IPL2025 #IPL #IPLOnJioStar pic.twitter.com/7hbhMkh7hr— 𝑅𝒶𝓃𝓃𝒱𝒥💫 (@Rannvijju) March 31, 2025ఆర్యప్రియ ఏమందంటే..తాను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేనని, కొన్ని వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని, అప్పుడపుడు జస్ట్ ట్రావెల్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎంఎస్ ధోని వికెట్‌పై తన స్పందనను చూపించే ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత రాత్రికి రాత్రే లక్షలకు పెరిగిందని నేషనల్ మీడియాతో చెప్పింది. ధోని అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు... ధోని క్యాచ్ అవుట్ అవ్వగానే షాక్ అయ్యా..అందుకే అలాంటి రియాక్షన్ వచ్చింది. ఇది యాదృచ్చికంగా వచ్చింది అంతే అది వైరల్ అయిందని ఆర్యప్రియ పేర్కొంది. ప్రస్తుతానికి దీనిపై తాను, తన కుటుంబం సంతోషంగా ఉన్నామని తెలిపింది.
IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు భారీ షాక్..?
Hyd: భారీ వర్షానికి కారుపై విరిగి పడిన చెట్టు
SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
‘చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది’
సూపర్ హిట్ వెబ్ సిరీస్.. మళ్లీ వచ్చేస్తోంది
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
‘మా పార్టీలో మీ పెత్తనం ఏంటి?’.. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. ఐటీ షేర్లు పతనం
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
పచ్చదనం.. పర్యావరణ సమతుల్యతే లక్ష్యం
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
మమతా బెనర్జీ సర్కార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
'జాక్' నుంచి బ్లాక్‌బస్టర్ ట్రైలర్.. సిద్ధూ ఇరగదీశాడు
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
ఎన్ఆర్ఐల భూములపై పాగా.. రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
సెక్రటరీనే అడగండి.. నేనెళ్లిపోతా!
తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ప్రేమోన్మాది ఘాతుకం
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై హైకోర్టు స్టే
మారుతి సుజుకి కొత్త ధరలు ఇవే..
అర్థంపర్థంలేని చెత్త మాటలు: సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిషేధించిన కర్ణాటక హైకోర్టు: డెడ్‌లైన్ ఫిక్స్
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
RCB Vs GT: బెంగళూరుకు సిరాజ్ షాక్
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
సూపర్ హిట్ వెబ్ సిరీస్.. మళ్లీ వచ్చేస్తోంది
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!
తూచ్.. నేనేం పడిపోలేదు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం
భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
విడాకులు ప్లీజ్
చిరంజీవి సినిమాలో అతిథి?
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు.. వాడీవేడి చర్చ
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
ఇంటిమేట్ సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
సిటీలో దొడ్డు బియ్యమే!
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
కాకాణిపై ఆగని కక్ష సాధింపు చర్యలు..
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
పోటీ పడితే పతకమే!.. అమ్మ కష్టంతో ‘పసిడి పంట’
ఎగుమతులకు టారిఫ్‌ల గండం
భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పు
ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
IPL 2025: సాయి సుదర్శన్ ఖాతాలో ఘనమైన రికార్డు
జిబ్లీ స్టైల్ ఫోటోపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
'హారర్' సినిమా సూపర్‌హిట్.. పార్ట్-3 కోసం లైన్ క్లియర్
అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
కేటీఆర్‌వి పగటి కలలు.. టీపీసీసీ చీఫ్ సెటైర్లు
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
ట్రైలర్లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ
IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు భారీ షాక్..?
Hyd: భారీ వర్షానికి కారుపై విరిగి పడిన చెట్టు
SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
‘చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది’
సూపర్ హిట్ వెబ్ సిరీస్.. మళ్లీ వచ్చేస్తోంది
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
‘మా పార్టీలో మీ పెత్తనం ఏంటి?’.. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. ఐటీ షేర్లు పతనం
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
పచ్చదనం.. పర్యావరణ సమతుల్యతే లక్ష్యం
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
మమతా బెనర్జీ సర్కార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
'జాక్' నుంచి బ్లాక్‌బస్టర్ ట్రైలర్.. సిద్ధూ ఇరగదీశాడు
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
ఎన్ఆర్ఐల భూములపై పాగా.. రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
సెక్రటరీనే అడగండి.. నేనెళ్లిపోతా!
తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ప్రేమోన్మాది ఘాతుకం
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై హైకోర్టు స్టే
మారుతి సుజుకి కొత్త ధరలు ఇవే..
అర్థంపర్థంలేని చెత్త మాటలు: సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిషేధించిన కర్ణాటక హైకోర్టు: డెడ్‌లైన్ ఫిక్స్
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
RCB Vs GT: బెంగళూరుకు సిరాజ్ షాక్
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
సూపర్ హిట్ వెబ్ సిరీస్.. మళ్లీ వచ్చేస్తోంది
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!
తూచ్.. నేనేం పడిపోలేదు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం
భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
విడాకులు ప్లీజ్
చిరంజీవి సినిమాలో అతిథి?
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు.. వాడీవేడి చర్చ
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
ఇంటిమేట్ సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
సిటీలో దొడ్డు బియ్యమే!
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
కాకాణిపై ఆగని కక్ష సాధింపు చర్యలు..
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
పోటీ పడితే పతకమే!.. అమ్మ కష్టంతో ‘పసిడి పంట’
ఎగుమతులకు టారిఫ్‌ల గండం
భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పు
ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
IPL 2025: సాయి సుదర్శన్ ఖాతాలో ఘనమైన రికార్డు
జిబ్లీ స్టైల్ ఫోటోపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
'హారర్' సినిమా సూపర్‌హిట్.. పార్ట్-3 కోసం లైన్ క్లియర్
అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
కేటీఆర్‌వి పగటి కలలు.. టీపీసీసీ చీఫ్ సెటైర్లు
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
ట్రైలర్లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ
సినిమా

అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్ నితిన్–భరత్ చెప్పారు. ప్రదీప్ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్– మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి ఫస్ట్ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్‌కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది. ఇది పవన్ కల్యాణ్ గారి సినిమా టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్ కూడా టైటిల్‌కి యాప్ట్‌గా ఉండడం వల్లే పవన్ కల్యాణ్ గారి టైటిల్ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్‌గా ఉంటుంది. తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్‌గారి ఫ్రెండ్స్ ఈ మూవీ నిర్మించారు. రథన్గారి అద్భుతమైన సంగీతం, బాల్ రెడ్డిగారి విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు.

మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు. బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం. ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్. జి. వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్.. ఇలా ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు.

తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, నటి సంగీత దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో సంగీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. లేటు వయసులో 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు తమకు కుమార్తె జన్మించినట్లు సోషల్‌మీడియా ద్వారా నటి సంగీత తెలిపింది. దీంతో వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.రెడిన్ కింగ్స్లీ, నటి సంగీత దంపతులకు కుమార్తె జన్మించడంతో వారి కుటుంబంలో మరింత సంతోషం నెలకొంది. ఈ క్రమంలో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది. 'మా లిటిల్ ప్రిన్సెస్‌ను అందరూ ఆశీర్వదించాలని సంగీత కోరింది. మా జీవితంలో అద్బుతమైన కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో మీరందరూ నన్ను ఎంతగానో ప్రేమించారు. ఈ శుభవార్తతో మా ఫ్యామిలీ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంతకు మించిన మధురమైన క్షణాలు ఏవీ ఉండవు అనుకుంటున్నాను.' అని సంగీత తెలిపింది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాతో రెడిన్ కింగ్స్లీ బాగా పాపులర్ అయ్యాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.సంగీతకు రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Sangeetha.V🦋 (@sangeetha.v.official)

ఇంటిమేట్ సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
బాలీవుడ్ నటి అనుప్రియా గోయెంకా(Anupriya Goenka) ఒక ముద్దు సీన్లో చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగులో పోటుగాడు, పాఠశాల సినిమాలతో తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టైగర్ 3, పద్మావత్ వంటి సినిమాలతో పాటు పాంచాలి, అసుర్, ఆశ్రమ్ వంటి వెబ్ సిరీస్‌లతో ఆమె మెప్పించింది. కథకు అవసరం అనుకుంటే ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు ఆమె ఏమాత్రం తగ్గదు. అయితే, ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక నటుడు తనతో కావాలనే అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఆ నటుడి వివరాలను గోప్యంగానే ఉంచిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఒక సినిమాకు సంబంధించి ముద్దు సీన్‌ను షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సీన్లో నా దుస్తులు అసౌకర్యంగానే ఉంటాయి. కిస్సింగ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అతను తేలికగా నా నడుము పట్టుకోవచ్చు.. స్క్రిప్ట్‌లో కూడా అదే ఉంది. కానీ, ఆ సమయంలో అతను అసభ్యకరంగా మరోచోట చెయి వేశాడు. దీంతో చాలా బాధపడ్డాను. అలా ఎందుకు చేస్తున్నావ్ అని అతన్ని ప్రశ్నించవచ్చు.. కానీ, అడగలేదు. ఎందుకంటే పొరపాటు అయిందని సింపుల్‌గా చెప్పి వెళ్లిపోతాడని తెలుసు. అందుకే అడగలేదు. తర్వాతి టేక్‌లో ఇలా చేయకండి అంటూ అతనికి చెప్పాను. ఆ సీన్ తీస్తున్నప్పుడు అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. నేనే కంట్రోల్ చేశాను. నాకు రెండుసార్లు ఇలా జరిగింది.' అని అనుప్రియా గోయెంకా చెప్పింది. 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' టెలివిజన్ సిరీస్ గురించి ఆమె మట్లాడినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తాను ఒక సినిమా షూటింగ్ కారవాన్‌లో డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఒక డైరెక్టర్ లోపలికి వచ్చేశాడని తెలిపింది. అనుమతి లేకుండా రావడంతో అతనిపై మండిపడినట్లు కూడా ఆమె పేర్కొంది. సౌత్ దర్శకుడు అని క్లూ ఇచ్చిన ఈ బ్యూటీ కూడా అతని పేరు చెప్పలేదు.
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
క్రీడలు

IPL 2025: సాయి సుదర్శన్ ఖాతాలో ఘనమైన రికార్డు
తమిళనాడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గత కొంతకాలంగా గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ చెన్నై చిన్నోడు.. ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్‌లు ఆడి 48.80 సగటున, 127.19 స్ట్రయిక్‌రేట్‌తో 1220 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన సాయి.. ఓ ఘనమైన ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా చూసినా 28 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఘనత షాన్ మార్ష్‌కు దక్కుతుంది. మార్ష్ 28 ఇన్నింగ్స్‌ల తర్వాత 1267 పరుగులు చేశాడు.ఐపీఎల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లుషాన్ మార్ష్- 1267సాయి సుదర్శన్- 1220లెండిల్ సిమన్స్- 1076మాథ్యూ హేడెన్- 1076క్రిస్ గేల్- 1071భీకర ఫామ్‌లో సాయిప్రస్తుత ఐపీఎల్లో సాయి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి, మరో హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో సాయి ప్రదర్శనలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఇందులో సాయి ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సాయి స్కోర్లు..49 (36) vs RCB63 (41) vs MI74 (41) vs PBKS103 (51) vs CSK 6 (14) vs RCB84* (49) vs RCB65 (39) vs DCఐపీఎల్ అరంగేట్రం నుంచి సీజన్ల వారీగా సాయి స్కోర్లు..2022- 5 మ్యాచ్‌ల్లో 145 పరుగులు (ఓ హాఫ్ సెంచరీ)2023- 8 మ్యాచ్‌ల్లో 362 (3 హాఫ్ సెంచరీలు)2024- 12 మ్యాచ్‌ల్లో 527 (సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు)2025- 3 మ్యాచ్‌ల్లో 186* (2 హాఫ్ సెంచరీలు)సాయి అరంగేట్రం నుంచి గుజరాత్ టైటాన్స్‌కే ఆడుతున్నాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు సాయిని గుజరాత్ రూ.8.50 కోట్లకు రీటైన్ చేసుకుంది.కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో సాయి కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. సాయి 36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 49 పరుగులు చేశాడు. సాయికి బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) తోడవ్వడంతో గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. రెండు విజయాలతో (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సాయి (186 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌లో నికోలస్ పూరన్ (189) ఉన్నాడు. సాయి సహచరుడు బట్లర్ (166) మూడో స్థానంలో నిలిచాడు.

IPL 2025: విరాట్ కోహ్లికి గాయం
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా (బౌండరీని ఆపే క్రమంలో) విరాట్ చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పితో విరాట్ విలవిలలాడిపోయాడు. విరాట్ ఇలా గాయపడటం చాలా అరుదుగా జరుగుతుంది. నొప్పి భరించలేక విరాట్ నేలకొరగడంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేయడంతో విరాట్ కొద్ది సేపటికే రికవర్ అయినట్లు కనిపించాడు. అయినా విరాట్ అభిమానుల్లో ఆందోళన అలాగే ఉండింది. గాయం తర్వాత విరాట్‌లో ముందున్నంత యాక్టివ్నెస్ కనిపించలేదు. దీంతో అభిమానులు విరాట్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. విరాట్ గాయంపై ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సానుకూల అప్డేట్ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరాట్ గాయం చిన్నదేనని ఫ్లవర్ ప్రకటించాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైని వాంఖడే మైదానంలో జరుగనుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు మాత్రమే చేసి అనామక అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ వికెట్ పడిన తర్వాత ఆర్సీబీ టాపార్డర్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టింది. పడిక్కల్ (4), సాల్ట్ (14), పాటిదార్ (12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోర్ (169/8) చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ అద్బుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గానూ అతడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సాయి కిషోర్ (4-0-22-2), అర్షద్ ఖాన్ (2-0-17-1), ప్రసిద్ద్ కృష్ణ (4-0-26-1), ఇషాంత్ శర్మ (2-0-27-1) కూడా తలో చేయి వేసి ఆర్సీబీని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.

నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని.. త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. కాగా హైదరాబాదీ పేసర్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)జట్టులోనూ చోటివ్వలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన సిరాజ్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను పక్కనపెట్టి ఉంటారని పేర్కొన్నాడు.ఆర్సీబీ వదిలేసిందిఅయితే, జాతీయ జట్టుకు దూరం కావడం వల్ల దొరికిన విశ్రాంతిని పొడగించకుండా.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందు ఈ పేస్ బౌలర్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏడేళ్ల పాటు తమతో ప్రయాణం చేసిన సిరాజ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది.టైటాన్స్ అక్కున చేర్చుకుందిఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు సిరాజ్. నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించిందిఈ నేపథ్యంలో భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు.అంతేకాదు.. ‘మీరు నన్ను తీసుకోలేదు కదా!.. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను’ అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకవెళితే కచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.కొత్త బంతితో చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అయితే, నాలుగో ఓవర్లో మాత్రం కాస్త తడబడ్డాడు. లేదంటే.. ఇంకో వికెట్ అతడి ఖాతాలో చేరేదే. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టడం సానుకూలాంశం’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సమయంలో సిరాజ్ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘అతడు కొత్త బంతితో మెరుగ్గా రాణించలేడు. అందుకే పక్కనపెట్టాం’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సిరాజ్‌ను ఉద్దేశించి పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ టైటాన్స్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఆర్సీబీపై ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ విజయంచదవండి: అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!

IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో 158 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లు తీయగా.. ఈ మార్కు తాకడానికి భువీకి 178 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 161 ఇన్నింగ్స్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 191 ఇన్నింగ్స్‌ల్లో 912 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో ఉన్నారు. వీరిద్దరితో సమానంగా అశ్విన్ కూడా 183 వికెట్లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. యాష్‌కు 183 వికెట్ల మార్కును తాకడానికి 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.కాగా, నిన్న సొంత మైదానంలో (చిన్నస్వామి స్టేడియం) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కు (169/8) పరిమితమైంది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్ తన మాజీ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.
బిజినెస్

మారుతి సుజుకి కొత్త ధరలు ఇవే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) చెప్పినట్లుగానే తన వాహన ధరలను పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్నఇన్‌పుట్ ఖర్చులు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగానే ధరలను పెంచడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.మారుతి సుజుకికి తన గ్రాండ్ విటారా అన్ని వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ. 62,000 వరకు పెంచింది. ఈకో రూ. 22500, వ్యాగన్ఆర్ రూ. 14000, ఎర్టిగా రూ. 12500, ఫ్రాంక్స్ రూ. 2500, డిజైర్ రూ. 3000 పెంపును పొందాయి. ఏప్రిల్ 8 తరువాత ఈ కార్లు కొత్త ధరల వద్ద అందుబాటులో ఉంటాయి.2024-25 ఆర్ధిక సంవత్సరంలో మారుతి సుజుకి సేల్స్2024–2025 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 2,234,266 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన మొత్తం అమ్మకాల (2,135,323 యూనిట్లు) కంటే 4.63 శాతం ఎక్కువ. ఈ ఏడాది మొత్తం దేశీయ అమ్మకాలు 17,60,767 యూనిట్లు కాగా.. మిగిలినవి ఎగుమతులు.ఇదీ చదవండి: ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిషేధించిన కర్ణాటక హైకోర్టు: డెడ్‌లైన్ ఫిక్స్

అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.

ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
అమెరికా తాజాగా విధించిన ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా పరిశ్రమకు మినహాయింపు ఇస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొత్తం యూఎస్‌లో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40 శాతం కంటే ఎక్కువగా భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం అమెరికాలోనూ ఔషధాల సంక్షోభాన్ని తీసుకొస్తుందేమోననే ఆందోళనలతో ఈమేరకు వెనక్కి తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారతదేశం తయారు చేస్తున్న జనరిక్ మందుల పాత్రను నొక్కి చెబుతుంది.ఈ సుంకాల మినహాయింపు భారత ఔషధ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుండగా, ఇతర రంగాల్లో అమెరికా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా సుంకాలకు అనుగుణంగా భారత్ యూఎస్ వస్తువులపై సుంకాల్లో మార్పులు చేస్తే వాణిజ్య అడ్డంకులు తొలగిపోయి దేశంలో అగ్రరాజ్య ఎగుమతులు ఏటా 5.3 బిలియన్ డాలర్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఇది రెండు దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తుందనే వాదనలూ లేకపోలేదు.భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్ ఏర్పాటుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.

ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిషేధించిన కర్ణాటక హైకోర్టు: డెడ్‌లైన్ ఫిక్స్
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. రాబోయే ఆరు వారాల్లో రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని వెల్లడించింది. అయితే బైక్ ట్యాక్సీ సేవలను 1988 మోటార్ వెహికల్స్ యాక్ట్ కిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది.రైడ్-హెయిలింగ్ సేవల ఆపరేటర్లు.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించకపోవడం మాత్రమే కాకుండా, మోటార్ వాహన చట్టాలను కూడా ఉల్లంఘించారు. కొందరు బైక్ ట్యాక్సీ డ్రైవర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 93ని అనుసరించి.. కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకూ, ఈ నిషేధం అమలులో ఉంటుంది. అప్పటి వరకు ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్డుపై తిరగడానికి అనుమతి లేదు. వైట్ నెంబర్ ప్లేట్ కలిగిన టూ వీలర్స్ కమర్షియల్ వినియోగానికి అనుమతి లేదు. కాబట్టి బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధం. అయితే దీనికి సరైన చట్టబద్దత అవసరమని కోర్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు.. ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా గుర్తించడానికి కావాల్సిన అనుమతులను ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేము. దీనికి సరైన చట్టం అవసరం అని జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఇక ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిలిపివేయడంతో.. నగరవాసులు చాలా ఇబ్బందులుపడే అవకాశం ఉంది.
ఫ్యామిలీ

ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!

రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
పెంపుడు జంతువులంటే చాలామందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకు వెళ్తుంటారు. అంత వరకు ఓకే గానీ..కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడూ వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇవేం పట్టకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి..పాపం ఆ మూగప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు. అసలేం జరిగిందంటే..ఓ యజమాని తన కుక్క తోపాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ఫ్లాట్‌ఫాంపై రైలు కదిలిపోతోంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండటంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గానీ ఎంతలా యజమాని అదిలించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు. ఆ యజమాని ఆ కుక్కల హడావిడి నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి-ఫ్లాట్‌ఫాంకి మధ్యన పడిపోయింది. ఇక అంతే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో? ఏంటో? అని ఊపిరిబిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి గదా అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)

నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
లక్మే ఫ్యాషన్ వీక్ 2025లో అందమైన మోడల్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సందడి చేశారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్ట్రాప్‌లెస్, థై స్లిట్ బ్లాక్ గౌన్‌లో గ్లామర్ ట్రీట్ అందించిది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అదిరిపోయే డ్రెస్ ధరించి ర్యాంప్‌పై వయ్యారంగా వాక్ చేయడం అభిమానులు ఫిదా కావడం తెలిసిందే. అయితే తాజాగా జాన్వీ కపూర్ మించిన స్టైల్‌తో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోంది మరో మోడల్. ఎవరబ్బా? తెలుసుకుందాం ఈ కథనంలో..లక్మే ఫ్యాషన్ వీక్ 2025 (Lakme Fashion Week)లో జాన్వీ కపూర్ వెనుక నడిచిన మోడల్ తమన్నా కటోచ్ (Tamanna Katoch). ఆమె స్టైల్, ర్యాంప్ వ్యాక్ చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఇదే ఈవెంట్లో జాన్వీ కపూర్ గౌన్‌పై క్లాత్ తీసిన విధానంపై కొందరికి నచ్చలేదు. నడక, స్టైల్ స్టేట్మెంట్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేదు. పైగా డబుల్ సైడెడ్ టేప్ బయటకు కనిపించిందంటూ కొందరు ట్రోల్ కూడా చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఆమె వెనుకాలనే నడిచిన తమన్నా లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. తమన్నా కటోచ్ తన సూపర్ మోడల్ ర్యాంప్ వాక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. షోస్టాపర్ జాన్వితో పోలిస్తే తమన్నానే షోస్టాపర్ అయ్యేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by TAMANNA KATOCH (@tamanna__katoch)బ్లాక్ హాల్టర్నెక్ గౌనులో మెరిసిసోతున్న వీడియోను తమన్నా కటోచ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన లుక్ కి మరింత అందంగా తెచ్చేలా టై-అప్ హీల్స్ ని ఎంచుకుంది. అలాగే స్మోకీ ఐషాడో మేకప్, టై-అప్ హెయిర్‌స్టైల్‌తో అదిరిపోయింది. ఈగ్లింప్స్ను విడుదల చేసిన వెంటనే, నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తారు. ‘‘జాన్వీని ఎవ్వరూ చూడలేదు.. నిన్నే చూశారు..’’, "లైన్ సెకండ్ సే షురు హోతీ హై" అని , "మీ నడకలో ఫైర్ ఉంది! అంటూ యూజర్ల కమెంట్లు వెల్లువెత్తాయి.

సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో
డిజిటల్ మాధ్యమంతో అన్నీ లాభాలే లేనప్పటికీ, దీని ద్వారా దేశంలో మూరుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. తమ అద్భుతమైన కళతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. పెయింటింగ్, క్రాఫ్ట్, మేకప్, ఇలా అద్భుతమైన చేతిపనులతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒక్కోసారి వారి నైపుణ్యం చూసి ఇంటర్నెట్ వినియోగదారులు అబ్బురపడిపోతూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే కొల్హాపూర్‌కు చెందిన మెహందీ/మేకప్ ఆర్టిస్ట్ సోనాలీ(Sonali) ఈమె చేసిన పనికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన గొప్ప పనేంటి? పదండి తెలుసుకుందాం.తన మెహిందీ, మేకప్ కళ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ సోనాలి. ఆమెకు లక్షల్లో ఫోలోయర్లు ఉన్నారు. ఆమె వేసే గోరింటాకు డిజైన్లు చాలా అద్భుతంగా ఉంటూ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక వీడియో కోటికి పైగా వీక్షణలను పొందింది. సోనాలి నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!)అనంత్ అంబానీ రాధిక మర్చంట్ (AnantAmbani-RadhikaMerchant ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన పాప్ స్టార్ రిహన్న (Rihanna) గుర్తుందా. సోనాలీ అచ్చం ఆమెలాగానే మేకప్ వేసుకుంది. రిహన్నాను పునఃసృష్టించిన సోనాలి అందమైన రూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు 12.7 మిలియన్ల వ్యూస్, 6.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెపై ప్రేమను కురిపించారు. కొందరు ఆమె నైపుణ్యాలను ప్రశంసించగా, మరికొందరు ఆమె వేగవంతమైన బ్రష్ స్ట్రోక్స్ మరియు మేకప్ నైపుణ్యాలు , కంటెంట్, ఆమె భాషను మెచ్చుకున్నారు. అమేజింగ్ ఆర్ట్ అంటూ మరికొందరు కొనియాడారు. View this post on Instagram A post shared by mehndi artist sonali (@sonali_mehndi)కమాన్ గైస్.. ఇలాంటి టాలెంట్ వాళ్లను పాపులర్ చేద్దా అంటూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వ్యాఖ్యానించింది. ఇంకా నటి క్రిషన్ ముఖర్జీ కూడా సోనాలి నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయిందంటే ఆమె ఆర్ట్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సోనాలి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో యాక్టివ్‌గా ఉండే సోనాలీ తన మేకప్ నైపుణ్యాల వీడియోను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి లక్షల వ్యూస్, లైక్స్‌తో ఆదరణ పొందుతుంటాయి. ముగ్గురు పిల్లల తల్లిగా ఇంకేం పని చేస్తావని తనను ఎగతాళి చేశారనీ, కానీ తల్లిగా వర్క్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తోందీ వివరిస్తూ చేసిన సోనాలి వీడియో కూడా 6.9 మిలియన్ల మిలియన్ల వీక్షణలను, ప్రేమపూర్వక కామెంట్లను సంపాదించడం విశేషం. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
ఫొటోలు


రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)


మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)


స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)


కూతురు 'శివియా'తో హీరోయిన్ సంగీత.. వైరల్ ఫోటోలు చూశారా..?


ఖరీదైన అపార్ట్ మెంట్ అమ్మేసిన హీరో షారూక్ భార్య (ఫొటోలు)


Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)


ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)


ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లే భార్యకు సీమంతం (ఫొటోలు)


జాన్వీకే తలనొప్పిగా మారిన తమన్నా, ఎవరీమె (ఫోటోలు)
అంతర్జాతీయం

భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది.

ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
లండన్: అట్లాంటిక్ సముద్ర ద్వీప దేశం ఐస్లాండ్లో మరోసారి అగ్ని పర్వతం బద్దలైంది. రెక్జానెక్ ద్వీపకల్పంలోని గ్రిండావిక్ పట్టణ సమీపంలోని అగ్ని పర్వతం నుంచి భారీగా లావా, పొగలు చిమ్ముతుండటంతో మంగళవారం అధికారులు అక్కడున్న 40 నివాసాలను ఖాళీ చేయించారు. ఐస్లాండ్లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్ జియోథర్మల్ స్పాను మూసివేశారు. దాదాపు 800 ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా లావా పెల్లుబకడంతో గతేడాదే ఇక్కడున్న వారందరినీ వేరే చోటుకు తరలించారు. ఉదయం 6.30 గంటలకు లావా ప్రవాహం మొదలై గ్రిండావిక్‌కు ఉత్తరంగా ఏర్పాటు చేసిన రక్షణ బారియర్‌ను దాటుకుని 500 మీటర్ల పొడవున ప్రవహిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర అట్లాంటిక్‌లోని అగ్ని పర్వతాలకు కేంద్రమైన ప్రాంతంలో ఐస్లాండ్ ఉంది. 2010లో ఇక్కడి అగ్ని పర్వతం విస్ఫోటంతో భారీగా వాతావరణంలోకి వెదజల్లిన బూడిద మేఘాలు కొన్ని నెలలపాటు అట్లాంటిక్ మీదుగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగించాయి.

మాండలే.. మరుభూమి
మాండలే: మయన్మార్ భూకంపం దేశంలో రెండో అతి పెద్ద నగరమైన మాండలేను మరుభూమిగా మార్చేసింది. నగరంలో మూడొంతులకు పైగా భవనాలు కుప్పకూలాయి. అవన్నీ క్రమంగా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమితో శిథిలాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. వాటికింద వేలాదిమంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తుండటంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి. కుళ్లుతున్న శవాలతో మాండలే వీధుల్లో ఇప్పటికే భరించలేనంతటి దుర్గంధం వ్యాపించింది.దీనికితోడు మంగళవారం సాయంత్రం కూడా మాండలేను మరో భూకంపం వణికించింది. 5.1 తీవ్రత భూమి కంపించడంతో ఇప్పటికే దెబ్బతిని పగుళ్లిచ్చిన చాలా భవనాలు కుప్పకూలాయి. దాంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేస్తూ గడిపారు. దేశవ్యాప్తంగా భూకంప మృతుల సంఖ్య 2,700, క్షతగాత్రుల సంఖ్య 5,000 దాటాయి. వారి స్మృత్యర్థం మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషం పాటు మౌనం పాటించారు. మయన్మార్‌లో 10 వేలకు పైగా భవనాలు కూలిపోయినట్టు ఐరాస పేర్కొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య అపారంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. మంగళవారం దాకా విపరీతమైన ఎండ కాయగా బుధవారం నుంచి భారీ వర్ష సూచనలు ఆందోళనగా మారాయి. బ్యాంకాక్‌లో 21 మంది...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపానికి 21 మంది బలైనట్టు ఇప్పటిదాకా తేలింది. కుప్పకూలిన నిర్మాణంలోని 30 అంతస్తుల భవనం వద్ద శిథిలాల తొలగింపు ఇంకా కొనసా గుతోంది. అందులో పని చేస్తున్నవారిలో 78 మంది ఆచూకీ తేలడం లేదని అధికారులు తెలిపారు. దానికింద చిక్కినవారి సంఖ్య 300 దాకా ఉంటుందని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి.పాపం పసివాళ్లు!మాండలేకు 40 కి.మీ. దూరంలోని క్యౌక్సే పట్టణంలో ఓ ప్రీ స్కూల్లో 70 మంది చిన్నారుల్లో అత్యధికులు భూకంపానికి నిస్సహాయంగా బలయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని తలచుకుంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మాండలే సమీపంలో కుప్పకూలిన ఓ బౌద్ధారామం శిథిలాల నుంచి ఇప్పటిదాకా 50 మందికి పైగా సన్యాసుల మృతదేహాలను వెలికితీశారు. వాటికింద నలిగి కనీసం మరో 150 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు.మృత్యుంజయులుమయన్మార్ రాజధాని నేపిడాలో భవన శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు ఏకంగా 91 గంటల తర్వాత మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. మరోచోట ఓ ఐదేళ్ల చిన్నారిని, గర్భిణిని కూడా సహాయక బృందాలు కాపాడాయి.
జాతీయం

హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
జమ్మూ: పాకిస్తాన్ సైన్యం మరోసారి హద్దు మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో పాక్ సైన్యం తోకముడిచింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఈ ఘటన జరిగినట్లు భారత సైనిక అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఎల్ఓసీ వద్ద కృష్ణా ఘాటీ సెక్టార్లో తొలుత మందుపాతర పేలుడు సంభవించిందని, ఆ తర్వాత పాక్ భూభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు మొదలయ్యాయని అన్నారు. అక్కడే విధుల్లో ఉన్న భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపిందని తెలిపారు. భారత సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక పాక్ సైన్యం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టంచేశారు. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పట్టు కొనసాగుతోందని తెలియజేశారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో పాక్ సైన్యానికి ఏమైనా ప్రాణనష్టం వాటిల్లిందా? అనేది బయటపెట్టలేదు. ఐదుగురు పాక్ జవాన్లు గాయపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్(సవరణ) బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ బిల్లును తాను అంగీకరించబోనంటూ లోక్‌సభలో బిల్లు ప్రతిని ఆయన చించేశారు. దేశంలో మసీదు, ఆలయం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఆయన బుధవారం లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు. రాత్రికి రాత్రి వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న వారంతా వక్ఫ్(సవరణ) బిల్లుతో యజమానులుగా మారిపోతారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం తమాషా? అని ప్రశ్నించారు. ముస్లింలపై ఎందుకింత ద్వేషం? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వక్ఫ్ బోర్డు అనేది పూర్తిగా ధార్మిక సంస్థ అని స్పష్టంచేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో తాను సూచించిన 10 సవరణలు అంగీకరించాలని కోరారు. ప్రాచీన మందిరాలకే న్యాయం జరుగుతుంది ‘‘ఆర్టికల్ 14 ప్రకారం హిందూ, సిక్కు, జైన, బౌద్ధ ధర్మాలకు చెందిన వారికి సంబంధిత ఎండోమెంట్‌లోని ప్రోత్సాహకాలు వారికే దక్కాలి. పాలనా యంత్రాంగం మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. వారి పాలనా యంత్రాంగంలో వేరే ధర్మానికి చెందిన వారికి అవకాశం ఉండదు. వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలను నూతన వక్ఫ్ బిల్లు ద్వారా తొలగించారు. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డు పాలనా యంత్రాంగంలో భాగం అవుతారు. ఇది ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26ను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వక్ఫ్ ఆస్తులు(అనధికార ఆక్రమణదారుల తొలగింపు) బిల్లు–2014ను ప్రవేశపెట్టి 2024లో ఎందుకు ఉపసంహరించుకున్నారు? అనధికార ఆక్రమణలు జరుగుతున్నాయని భావించినప్పుడు ఆ బిల్లును ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలి. నూతన చట్టం ప్రకారం.. వివాదాస్పద భూముల్లో మసీదులు ఉన్నచోట ఇది ప్రభుత్వ భూమి అని అధికారి నిర్ణయించి ఒక నోటీసు అతికిస్తే అక్కడ మసీదు మూతబడి అది ప్రభుత్వ భూమిగా మారిపోతుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశంలోని ప్రాచీన మందిరాలకు న్యాయం జరుగుతుంది తప్ప ప్రాచీన మసీదులకు కాదు. ప్రస్తుతం ఢిల్లీలో 172 వక్ఫ్ ఆస్తులు దేశ పురావస్తు శాఖ ఆ«దీనంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేని కారణంగా ఇప్పుడు అవి ఇక ప్రభుత్వ భూములుగా మారిపోతాయి’’ అని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు.

బిల్లుపై ఎవరి వాదనేమిటి?
వక్ఫ్. కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి. భారత్‌లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దఖలు పడ్డాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి! వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి! ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో మూడో అతి పెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం రూ.1.2 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13 వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు! వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోదీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇందులోని పలు ప్రతిపాదనలు 14, 26, 26, 29 తదితర ఆర్టికల్స్‌కు పూర్తిగా విరుద్ధమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ రగడపై ఇండియాటుడే న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు తదితరులు, నిపుణులు వాదనలు విన్పించారు. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా అందులోని ప్రతిపాదనలను అంశాలవారీగా విపక్షాలు దుయ్యబట్టాయి.– సాక్షి, నేషనల్ డెస్క్

వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది.న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలోనూ అధికార ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.యూపీఏ పాపమే: రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల మధ్య సంవాదం సభను వేడెక్కించింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ పక్షాలు పేర్కొనగా, బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. వక్ఫ్ బిల్లు పేరును ఉమ్మీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్టు రిజిజు ప్రకటించారు. అనంతరం చర్చను ప్రారంభించారు. వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనని ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. వాటినుద్దేశించే మంత్రి ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయమే తప్ప ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి అత్యంత సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపాం. జేపీసీ సూచించిన పలు సవరణలకు అంగీకరించాం. అయినా విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నాయి. వక్ఫ్ చట్టానికి యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్ల దానికి విపరీతమైన అధికారాలు దఖలు పడ్డాయి. వక్ఫ్ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశాయి. అందుకే ఈ సవరణలు తప్పనిసరయ్యాయి’’ అని రిజిజు అన్నారు. ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ తమ ప్రభుత్వం వేలుపెట్టబోవడం లేదని చెప్పారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్నది భారత్‌లోనే. వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి. అలా జరిగేలా చూడటమే బిల్లు లక్ష్యం. దీనికి మద్దతిస్తున్నదెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. బిల్లును రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే దాడిగా అభివర్ణించారు. రిజుజు చర్చకు బదులిచ్చారు. మైనారిటీలకు భారత్‌ను మించిన సురక్షితమైన దేశం ప్రపంచంలోనే లేదన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా సగర్వంగా నివసిస్తున్నట్టు చెప్పారు.అంతా అంగీకరించాల్సిందే: అమిత్ షా వక్ఫ్ బిల్లు విషయమై దేశంలో అయోమయం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టడం ద్వారా వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో వేలు పెడుతుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ‘‘ఈ సవరణలను మైనారిటీలు ఒప్పుకోరని కొందరంటున్నారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు చేస్తున్న చట్టమిది. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘2014 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు వక్ఫ్ చట్టానికి హడావుడిగా రాత్రికి రాత్రి అడ్డగోలు సవరణలు చేసింది. తద్వారా దాన్ని చట్టాలకు అతీతంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుïÙ్టకరణ రాజకీయాలకు ఇది పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరముండేదే కాదు’’ అని అమిత్ షా అన్నారు. ‘‘యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్లో ఏకంగా 123 ఆస్తులు కేవలం 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయి. ఇలాంటి దారుణమైన అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్ భూములు, ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే తాజా బిల్లు ఉద్దేశం. అంతేతప్ప ఓటుబ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేదు’’ ని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి తీరతామని చెప్పారు. ‘‘కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుంది’’ అని వివరించారు. అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు బిల్లుపై అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. తర్వాత దానికి విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా అవన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయాయి.చర్చకు రాహుల్ గైర్హాజరు సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంక కూడా కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు, ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా బుధవారం సభకు హాజరు కాలేదు. బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. దాంతో బిల్లుపై కాంగ్రెస్ తరఫున చర్చకు రాహులే సారథ్యం వహిస్తారని భావించారు. కానీ చర్చలో పాల్గొనరాదని రాహుల్ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ప్రియాంక కూడా చర్చలో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్‌కు కేటాయించిన గంటా 40 నిమిషాల సమయంలో గౌరవ్ గొగొయ్ తదితర పార్టీలే ఎంపీలే మాట్లాడారు. బీజేపీ నయా మత రాజకీయంలౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ: అఖిలేశ్ వక్ఫ్ బిల్లు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, భారత లౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నయా మత రాజకీయం అని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఓట్ల పోలరైజేషన్ కు, తమకు దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాషాయ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అధికార కూటమిలోకి కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ వాటికీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదని తెలిపారు.
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
రంగారెడ్డి జిల్లా : సంచలనం సృష్టించిన విదేశీ యువతిపై అత్యాచార ఘటనలో రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నిందితుడు మహ్మద్ అస్లాంను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేవలం గంట రెండుగంటల వ్యవధిలోనే నిందితుడు యువతితో పాటు ఆమె స్నేహితుడిని అంతగా ఎలా నమ్మించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడికి ఆంగ్లంపై పట్టుండటంతో చలాకీగా మాట్లాడి ఆకర్షించాడా.. వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు.. గతంలో కూడా ఇదే తరహా ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అస్లాం ఇలాంటి ఘటనకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజిటింగ్ వీసాపై జర్మనీ నుంచి వచ్చిన యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు భారత్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు నివేదికను పంపనున్నారు. ఇదిలా ఉండగా, మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న ఆ యువతి గురువారం అర్ధరాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లనుంది.

ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
హైదరాబాద్: సికింద్రాబాద్–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం


రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు


Japan: మెగా సునామీ వార్నింగ్


సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ చిన్నారుల మృతి కేసులో పురోగతి


AP: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు


దీదీ సర్కార్ కు సుప్రీం బిగ్ షాక్


ఇంకా 6 నెలలు ఎలా అడుగుతారు?


YSRCP నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్


రిపోర్టర్ ప్రశ్నకు కేఏ పాల్ సమాధానం దెబ్బకు అందరూ సైలెంట్


పీ4 మోసం.. రెడ్ బుక్ గోల.. యువరాజు చెప్పిందే వేదం